Latest Updates
-
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే!
బేరిపండ్లు తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!
బేరిపండు తియ్యగా, రుచిగా ఉంటుంది. ఇది యాపిల్స్‌కు, సీమదానిమ్మలకు దగ్గర సంబంధం కలిగి ఉంది. ఈ పండు తోలు పసుపు, ఆకుపచ్చ, గోధుమ లేదా ఎరుపురంగులోగాని పై వాటిలో రెండు, మూడు రంగుల కలయికతో గాని ఉంటుంది. లోపలి
బేరిపండు తియ్యగా, రుచిగా ఉంటుంది. ఇది యాపిల్స్‌కు, సీమదానిమ్మలకు దగ్గర సంబంధం కలిగి ఉంది. ఈ పండు తోలు పసుపు, ఆకుపచ్చ, గోధుమ లేదా ఎరుపురంగులోగాని పై వాటిలో రెండు, మూడు రంగుల కలయికతో గాని ఉంటుంది. లోపలిభాగం తెలుపు లేదా లేతపసుపురంగులో ఉంటుంది. బాగా తియ్యగా, రసాత్మకంగా ఉంటుంది. ఈ కండ లోపలగా మధ్యలో గింజలుంటాయి. ఈపండు కింద భాగం చాలా వెడల్పుగా, గుండ్రంగా ఉండి పైకి వచ్చేకొద్దీ సన్నబడుతూ ఉంటుంది.

బేరిపండులో విటమిన్లు ఎ.బి. డి.ఇ. మరియు మినిరల్స్ పొటాషియం, ఫాస్పరస్, మరియు కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ఈ పండులో ఇంకా చిన్న మొత్తంలో ఐరన్ కూడా ఉంది . అయితే చాలా మందికి ఈ బేరిపండు యొక్క ఆరోగ్యలాభాలు గురించి అంతగా తెలియదు. సంవత్సరంలో ఒక్క సీజన్ లో మాత్రమే కనిపించే ఈ బేరికాయ లోక్యాలరీస్ కలిగి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆ సీజన్ లో ప్రతి రోజూ భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల బరువును అతి సులభంగా తగ్గించుకోవచ్చు. రూపం, రంగు, రుచి, పరిమాణం నిల్వ ఉండే లక్షణాల మీద ఆధారపడి ఎన్నో రకాలుగా మనకు లభిస్తోంది. ఆరోగ్య పరంగా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నది. మరి ఆ శక్తివంతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

యాంటీ క్యాన్సర్ గుణాలు:
బేరిపండ్లలో యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో కార్సినోజెన్ సెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. దాంతో కోలన్ బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

హార్ట్ అటాక్ ను నివారిస్తుంది:
బేరికాయ హార్ట్ కు చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ వెల్స్ ను తగ్గిస్తుంది, రెగ్యులర్ గా రోజూ తీసుకుంటే స్ట్రోక్ సమస్యలుండవు.

బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:
బేరిపండ్లలో మినిరల్స్ అధికంగా ఉంటాయి. బేరిపండ్లలో ఉండే బోరాన్ క్యాల్సియం శరీరంలో బాగా అబ్ సార్బ్ అవుతుంది. ఇవి ఎములక ఆరోగ్యానికి చాలా అవసరం. బోన్ బిల్డింగ్ కు సమాయపడుతుంది. బోరాన్ మహిళల ఆరోగ్యానికి చాలా అవసరం అవుతుంది. ఇది ఈస్ట్రోజెన్ ప్రొడక్షన్ ను పెంచుతుంది. ఇది మంత్లీ సైకిల్ ను మెరుగుపచడంలో హార్మోన్స్ ను క్రమబద్దం చేస్తుంది.

ఫ్రీరాడికల్స్ నుండి వయస్సు మీద పడకుండా రక్షణ కల్పిస్తుంది:
బేరిపండ్లలో ఉండే అనేక విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ సి మరియు విటమిన్ కె, ఇతర మినిరల్స్ ఫ్రీరాడికల్స్ నుండి స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. దాంతో వయస్సు మీదపడకుండా ఉంటుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
బేరిపండ్లలో ఉండే డైటరీ ఫైబర్ స్కిన్ స్మూత్ గా ఉంచడానికి సహాయపడుతుంది. స్కిన్ కొల్లాజెన్ ను డ్యామేజ్ అవ్వకుండా సహాయపడుతుంది. బేరిపండ్లను రెగ్యులర్ గా తింటుంటే ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:
బేరిపండ్లలో గ్లిజమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. దాంతో డయాబెటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారిస్తుంది.

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది:
బేరిపండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ శక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైనది:
బేరిపండ్లలో ఉండే ఫోలిక్ యాసిడ్ , గర్భిణి స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. బేరిపండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు చాలా మంచిది.

ఎనర్జీ పెంచుతుంది:
బేరిపండ్లలో గ్లూకోజ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది. రోజంతా చాలా అలసిపోయినప్పుడు, ఒక బేరిపండును తినడం వల్ల ఉల్లాసవంతంగా మార్చుతుంది.

ఆర్థ్రైటిస్, గౌట్ ను నివారిస్తుంది:
రెగ్యులర్ గా బేరిపండ్లు తినడం వల్ల ఆర్థ్రైటిస్ మరియు గౌట్ సమస్యను నివారించుకోవచ్చు.

యాంటీ అలర్జిక్ :
చాలా ఫ్రూట్స్ లో మరియు పియర్స్ అలర్జీ లక్షణాలు తక్కువగా ఉంటాయి. వీటిలో ఎక్సలెంట్ యాంటీ అలర్జిక్ లక్షణాలను కలిగి ఉంటారు,.

వ్యాధినిరోధకత పెంచుతంది
బేరిపండ్లలో వ్యాధినిరోధకత పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా చిన్ని చిన్న జబ్బులను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications