Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
కోల్డ్ మిల్క్ లో దాగున్న హెల్త్ సీక్రెట్స్ ...
మన నిత్య జీవితంలో పాలు ఒక భాగం. అత్యంత పోషకవిలువలున్న హెల్తీ డ్రింక్ పాలు. అవునా కాదా? మీకు తెలుసా పాలు కాచి తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు చల్లటి పాలు తాగడం వల్ల మరికొన్ని అదనపు, ఇతర ప్రయోజనాలు అందిస్తాయి.
మన జీవనశైలిలో పాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మన రెగ్యులర్ డైట్ లో వివిధ రకాల ఆహారాలను చేర్చుకోవచ్చు , కానీ పాలు మాత్రం ప్రతి ఒక్కరి డైట్ లోను తప్పనిసరిగా ఉంటాయి. క్రీమీ లిక్విండ్ మిల్క్ అంత్యంతప్రయోజనాలు కలిగినది . ఎక్కువ పోషక విలువలు కలిగినది . కాబట్టి, దీన్ని బ్రేక్ ఫాస్ట్, లంచ్, లేదా డిన్నర్ లో తీసుకోవచ్చు. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. విటమిన్స్ మరియు మినిరల్స్ తో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ ఎ, బి, డి మరియు రిబోఫ్లోవిన్ ను కూడా అధికంగా కలిగి ఉన్నాయి.
పాలలో ఉండే ఈ న్యూట్రీషియన్స్ అన్నీ కూడా మన శరీరానికి అత్యంత అవసరమయినవి. ముఖ్యంగా పాలలో ఉండే క్యాల్షియం, దంతాలు మరియు ఎముకల ఆరోగ్యానికి , ఏర్పాటుకు గ్రేట్ గా సహాయపడుతాయి . మరియు ఇది మజిల్స్ ఏర్పడటానికి గ్రేట్ గా సహాయపడుతాయి. పాలులో కూడా వివిధ రకాలున్నాయి. ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు, గొర్రెపాలు, ఒంటె పాలు . ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈక్రింది స్లైడ్ చూద్దాం...

బరువు తగ్గిస్తాయి:
రెగ్యులర్ డైట్ లో పాలు చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి సరిపడా న్యూట్రీషియన్స్ అందివ్వడంతో పాటు బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది స్ట్రాంగ్ టీత్ అండ్ బోన్స్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి . షుగర్ చేర్చిన పానియాల కంటే నేచురల్ మిల్క్ తో శరీరానికి అత్యంత ప్రయోజనం. ఈ క్రమంలోనే చల్లటి పాలు తాగడం వల్ల బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . బాడీలో క్యాలరీలను కరిగించి నార్మల్ కు తీసుకొస్తుంది.

నిద్రలేమిని దూరం చేస్తుంది:
గోరువెచ్చని పాలు తాగడం వల్ల బాగా నిద్రపడుతుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకు కారణం పాలలో ఉండే అమినోయాసిడ్స్, ట్రైఫోటాన్స్ బ్రెయిన్ లోకి చేరి నిద్రపట్టడానికి ప్రోత్సహిస్తుంది . అదే చల్లటి పాలు తాగడం వల్ల ఇందులో ఉండే ప్రోటీనులు నిద్రలేమి సమస్యను నివారిస్తుంది . కాబట్టి రోజులో ఎప్పుడైనా పాలు తాగొచ్చు.

ఎసిడిటిని తగ్గిస్తుంది:
చల్లటి పాలు తాగడం వల్ల ఎసిడిటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. చల్లటి పాలు తాగడం వల్ల పెప్టిక్ అల్సర్ నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది.

ఆకలిని కంట్రోల్ చేస్తుంది:
ఆకలి కోరికలను తగ్గించడంలో చల్లటి పాలు గ్రేట్ గా సహాయపడుతాయి . చల్లటి పాలలో న్యూట్రీషియన్స్ మాత్రమే కాదు, ఇతర ప్రోటీన్స్, విటమిన్స్ కూడా అధికంగా ఉన్నాయి. పాలు బాగా మరిగించి చల్లార్చిన తర్వాత తాగడం వల్ల ఎక్కువ సమయం ఆకలి అనిపించదు.

కాఫీకి ప్రత్యామ్నాయంగా:
ఈ వేడి వాతారణంలో మరింతే వేడి పానీయాలు తాగాలనిపించదు. కానీ కాఫీ మీద కోరిక మాత్రం తగ్గదు. అటువంటప్పుడు కోల్డ్ కాఫీకి ప్రాధాన్యత ఇస్తే మంచిది.
సగం కోల్డ్ మిల్క్ మరియు సగం కాఫీ తాగడం వల్ల రెండింటి యొక్క ప్రయోజనాలను అందిస్తుంది.

పాలు ఫ్లేవర్డ్ ట్రీట్:
సాధారణంగా పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు, ముఖ్యంగా పచ్చిపాలను అస్సలు ఇష్టపడరు. వారితో పాలు తాగించడం అంటే ఇక చాలెంజ్ తో కూడిన పని. అలాంటి వారికి చల్లటి పాలను వివిధ రకాల ప్లేవర్స్ తో అందిస్తే , వెంటనే తాగేస్తారు . పాలను న్యూట్రీషియన్ స్మూతీగా మార్చుకోవచ్చు. పండ్లలో మామిడి పండ్లతో తయారుచేసే స్మూతిలు చాలా ప్రయోజనాలను అందిస్తాయి . వేసవిలో చల్లటి స్మూతీలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

పోస్ట్ వర్కౌట్ డ్రింక్ కు ఫర్ఫెక్ట్ ట్రీట్:
వ్యాయామం చేసిన తర్వాత , శరీరానికి తగిన ఎనర్జీ అవసరం అవుతుంది. ట్రెడిషినల్ గా కార్బోహైడ్రేట్స్ ను నివారించడం వల్ల క్రమంగా బరుతు తగ్గించుకోగలరు. ఏదేమైనా మన శరీరంలో మజిల్ టిష్యు రిపేర్ కు మరియు ఎనర్జీ అందివ్వడానికి షుగర్ మరియు ప్రోటీనులు ఎక్కువగా అవసరం అవుతాయి . అందుకే ప్రస్తుతం కోల్డ్ చాక్లెట్ మిల్క్ షేక్ మనకు అందుబాటులోకి వచ్చింది . ఇది పర్ఫెక్ట్ పోస్ట్ వర్కౌట్ డ్రింక్ . దీన్ని తయారుచేయడం సులభం మరియు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

చర్మానికి మేలు చేస్తుంది:
పాలల్లో చర్మఆరోగ్యానికి , చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే కొన్ని ప్రత్యేకమైన ఎనర్జీ పదార్థాలున్నాయి. పాలను ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల ముఖంలో మంచి కాంతి వస్తుంది. అలాగే చల్లటి పాలను రెగ్యులర్ గా తాగడం వల్ల మరిన్ని స్కిన్ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.



Click it and Unblock the Notifications