Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవి వేడిని తట్టుకొనేందుకు సహాయపడే హెల్తీ వెజిటేబుల్స్
వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా సాధారణం. సూర్యని తాపానికి, అధిక వేడితో శరీంలోని నీరంత చెమట రూపంలో బయట విసర్జించబడి శరీరం నీటిశాతాన్ని కోల్పోతుంది. కాబట్టి మీ శరీరం వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలి. వేసవికాలంలో చెమట వల్ల ఒంట్లో నీటిని కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురికావల్సి ఉంటుంది. అధిక చెమట, శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మన శరీరంలో సాల్ట్ కంటెంట్ తగ్గి అది మనల్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది.
డీహైడ్రేషన్ నివారించుకోవడం కోసం వివిధ రకాల కోల్డ్ డ్రింక్స్, జ్యూస్ లు మరియు ఇతర ఐస్ వంటివి తీసుకొనే వేసవి వేడిని బీట్ చేయడం కంటే కొన్ని సమ్మర్ వెజిటేబుల్స్ ను తీసుకోవడం మంచిది.
ఈ సమ్మర్ వెజిటేబుల్స్ హైడ్రేషన్ ను నివారిస్తాయి, మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడంతో పాటు విటమిన్స్ అధికంగా ఉంటాయి . కాబట్టి సమ్మర్ లో మీరు తప్పని సరిగా తీసుకోవల్సిన కొన్ని బెస్ట్ వెజిటేబుల్స్ ను ఈ రోజు మీకు పరిచయం చేస్తున్నాము. ఈ వెజిటేబుల్స్ కోల్పోయిన్ బాడీ టెంపరేచర్ ను తిరిగి పునరుద్దరిస్తుంది. కాబట్టి ఇలాంటి వెజిటేబుల్స్ కు వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాలి.

1. పొట్లకాయ:
మన శరీరంలో నీరు ఉత్పత్తి చేయడంతో పొట్లకాయ సమ్మర్ డీహైడ్రేషన్ ను నివారిస్తుంది .ఇందులో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండటం వల్ల ఇది వేసవిలో వచ్చే వివిధ రకాల జబ్బులను నివారిస్తుంది . హీట్ సమస్యలకు ఇది చాలా మేలు చేస్తుంది.

2. గుమ్మడికాయ:
గుమ్మడికాయ వేసవి సీజన్ లో శరీరాన్ని కూల్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ప్రేగులోని క్రిములను నివారిస్తుంది మరియు ఇది నార్మల్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. దాంతో బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.

3. కాకరకాయ:
వేసవిలో వేడి వల్ల వచ్చే చర్మ సమస్యలు, చెమటకాయలు, స్కిన్ రాషెస్ ను గ్రేట్ గా నివారిస్తుంది . వేసవిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది . అధిక రక్తపోటున్న వారికి ఇది చాల మంచిది.

4. సొరకాయ:
ఇది శరీరంలోనికి చేరిన తర్వాత వాటర్ గా మార్పు చెందుతుంది . వేసవిలో శరీరంలోని నీరు కోల్పోకుండా నివారిస్తుంది మరియు ఇది అనేక పొట్ట సమస్యలను నివారిస్తుంది .

5. అమర్ నాత్ లీవ్స్:
దీన్ని చైనీస్ స్పినాచ్ అనికూడా పిలుస్తారు. వీటిలో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉన్నాయి . వేసవిలో ఇది శరీరంను చల్లబరుస్తుంది మరియు డ్రీహైడ్రేషన్ తగ్గిస్తుంది . అలసటను మరియు నీరసాన్ని నివారిస్తుంది. వేసవిలో వచ్చే సాధారణ జబ్బు మలేరియాను నివారిస్తుంది.

6. బీరకాయ:
బీరయకాయ రక్తంను శుభ్రపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది మరియు వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరిచి, హైబ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది .

7. బూడిద గుమ్మడి:
దీనిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది . దీన్ని సమ్మర్ లో తీసుకోవడం చాలా ఉత్తమం. ఇది మీ శరీరంను హైడ్రేషన్ లో మరియు హెల్తీగా ఉంచుతుంది . ఎక్కువ న్యూట్రీషినయన్ మరియు విటమిన్స్ కలిగి ఉన్నాయి . హైబ్లడ్ ప్రెజర్ కు చికిత్స వంటింది మరియు కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది.

8. కీరదోసకాయ: కీరదోస:
సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఉత్పత్తి అయ్యేటటువంటి వాటర్ రిచ్ ఫుడ్ ఇది. ఇది గార్డ్(బిట్టర్ గార్డ్, రింగ్ గార్డ్, స్నెక్ గార్డ్) ఫామిలికి చెందినది. కాబట్టి ఈ సమ్మర్ లో వీటిని ఎక్కువగా తిని శరీరానికి కావల్సినంత హైడ్రేషన్ ను పొందండి.



Click it and Unblock the Notifications