Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
టమోటో సూప్ లో 10 వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్
ఎర్రగా పండిన టమోటోలను చూస్తే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే . అంతే కాదు అలాంటి టమోటోలతో కలర్ ఫుల్, గోరువెచ్చగా, ఘుమఘులాడే మంచి ఫ్లేవర్ తో, ఘాటైన పోపుదినుసులతో టమోటో సూప్ తయారుచేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఇండియలో అత్యంత సాధారణంగా తయారుచేసుకొనే సూప్ ఇది. టమోటోలను మొదట రోస్ట్ చేసి, తర్వాత మిక్సీలో వేసి , మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కొన్ని ఘాటైన మసాలాలు, మిరియాలు, జికలకర్ర, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కారం వేసి పోపు పెట్టి, టమోటో పేస్ట్ అందులో వేసి తక్కువ మంట మీద బాగా మరిగించాలి. సూప్ చిక్కబడే వరకూ మరిగించి, వేడి వేడిగా లేదా గోరువెచ్చగా తీసుకుంటే ఆమజాయే వేరుగా ఉంటుంది . ఈ హెల్తీ లోక్యాలరీ సూప్ గ్రిల్ట్ సాండ్వించ్ తోపాటు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది . దీన్ని లంచ్ టైమ్ లో లేదా రాత్రి డిన్నర్ కు స్టాటర్ గా తీసుకోవాలి.
టమోటో సూప్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ సూప్ లో ఉండే వివిధ రకాల న్యూట్రీషియన్స్ వల్ల ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా విటమిన్ ఇ, ఎ, సి, కె వంటి మినిరిల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచుతాయి. అంతే కాదు మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తాయి. అవేంటో తెలుసుకుందాం...

బోన్ హెల్త్:
టమోటో సూప్ లో ఉండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. టమోటో సూప్ లో ఉండే లైకోపిన్ కంటెంట్ బోన్ మాస్ ను మెరుగుపరుస్తుంది. దాంతో కీళ్ళనొప్పులను నివారిస్తుంది .

హార్ట్ హెల్త్:
టమోటో సూప్ లో ఉండే విటమిన్ సి ఆర్టిరియల్ ప్రొటక్షన్ కల్పిస్తుంది. ఇది హార్ట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు రక్తనాళాల్లో బ్లాక్స్ ను మరియు హార్ట్ స్ట్రోక్ వంటివి నివారిస్తుంది,. రక్తనాళాల్లో కొవ్వును కరిగించడానికి , బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది, .

లికోపిన్ వివిధ రకాల వ్యాధులతో పోరాడుతుంది:
టమోటోల్లో లికోపిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది . అందుకే టమోటో బ్రైట్ కలర్ కలిగి ఉంటాయి . ఫ్రీరాడికల్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ డ్యామేజ్ ను నివారించడంలో లికోపిన్ గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో ఏజింగ్ ప్రొసెస్ ఆలస్యం అవుతుంది . లికోపిన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్రోనిక్ డిసీజ్ స్ట్రోక్ వంటివి నివారిస్తుంది.

బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది:
టమోటో సూప్ లో ఉండే సెలీనియం బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, అనీమియా నివారిస్తుంది. టమోటో సూప్ తో ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్.

మెంటల్ హెల్త్ :
టమోటో సూప్ లో ఉండే కాపర్ కెంటెంట్ నర్వస్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం నాడులకు సిగ్నల్స్ ను చేరవేస్తుంది. ఇవన్నీ మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

విటమిన్స్:
విటమిన్ సూప్ విటమిన్ ఎ మరియు విటమిన్ సి లు పుష్కలంగా ఉన్నాయి .ఇవి టిష్యు ఏర్పాటుకు గ్రేట్ గా సహాయపడుతాయి. కొత్తకణాల ఏర్పాటకు , చురుకుగా ఉండేందుకు, కండరాల్లో మాస్ టిష్యలను ఏర్పటాటకు సహాయపడుతుంది ఒక బౌల్ టమోటో సూప్ తీసుకోవడం వల్ల 16శాతం విటమిన్ ఎ పొందుతారు. అలాగే విటమిన్ సి లిగమెంట్ హెల్త్ కు చాలా అవసరం అవుతుంది. ఇది ఒక బౌల్ సర్వింగ్ కు 20శాతం విటమిన్ సి పొందుతారు.

బరువుతగ్గడానికి :
టమోటో సూప్ నుఆలివ్ ఆయిల్ తో తయారుచేసినప్పుడు బరువు తగ్గించుకొనే వారికి ఇది చాలా ప్రయోజనకారి. టమోటోసూప్ లో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సమయంలో ఫుల్ గా ఉండేట్లు చేస్తుంది. ఇది క్యాలరీలను కరిగిస్తుంది, కొవ్వును విచ్చిన్నం చేస్తుంది . దాంతో బరువు తగ్గించుకోవచ్చు.

క్యాన్సర్:
టమోటో సూప్ లో లికోపిన్ మరియు కెరోటినాయిడ్ వంటియాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . ఇవి స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ క్యాన్సర్ ను నివారిస్తాయి . టమోటో సూప్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. వారంలో 3సార్లు టమోటో సూప్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్, ప్రొస్టేట్, మరియు కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది.

మేల్ ఫెర్టిలిటి:
పరిశోధన ప్రకారం రెగ్యులర్ గా ప్రతి రోజూ టమోటో సూప్ త్రాగడం వల్ల మేల్ ఫెర్టిలిటి మెరుగుపడుతుంది. టమోటోసూప్ లో ఉండే లికోపిన్ స్పెర్మ్ ను సూపర్ స్పెర్మ్ గా మార్చుతుంది.

డయాబెటిస్:
టమోటో సూప్ లో ఉండే కోమియం బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుందని కొన్ని పరిశోధన ద్వారా కనుగొన్నారు



Click it and Unblock the Notifications