Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
హార్మోన్ల సమస్యా..? ఐతే ఈ ఫుడ్స్ తో హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోండి...!!
ప్రస్తుత కాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వ సాధారణంగా మారింది. అందుకు ముఖ్య కారణం ఒత్తిడితో కూడిన జీవన శైలి మరియు తీసుకొనే అనారోగ్యకరమైన ఆహారం. దాంతో శరీరంలో హార్మోనల్ అసమతుల్యత ఏర్పడి అనేక సమస్యలకు దారి తీస్తుంది. అయితే హార్మోనుల అసమతుల్యత వల్ల పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ సమస్యల ఎవురౌతుంటాయి.
ముఖ్యంగా మనిషి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో ఆరోగ్యంగా ఉండడానికి హార్మోనులు కూడా అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండంగా ఏర్పడినప్పటి నుంచి మనిషి జీవించి ఉన్నంత వరకు శరీరం మీద హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఈ హార్మోన్‌లు ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ అని రెండు రకాలు. ఎక్సోక్రైన్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు నాళాల ద్వారా స్రవిస్తాయి. ఎండ్రోక్రైన్ గ్రంథులకు నాళాలు ఉండవు, వీటి నుంచి వెలువడిన హార్లోన్లు రక్తంలో కలసి శరీరమంతా వ్యాపిస్తాయి.
ఎక్సోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలుగా స్వేదగ్రంథులు, కాలేయాన్ని చెప్పవచ్చు. కాలేయం, క్లోమం జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తాయి. పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథులు ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు. మగవారిలో వృషణాలు, స్త్రీలలో అండాశయాలు కూడా ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు. హార్మోనులు తగినంత విడుదల కావాలి. అవసరానికి మించి విడుదలైనా, తక్కువగా విడుదలైనా దుష్పరిణామాలు కలుగుతాయి.

హార్మోన్ల విధులు:
హార్మోన్లు మానసిక శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి జీవప్రక్రియ, శరీర నియంత్రణ, సంతానోత్పత్తి, వయసుకు తగిన మార్పులు, శారీరక విధులు ఆలోచన, ఆవేశం, సెక్స్ హార్మోన్‌ల వల్లనే కలుగుతాయి శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ ఇన్సులిన్ పాత్ర.
హార్మోనులు సమతుల్యం చేయడానికి కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ ఆహారాలను మీ మూడ్ మార్చడంతో పాటు, ఎనర్జీని అందిస్తాయి . మహిళల్లో హార్మోనుల్లో అసమతుల్యతలు పీరియడ్స్ సమయంలో మరియు మోనోపాజ్ దశలో మరియు గర్బధారణ సమయంలో ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారిలో వారి శరీరంను బట్టి ఉంటాయి . ఈ హార్మోనులను సమతుల్యం చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి కొన్ని బేసిక్ హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకొని, ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలి...

ఆర్గానిక్ ఫుడ్స్:
ఆర్గానిక్ ఫుడ్స్ లో ఎలాంటి రసాయనాలుండవు. టాక్సిన్స్, కెమికల్స్, క్రిమిసంహారక, పెస్టిసైడ్స్ ఉండవు. అందుకే ఆర్గానిక్ ఫుడ్ పవర్ ఫుల్ గా మరియు నేచురల్ గా న్యూట్రీషియన్స్ కలిగి ఉండటం వల్ల ఇవి శరీరంలో హార్మోనులను ట్రాక్ లో ఉంచుతాయి.

క్యాబేజ్:
బ్రొకోలీ, కాలీఫ్లవర్, మరియు క్యాబేజ్ శరీరంలో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఫైబర్:
హార్మోనులను సమంగా ఉంచడంలో ఫైబర్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయడుతాయి . గోధుమలు, బ్రెడ్, బ్రౌన్ రైస్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు హార్మోనులను స్థిరంగా ఉంచడానికి సమాయపడుతాయి.

పచ్చిబఠానీలు:
లెంటిల్స్, పచ్చిబఠానీలు మరియు సోయా బీన్స్ వంటివి కొన్నిప్రత్యేకమైన హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. వీటిలో ఈస్ట్రోజెన్అధికంగా ఉండటం వల్ల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గ్రేట్ గా సహాయపడుతాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోనులను బ్యాలెన్స్ చేస్థాయి . హార్మోనులను కంట్రోల్ చేస్తాయి.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
హార్మోనులు బ్యాలెన్స్ చేయడానికి మరో బెస్ట్ రెమెడీ చేపలు . వారానికొక సారి ఫిష్ తీసుకోవడం వల్ల హార్మోనులను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తున మరియు సాల్మన్ వంటి చేపల్లో ఉండే నూనెలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.వెజిటేరియన్స్ అయితే? ఆలివ్ ఆయిల్, నట్స్, హోల్ గ్రెయిన్స్ చేర్చుకోవాలి.

బెర్రీస్:
బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి? సిట్రస్ ఫ్రూట్స్, గ్రేప్స్ మరియు రెడ్ బెర్రీస్ అన్నీ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications











