బడ్జెట్ టైట్ గా ఉన్నప్పుడు : బరువు తగ్గడానికి ఈ ఆహారాలు ఎంపిక చేసుకోండి...

ప్రస్తుత రోజుల్లో ప్యాకేజ్డ్ ఫుడ్ , స్ట్రీట్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అంతే కాదు, కొన్ని గ్రీన్ వెజిటేబుల్స్ , ఫ్రూట్స్ కూడా ఫ్రోజోన్ చేసి, ప్యాక్ చేసిన ఫుడ్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఫ్రెష్ ఫుడ్స్, సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కంటే ఇలా ప్యాక్ చేసి, నిల్వచేసిన ఈ ఆహారాలు చాలా ఖరీదైనవి, అనారోగ్యకరమైనవి.

ఇటువంటి నిల్వచేసిన ఆహారాలను కొనుగోలు చేయడం వల్ల ప్యాకెట్ మొత్తం ఖాలీ అవ్వడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. ఇటువంటి ఆహారాలను తినడం వల్ల జబ్బులతో పాటు, శరీరంలో కొవ్వు పెరుగుతుంది. వీటికి బదులుగా ఎప్పటికప్పుడు మార్కెట్లో ఫ్రెష్ గా సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది . అలాగే డబ్బు కూడా ఆధా చేస్తుంది.

అదే విధంగా సూపర్ మార్కెట్లో కొన్ని గ్రాసరీలను కొనుగోలు చేయడానికి వెళ్లినప్పుడు, ప్యాక్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ కార్న్, ఫ్లేవర్డ్ యోగర్ట్, వంటివి ఎంపిక చేసుకోవడానికి బదులుగా ఖరీదైనా పర్వాలేదు, ఫ్రెష్ ఫుడ్స్ ను తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. ఈ క్రింది సూచించిన ఆహారాలు ఆరోగ్యకరమైనవి మరియు చౌకైనవి . మీరు టైట్ బడ్జెట్లో ఉన్నప్పుడు ఈ క్రింది హెల్తీ ఫుడ్స్ ను కొనడం మంచిది..

1. అరటి పండ్లు :

1. అరటి పండ్లు :

మీదగ్గర డబ్బులు లేనప్పుడు, హెల్తీ బాడీని మెయింటైన్ చేయడానికి మార్కెట్లో చీప్ గా, హెల్తీగా అందుబాటులో ఉండే ఆహారం అరటి పండ్లు. ఇవి హార్ట్ మరియు స్టొమక్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. అరటి పండ్లు కొనేటప్పుడు, కొద్దిగా పచ్చిగా ఉన్నవి ఎంపిక చేసుకుంటే రెండు మూడు రోజుల వరకూ ఉంటాయి.

2. గుడ్లు:

2. గుడ్లు:

గుడ్లలో అన్ని రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతాయి. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లను తినడం వల్ల రోజంతా ఫిట్ గా ఉంటారు. రెగ్యులర్ గా గుడ్డు తినడం వల్ల రోజుకు సరిపడా ఎనర్జీని స్లోగా కంటీన్యువ్ గా అందిస్తుంది.

3. లెంటిల్స్:

3. లెంటిల్స్:

అవును, ఎల్లో కలర్ శెనగపప్పు, పెసరపప్పు వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా వీటి ఖరీదు కూడా తక్కువే. లో బడ్జెట్ ఉన్నప్పుడు, మాంసాహారం కొనలేనప్పుడు ఇటువంటి హైప్రోటీన్ త్రుణధాన్యాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇవి శరీరానికి ఆరోగ్యానికి కావల్సిన ప్రోటీన్స్, ఐరన్ , మాంసక్రుత్తులను అందిస్తుంది. వండటం కూడా సులభమే. వీటిని వండటానికి ముందు నానబెట్టుట మంచిది.

4. సెలరీ:

4. సెలరీ:

గ్రీన్ సెలరీ వెజిటేబుల్ బరువు తగ్గడానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు, దీని ఖరీదు కూడా తక్కువే. సెలరీని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇలా తినడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి, బరువు పెరగరు. త్వరగా, తేలికగా జీర్ణం అవుతుంది. అందుకే దీన్ని ‘‘నెగటివ్ క్యాలరీ ఫుడ్ '' అని పిలుస్తారు

5. ప్లెయిన్ యోగ్రర్ట్:

5. ప్లెయిన్ యోగ్రర్ట్:

మార్కెట్లో ప్యాక్ చేసిన పెరుగు కొనడానికి బదులుగా , ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే పెరుగు ఆరోగ్యానికి మంచిది. మరియు ఎఫెక్టివ్ గా ఎనర్జీని అందిస్తుంది. పొట్టను చల్లగా ప్రశాంత పరుస్తుంది. ఫ్లేవర్డ్ యోగ్రర్ట్ ఆరోగ్యానికి మంచిది కాదు, బరువు కూడా పెంచుతుంది కాబట్టి, మార్కెట్లో లభించే యోగ్రర్ట్ ను కొనకపోవడమే మంచిది

6. బాదం మిల్క్:

6. బాదం మిల్క్:

ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్, పాలుకు హెల్తీ ప్రత్యామ్నాయ డ్రింక్ బాదం మిల్క్. తియ్యగా లేని బాదం మిల్క్ ను తీసుకుని, టీ, కాఫీ, స్మూతీస్ మరియు ఓట్ మీల్ తో ఉపయోగించుకోవచ్చు. బాదంలో మిల్క్ లో క్యాల్షియం, విటమిన్ బి12 అండ్ విటమిన్ డి లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాల మేలు చేస్తాయి .

7. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

7. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. ప్యాక్ చేసిన ఆహారాల కంటే ఇవి చాలా చీప్ . గ్రీన్ వెజిటేబుల్స్ లో ఐరన్, క్యాల్షియం, మరియు ఇతర ముఖ్యమైన విటమిన్స్, మినిరల్స్ ఉంటాయి. ఆకుకూరలు, మెంతి ఆకులు, రాడిష్ గ్రీన్ లీవ్స్ వంటి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

8. సీజనల్ ఫ్రూట్ :

8. సీజనల్ ఫ్రూట్ :

సీజనల్ ప్రూట్ ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇవి చీప్, ఫ్రెష్ గా ఉంటాయి. సీజనల్ కానీ ఫ్రూట్స్ ను ఇంపోర్ట్ చేసుకుంటుంటారు.వీటిలో న్యూట్రీషియన్స్ తక్కువగా ఉంటాయి. ఖరీదు కూడా ఎక్కువే..

Story first published: Saturday, October 15, 2016, 10:27 [IST]
Desktop Bottom Promotion