Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
అలసందలతో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు
సాయంత్రం పూట స్నాక్స్ గా, ఫ్రైగా లేదా వడలు ( గారెలు ) వేసుకుని ఆరగించే అలసందల్లో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. వీటినే కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అని పిలుస్తారు. చౌకగా లభించే ఈ అలసందలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
అలసందల్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజ లవణాలులతో పాటు థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్ తదితర విటమిన్స్ ఉన్నాయి. వీటిని రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు పోపు పెట్టుకుని తింటారు. లేదా వడలు కూడా చేసుకోవచ్చు. గింజలుగా ఉండే వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి రుచికరంగానే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు.

మాంసకృత్తులు
అలసందల గురించి అందరికీ తెలుసు కానీ.. వీటిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయని కొందరికే తెలుసు. ఇవి తక్కువ ఖర్చులో లభించినా.. ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. చేపనూనేలో ఉండే యాసిడ్స్ అలసందల్లో లభిస్తాయి.

గుండె జబ్బు
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు అలసందలను డైట్ లో చేర్చుకుంటే మంచిది. ఇవి బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మధుమేహం
మధుమేహంతో బాధపడే వాళ్లకు అలసందలు మంచి ఆహారం. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నార్మల్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

మలబద్ధకం
మలబద్ధకంతో బాధపడేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం. అలసందలను నానబెట్టి గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటే.. మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.

తక్కువ క్యాలరీలు
అలసందల్లో తక్కువ క్యాలరీలు, తక్కువ ఫ్యాట్ ఉండటంతో బరువు తగ్గించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. బరువు తగ్గించుకోవడంతోపాటు.. ఎక్కువ పోషక విలువలను అలసందల ద్వారా పొందవచ్చు.

ఫైబర్
అలసందల్లో జీర్ణక్రియను మెరుగుపరిచే అలసందల్లో అధిక ఫైబర్ డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజుకో కప్పు తీసుకోవడం ద్వారా ఆకలి వేయదు. పొట్ట నిండినట్లు ఉంటుంది. అలాగే జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడతాయి.

యాంటీ ఆక్సిడెంట్స్
అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వైరల్ ఫీవర్, జలుబు, ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వవు.

చర్మానికి
అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకునేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సి లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మానికి హాని జరగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి.

క్యాల్షియం
అలసందల్లో ఇనుము, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలతో పాటు థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్ వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

ఒత్తిడి
అలసందలను ఎలా వండినా.. ఇష్టంగా తినాలనిపిస్తుంది. అయితే వీటిని తినడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటిచూపు సమస్యలకు కూడా గుడ్ బై చెప్పవచ్చు. అలాగే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications
