Latest Updates
-
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది?
కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలం.. సలాడ్‌లో తప్పనిసరిగా ఉండే బ్రోకలీతో హెల్తీ వెరైటీలు.!
పోషకాలు పుష్కలంగా ఉండే బ్రోకలీని ఎక్కువగా సలాడ్‌లో చేర్చుకుంటారు. సలాడ్‌లో మెయిన్‌గా ఉండే క్యారెట్, కీరదోస, బీట్‌రూట్ మాదిరిగా బ్రోకలీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బ్రోకటీని కేవలం సలాడ్‌లా మాత్రమే కాకుండా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఐదు రకాల వంటకాలను చేసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో బ్రోకలీ ముందుంటుంది. ఆవిరిపైన లేదా నీళ్లలో ఉడికించడం ద్వారా క్రంచీగా ఉండే బ్రోకలీని చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక ఇందులోని ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థ మెరుగై జీర్ణక్రియ సులభంగా అయ్యేలా చేస్తుంది. బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ హెల్తీ రెసిపీని మితంగా తీసుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది.
బ్రోకలీ ద్వారా రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఫైబర్ కారణంగా వెంటనే జీర్ణమవుతుంది. త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇంతటి ఆరోగ్యకరమైన బ్రోకలీతో కేవలం సలాడ్ మాత్రమే కాకుండా వివిధ రకాల హెల్తీ వంటలు చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌లో తీసుకోవడం ఇంకా మేలు చేస్తుంది.

బ్రోకలీ సూప్
సూప్ తాగడం అలవాటు ఉన్నవారు బ్రోకలీ, ఉల్లిపాయ, వెల్లుల్లితో రుచికరమైన సూప్ చేసుకోవచ్చు. ఈ మూడింటిని కొద్ది సేపు ఉడకబెట్టాలి. తర్వాత వాటిని రుబ్బి కొద్దిసేపు ఉడికించాలి. ఇష్టమున్నవారు ఇందులో కొన్ని పాలు లేదంటే మిరియాల పొడి కలుపుకొని తాగడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపుడుతుంది.
బ్రోకలీ కట్‌లెట్స్
బ్రోకలీ కట్‌లెట్స్ కోసం ముందుగా దీనిని ఆవిరి మీద ఉడికించాలి. వీటితో పాటు బంగాళాదుపలు, క్యారెట్లు, ఓట్స్ కూడా ఉడకబెట్టాలి. చల్లారాక వీటన్నిటిని కలిపి కొద్దిగా మసాలా వేసి కట్‌లెట్‌లా చేసుకోవాలి. వీటిని చాలా తక్కువ నూనె ఉపయోగించి పైనం పైన కాల్చాలి. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఈ కట్‌లెట్స్ ద్వారా పుష్కలంగా అందుతాయి. స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు.

బ్రోకలీ పనీర్
బ్రోకలీని ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత పనీర్‌ను కొంచెం నూనెలో దోరగా వేయించాలి. తర్వాత పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయ, టమాటా, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక బ్రోకలీ, పనీర్‌ను వేసుకుని వేగనివ్వాలి. కొద్దిగా ఉప్పు, కారం, మసాలా వేసుకుని కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. పనీర్‌లోని ప్రొటీన్, కాల్షియం, బ్రోకలీలోని పోషకాల కారణంగా ఎముకల దృఢత్వానికి దోహదపడుతుంది.
బ్రోకలీ పరాఠా
బ్రోకలీ పరాఠా కోసం ముందుగా బ్రోకలీని తురిమి పెట్టుకోవాలి. అందులో కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా మసాలాలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోధుమ పిండి ముద్దలో నింపి పరాఠాలా ఒత్తుకోవాలి. పెనం పైన నెయ్యి వేసి కాల్చుకుని తింటే రుచిగా ఉంటుంది. తక్షణ శక్తి కోసం బెస్ట్ ఫుడ్
బ్రోకలీ పాస్తా
పాస్తా, బ్రోకలీని విడివిడిగా కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలిలో క్యాప్సికమ్, ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేయించాలి. పాస్తా, బ్రోకలీ వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. విడిగా బ్రోకలీ తినలేని వారి కోసం ఇలా చేయడం ద్వారా ఇష్టంగా తింటారు. పోషకాలు మెండుగా అందుతాయి.
ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా, తాజాగా ఉన్న బ్రోకలీని తింటే సరైన మోతాదులో పోషకాలు అందుతాయి. రంగు మారిన, వాడిపోయిన బ్రోకలీ ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. వంటల్లో వాడే ముందు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఎక్కువ సేపు ఉడికించకూడదు. కాలీఫ్లవర్ మాదిరిగానే తక్కువ సేపు వీటిని బాయిల్ చేసుకోవాలి. లేదంటే పోషకాలు చనిపోతాయి. కొనుగోలు చేసిన కొన్ని రోజుల్లోనే వీటిని వాడాలి. లేదంటే త్వరగా వాడిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications