Latest Updates
-
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఇలా చేస్తే నో టెన్షన్ -
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.! -
పైన కరకర.. లోపల కరిగే చీజ్.. ఆహా అనిపించే పొటాటో చీజ్ బాల్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
మీతో ఇతరులు హ్యాపీగా ఉండాలంటే.. ఈ 5 విలువైన సలహాలు పాటించాల్సిందే.! -
ఫౌండేషన్ తర్వాత ముఖం ఎందుకు నల్లగా మారుతుంది.. తెలిసీతెలియక చేసే పొరపాట్లు ఇవే.! -
ఇలా చేస్తే కుండపోత వర్షం కూడా ఆగిపోతుందట.. మన పల్లెల్లో చేసే 7 వింత ప్రయోగాలు! -
రోజూ వీటిని ఎలా తీసుకుంటున్నారు.?.. ఆరోగ్యం విషయంలో నేటికీ మారని కొన్ని అపోహలు.! -
ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.! -
రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్.. ఇప్పుడు మీ ఇంట్లోనే నిమిషాల్లో రెడీ! -
పెళ్లయ్యాక భార్య కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా.. అందుకు కారణాలివే.?
వ్యాధులను ధరిచేరనివ్వని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్...!!
సాధారణంగా ఏదైనా దెబ్బతగిలినప్పుడు అక్కడ ఎర్రగా మారి, వాపు వచ్చి మండుతూ నొప్పిగా అనిపించడాన్ని ఇంగ్లిష్‌లో ఇన్‌ఫ్లమేషన్ అంటారు. కొన్నిసార్లు గాయాల కారణంగా ఇన్‌ఫ్లమేషన్(వాపు) వస్తే మరికొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇన్‌ఫ్లమేషన్ రావచ్చు. ఆర్థరైటిస్ వంటి సందర్భాల్లోనూ ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన కార్డియోవాస్క్యులార్ జబ్బుల్లోనూ ఇన్‌ఫ్లమేషన్ కనిపించవచ్చు.
ఇలాంటి సందర్భాల్లో ఉపశమనం కోసం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇస్తారు. కొన్ని నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడితే వ్యాధినిరోధకశక్తి తగ్గడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. అయితే దీనికి బదులు పరిమితంగా మందులు వాడుతూ ఆహారంతో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడమూ సాధ్యనంటున్నారు ఆహార నిపుణులు. వీటివల్ల రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు, శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలను సమకూర్చుకోవచ్చు.

కొన్ని ఆహారాలు ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తే మరికొన్ని ఆహారాలు ఇన్ఫ్లమేసన్ పెంచుతాయి. అంటువంటి ఆహారాల్లో షుగర్ ఫుడ్స్, కొన్ని రకాల నూనెలు, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి . ఇన్ఫ్లమేషన్ ను నేచురల్ గా తగ్గించుకోవాలంటే ఫాస్ట్ ఫుడ్స్ , జంక్ ఫుడ్స్, షుగర్ డ్రింక్స్ మరియు క్యాండీ ఫుడ్స్ నివారించాలి.

ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి ఆరోగ్యానికి బెటర్ గా సహాయపడే ఆహారాల మాత్రమే తీసుకోవాలి. ఈ ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ నేచురల్ గా తగ్గించడం మాత్రమే కాదు, నేచురల్ గా మీరు ఆరోగ్యంగా ఉన్న ఫీలింగ్ ను కలిగిస్తుంది . మీరు తీసుకునే ఆహారాలే మీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు..ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తాయి.

రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల్లో క్యుర్సిటిన్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాప్ససిన్, జింజరోల్, బ్రొమోలిన్ మరియు కుర్కుమిన్ పుష్కలంగా ఉన్నాయి . ఇవన్నీ మసాలా దినుసుల్లో మరియు చిల్లీ పెప్పర్స్, అల్లం మరియు పసుపులో కనుగొనవచ్చు. పైనాపిల్లో బ్రొమైలిన్ పుష్కలంగా ఉంటుంది,. . ఇన్ఫ్లమేసన్ తగ్గించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

అలాగే వెజిటేబుల్స్ లో క్యాబేజ్, బ్రొకోలీ, కాలీఫ్లవర్, మరియు కేల వంటివి ఇన్ఫ్లమేషన్ ను నేచురల్ గా తగ్గిస్తాయి . ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో మిరాకిల్ ఫుడ్స్ అని చెప్పొచ్చు.

వీటిలో వెరైటీ ఔషధగుణాలు కలిగి ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇవి అనేక రకాల జబ్బులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . వీటిలో వండర్ ఫుల్ హీలింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి, వీటిని తప్పనిసరిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications