For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

|

ప్రస్తుతం చాలామందిలో మధుమేహం ప్రధాన అనారోగ్య సమస్యగా మారింది. ఒత్తిడి, ఆందోళన కారణంగా.. చిన్న వయసులోనే.. తీపి పదార్థాలకి దూరమవ్వాల్సి వస్తోంది. డయాబెటిస్ తోపాటు, గుండె జబ్బులు ఎక్కువగా వేధిస్తున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ మోతాదులో పెరగడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి.

READ MORE: మెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు

డయాబెటిస్ తో బాధపడేవాళ్లు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. తీపి పదార్థాలకు దూరంగా ఉంటూనే.. పౌష్టికాహారం అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా మెంతులు తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుందని.. పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు మందులతో పాటు.. మెంతులను కూడా చేర్చుకుంటే.. సమస్య తీవ్రం కాకుండా.. అదుపులో ఉంటుంది.

READ MORE: మగవాళ్ల ప్రత్యేక సమస్యలు దివ్వౌషదం ఫెనుగ్రీక్ ..!

జుట్టు మెత్తగా ఉంచటానికి మెంతులు నూరి పెట్టుకోవడం తెలిసిందే. పచ్చళ్ళు, రసం, చారు మొదలైన వాటిల్లో మెంతులు వాడుతూ ఉంటారు. ఇవి సువాసనతో పాటు.. కమ్మని రుచిని అందిస్తాయి. డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడేవాళ్లు మెంతులు ఎంత పరిమాణంలో, ఏ రూపంలో తీసుకోవాలో తెలుసుకుందాం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా 50 శాతం ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల రక్తం, మూత్రంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. కొలెస్ట్రారాల్ పెరిగితే గుండె జబ్బులకు ఆస్కారం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిని మెంతులు గణనీయంగా తగ్గిస్తాయి. మెంతులను వంటకాల్లో ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

మెంతులను ఏ మోతాదులో ఉపయోగించాలనేది షుగర్ వ్యాధి తీవ్రతను బట్టి ఉంటుంది. అలాగే శరీరంలో కొలెస్టరాల్ స్థాయిని బట్టి మోతాదు తీసుకోవాలి. వ్యాధి ప్రారంభంలో ఉన్నట్లైతే.. మెంతులను రోజుకు 25 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఒకేసారి మొత్తాన్ని తీసుకోకుండా.. మధ్యాహ్నం, రాత్రి భోజనంతో కలిపి తీసుకుంటే మంచిది.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి లేదా మెంతులను పౌడర్ గా చేసి మంచినీళ్ళు లేదా మజ్జిగలో కలుపుకుని భోజనానికి పావు గంట ముందు తీసుకోవడం మంచిది.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

నానబెట్టిన మెంతులను గుజ్జుగా చేసి, లేదా మెంతి పౌడరును వివిధ రకాల వంటకాల్లో వాడుకున్నా మంచిదే. రొట్టెలు, పెరుగు, దోశ, ఇడ్లి, ఉప్మా లాంటి రకరకాల కూరలు, వంటకాల్లో చేర్చితే మెంతుల చేదు తగ్గుతుంది.. రుచి కూడా బావుంటుంది.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

రక్తంలో, యూరిన్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నంత కాలం మెంతులను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

మెంతులను తీసుకోవడంతోపాటు రోజూ క్రమం తప్పకుండా నడవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. శరీరంలో కొవ్వును చేర్చే పంచదార పదార్ధాలను తీసుకోకుండా నియంత్రించాలి.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్ళలో వేసి రాత్రంతా నాన బెట్టాలి. ఉదయం లేవగానే ఆ నీళ్ళు తాగి, నానిన మెంతులు తింటే ఇన్సులిన్‌లా పని చేస్తుంది.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

మెంతుల్లో ఎన్నో రకాల విటమిన్లతోపాటు మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మెంతులు ఆర్థరైటిస్‌, హై కొలెస్ట్రాల్‌, గాయాలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలను, బ్రాంకైటిస్‌, మలబద్దకం, కడుపులో వికారం, కిడ్నీ సంబంధ వ్యాధులు, గుండెల్లో మంట వంటి సమస్యలు నివారించడానికి సహకరిస్తాయి.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

పదిహేను గ్రాముల మెంతుల పొడిని వేడి నీటిలో మూడు గంటలపాటు నానబెట్టి రోజుకు రెండుసార్లు తీసుకుంటే బ్లడ్‌ షుగర్‌ తోపాటు చెడు కొలెస్ట్రాల్ లెవెల్‌ తగ్గుతుంది.

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..

తేలికపాటి డయాబెటిస్ ఉన్నవారు రెండున్నర గ్రాముల మెంతులను రోజుకు రెండుసార్లు మూడు నెలల పాటు తీసుకుంటే షుగర్‌ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Fenugreek Seeds cure Diabetes in telugu

Fenugreek, popularly called Greek Hay is a wonder medicine curing numerous health problems in no time. The culinary spice is widely used in Asia and some parts of Europe. The seeds contain many nutrients like protein, vitamin C, niacin, potassium, diosgenin, lysine, tryptophan and saponins.
Desktop Bottom Promotion