రోజూ ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తాగడం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!

By Swathi

క్యారట్స్ అంటే.. చాలా వరకు అందరికీ ఇష్టంగా ఉంటుంది. ఇవి తియ్యటి రుచి కలిగి ఉండటం వల్ల పిల్లలు, పెద్దలు వీటిని పచ్చిగానే తినేస్తారు. కానీ కొంతమందికి మాత్రం క్యారట్స్ తినడానికి ఇష్టం ఉండదు. ఎన్ని రకాలుగా చెప్పినా.. వీటిని తీసుకోరు. అలాంటప్పుడు జ్యూస్ రూపంలో క్యారట్స్ తీసుకుంటే.. అమోఘమైన ప్రయోజనాలు పొందవచ్చు.

క్యారట్స్ ని కూరలు, పప్పు, కేక్స్, హల్వాలకు ఉపయోగిస్తారు. ఆరంజ్ కలర్ లో ఉండే ఈ వెజిటబుల్ ఆరోగ్యానికి చాలామంచిదని మన చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు చెబుతుంటారు. అయితే.. చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ.. కేవలం ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ ని ప్రతి రోజూ తీసుకుంటూ ఉంటే.. పొందే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

క్యారట్స్ లో విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు క్యారట్ జ్యూస్ 100 క్యాలరీలను అందిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడే ఫైబర్ ని కలిగి ఉంటాయి. క్యారట్లు తినడం కంటే.. జ్యూస్ ద్వారా తీసుకోవడం చాలా తేలికైన పని. రెగ్యులర్ గా క్యారట్ జ్యూస్ తాగడం వల్ల.. రకరకాల వ్యాధుల రిస్క్ ని తగ్గిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. మరి ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

విటమిన్ ఏ

విటమిన్ ఏ

క్యారట్స్ ద్వారా విటమిన్ ఏ పుష్కలంగా పొందవచ్చు. అలాగే వీటిల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి, కంటి చూపు మెరుగవడానికి సహాయపడుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్

బ్రెస్ట్ క్యాన్సర్

ఖచ్చితంగా మూడు వారాల పాటు క్యారట్ జ్యూస్ తాగడం వల్ల ప్లాస్మా కెరోటనాయిడ్స్ మెరుగుపరిచి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. అలాగే ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి, బ్రెస్ట్ క్యాన్సర్ తో ఎఫెక్టివ్ గా పోరాడుతుంది.

స్మోకింగ్ చేసేవాళ్లకు

స్మోకింగ్ చేసేవాళ్లకు

క్యారట్స్ ద్వారా బీటా కెరోటిన్ ని కావాల్సినంత పొందవచ్చు. స్మోకింగ్ చేసేవాళ్లలో లింఫొసిటిక్ డీఎన్ఏ డ్యామేజ్ అవడకుండా, రకరకాల క్యాన్సర్ల రిస్క్ ని తగ్గించడానికి క్యారట్ జ్యూస్ సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

క్యారట్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. సిస్టోలిక్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. అంటే ప్రతిసారి గుండె కొట్టుకున్నప్పుడు గుండె ఎదుర్కొనే సమస్యలతో పోరాడే శక్తిని పొందవచ్చు.

గ్లోయింగ్ స్కిన్

గ్లోయింగ్ స్కిన్

క్యారట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది.. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాగే చర్మం, జుట్టు న్యాచురల్ గ్లో పొందడానికి సహాయపడుతుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్

బ్లడ్ షుగర్ లెవెల్స్

ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తాగడం వల్ల.. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో తక్కువ క్యాలరీలు, షుగర్ తో పాటు.. ముఖ్యమైన పోషకాలు, మినరల్స్ ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తాగితే.. డయాబెటిస్ రిస్క్ కి దూరంగా ఉండవచ్చు.

ఇమ్యునిటీ మెరుపరచడానికి

ఇమ్యునిటీ మెరుపరచడానికి

క్యారట్స్ ని జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల.. ముఖ్యమైన పోషకాలు అందుతాయి. రోజుకి ఒక గ్లాసు తాగితే.. ఇమ్యునిటీ మెరుగవుతుంది. హానికారక బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఎముకల బలానికి

ఎముకల బలానికి

క్యారట్ జ్యూస్ లో విటమిన్ బి6, కే, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవన్నీ.. ఎముకల ఆరోగ్యానికి, బలానికి, బలమైన నరాల వ్యవస్థకు, బ్రెయిన్ పవర్ పెంచడానికి సహాయపడతాయి.

ఐరన్

ఐరన్

ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ ద్వారా రోజుకి కావాల్సిన 6 శాతం ఐరన్ పొందవచ్చు. అలాగే క్యారట్ జ్యూస్ విటమిన్ సి కూడా లభిస్తుంది. వెజిటేరియన్స్ కి అనీమియా రిస్క్ ఉంటుంది. కాబట్టి.. ప్లాంట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. ఐరన్ గ్రహించవచ్చు.

ఎసిడిటీ

ఎసిడిటీ

రక్తంలో ఎసిడిటిని తగ్గించడంలో క్యారట్ జ్యూస్ సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో ఉండే ఆల్కలైన్ నేచర్ జీవక్రియలో ఎసిడిటిని న్యూట్రలైజ్ చేస్తుంది.

మలబద్దకం

మలబద్దకం

మలబద్దకం నివారించడంలో క్యారట్ జ్యూస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొద్దిగా ఆకుకూరలు మిక్స్ చేసి, క్యారట్ జ్యూస్ తయారుచేసుకుని ప్రతి రోజూ తాగడం వల్ల మలబద్దకం నివారించవచ్చు.

శ్వాస సంబంధ సమస్యలు

శ్వాస సంబంధ సమస్యలు

క్యారెట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల శ్వాస సంబంధిత సమస్యలను తేలికగా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవాళ్ల ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తాగడం మంచిది.

ఆర్థరైటిస్

ఆర్థరైటిస్

రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఆర్ధరైటిస్, ఇతర ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ను నివారించుకోవచ్చు.

కిడ్నీలకు

కిడ్నీలకు

ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీల మీద ఎక్కువ ప్రెజర్ పడదు. జీవక్రియలు న్యాచురల్ గా, తేలికగా జరగడానికి ఇది సహాయపడుతుంది.

Story first published: Monday, July 11, 2016, 12:36 [IST]
Desktop Bottom Promotion