Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
బొప్పాయ మిల్క్ షేక్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
ప్రస్తుత రోజుల్లో మన శరీరానికి అవసరమయ్యే మరియు సరిపోయే న్యూట్రీషియన్ అందాలంటేనే చాలా కష్టం అయిపోయింది . ఇలాంటి పరిస్థితిలో మన శరీరానికి సరిపడా న్యూట్రీషియన్స్ అందివ్వడానికి బొప్పాయి మిల్క్ గ్రేట్ గా సహాయపడుతాయని అంటున్నారు పోషకాహార నిపుణులు .
ఒక గ్లాస్ పపాయ మిల్క్ తాగడం వల్ల మన శరీరానికి అవసరం మరియు సరిపోయే విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా అందుతాయి . విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బొప్పాయి జ్యూస్: వండర్ ఫుల్ బెనిఫిట్స్
కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ కూడా పిల్లలతో పాటు పెద్దలకు కూడా గ్రేట్ బెనిఫిట్స్ ను అందిస్తాయి. మరి ఇన్ని సుగుణాలున్న బొప్పాయి పండుతో పాటు పాలు చేర్చి స్మూతిలా తయారుచేసి తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ మరింత రెట్టింపు అవుతాయి. మరి పపాయ మిల్క్ లో ఉండే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

ఫైబర్ ఎక్కువగా ఉంటుంది:
మలబద్దంతో బాధపడే వారికి పపాయ మిల్క్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గ్లాస్ బొప్పాయి మిల్క్ లో 10శాతం అంటే 25grm ఫైబర్ పొందుతారు . కాబట్టి రెగ్యులర్ డైట్ లో పపాయ మిల్క్ చేర్చుకోవడం వల్ల బౌల్ మూమెంట్ స్మూత్ గా ఉంటుంది. అందుకు ఫైబర్ సహాయపడుతుంది. అంతే కాదు, ఈ మిల్క్ వల్ల డయాబెటిస్, కార్డియో వ్యాస్కులర్ మరియు ఓబేసిటి రిస్క్ లను తగ్గించడానికి సహాయపడుతుంది.

క్యాల్షియం పుష్కలం:
బొప్పాయి మిల్క్, పేరులోనే ఉందే పాలు అన్న పదం. బొప్పాయి మరియు పాలు రెండింటి కాబినేషన్ లో తయారుచేసే, ఈ బొప్పాయి మిల్క్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది . ఇది బోన్స్ మరియు టీత్ ను స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంచుతుంది . క్యాల్షియ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది మరియు హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

మినిరల్స్ మరియు విటమిన్స్ హై డోస్ లో ఉంటాయి:
బొప్పాయి మిల్క్ లో విటమిన్ సి 88.30మిల్లీగ్రాములు కలిగి ఉంటుంది. విటమిన్స్ యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసి, గాయాలను మాన్పుతాయి మరియు క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి, వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . దాంతో దగ్గు మరియు జలుబు వంటి సమస్యలను నివారించుకోవచ్చు.

స్కిన్ బెనిఫిట్:
బొప్పాయి మిల్క్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మాన్ని హైడ్రేషన్ లోఉంచుతుంది. లో సోడియం లెవల్స్ తగ్గడం వల్ల స్కిన్ హైడ్రేషన్ పెరుగుతుంది . అలాగే చర్మంలో అవాంఛిత మొటిమలు మరియు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది .చర్మాన్ని కాంతివంతంగా మరియు సాఫ్ట్ గా మార్చుతుంది. ఇది నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పరిచేస్తుంది.

రింగ్ వార్మ్ కు మంచి చికిత్సను అందిస్తుంది:
బొప్పాయి మిల్క్ లో కెరోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ గా తీసుకోవాలి . ఇది రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. . బొప్పాయి లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలుండటం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ మరియు స్కిన్ రెడ్ నెస్ తగ్గించడంలో సహాయపడుతుంది.

హెయిర్ బెనిఫిట్స్:
బొప్పాయ మిల్క్ లో ఉన్న ప్రయోజనాలు లెక్కపెట్టలేవి.ఇది జుట్టును బలోపేతం చేస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . దాంతో బట్టతల సమస్య ఉండదు . బొప్పాయ మిల్క్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చుండ్రును నివారిస్తుంది . జుట్టు ఒత్తుగా, షైనీగా మరియు స్ట్రాంగ్ గా పెరుగుతుంది.

మజిల్ టిష్యులు రీగ్రోత్ అవుతుంది:
బొప్పాయ మిల్క్ శరీరానికి అవసరమ్యే స్ట్రెంగ్త్ ను మాత్రమే అందివ్వడం కాదు, మజిల్ టిష్యులను రీగ్రోత్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉండుట వల్ల ఇది మజిల్ హెల్త్ మరియు మజిల్ రిపేర్ కు సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది:
బొప్పాయి మిల్క్ ప్రోటీన్స్ ను బ్రేక్ డౌన్ చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . దాంతో శరీరంలో జీవక్రియలు క్రమంగా పెరుగుతాయి . ఇది జీర్ణ రసాలు స్రవించడానికి సహాయపడుతుంది . ఈ రసాల వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది, ప్రోటీలను మరియు న్యూట్రీషియన్స్ గ్రహించడం జరగుతుంది . వికారం మరియు మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

ఎంపిసీమా:
స్మోకర్స్ ఖచ్చితంగా బొప్పాయ మిల్క్ ను తీసుకోవాలి. బొప్పాయ మిల్క్ లో ఉండే విటమిన్ ఏ స్మోకర్స్ లో వచ్చే ఎంఫిసీమా రిస్క్ ను తగ్గించడానికి సహాయపడుతుంది . ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ సిగరెట్ స్మోకర్స్ కు ఇది గ్రేట్ రెమెడీ

క్యాన్సర్ పేషంట్స్ కు ప్రయోజనకారి:
క్యాన్సర్ తో బాధపడే వారిలో, ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ తో బాధపడేవారు బొప్పాయ మిల్క్ ను తాగడం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది. బీటా కెరోటిన్ క్యాన్సర్ సెల్స్ వ్రుద్ది కాకుండా ఎదుర్కొంటుంది . ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి క్యాన్సర్ ను దూరం చేస్తుందని కొన్ని పరిశోధన ద్వారా కూడా వెల్లడైనది.



Click it and Unblock the Notifications