Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఉదయం ఖచ్చితంగా తినకూడని కొన్ని ఆహారాలు
సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో తీసుకొనే ఆహారాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెబుతారు. అందులో మన దినచర్యను హెల్తీ ఫుడ్స్ తో ప్రారంభించినట్లైతే , మన శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్లు, న్యూట్రీషియన్స్, విటమిన్లు పూర్తిగా బాడీ గ్రహించడం వల్ల ఆరోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా...ఎనర్జిటిక్ గా ఉంటారు . అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను కూడా ఉదయం సమయంలో తీసుకోకూడదంటున్నారు ఆహార నిపుణులు, మరి అవేంటి?
మన ప్రతి రోజూ ఉదయం తీసుకొనే మొదటి ఆహారం మన శరీరానికి అవసరం అయ్యే ఇంధనం వంటిది. రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . మిమ్మల్ని అలసటక మరియు బద్దకానికి గురైనప్పుడు, అది కూడా ఉదయం సమయంలో ఇలాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు , ఇక ఆరోజంతా మగతగానే అనిపిస్తుంది.
తాజా పండ్లను ఉదయం తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్
మరియు బ్రేక్ ఫాస్ట్ మీ ఆకలిని సాటిస్ఫై చేస్తుంది. అంతే కాదు మీరు తీసుకోనే ఉదయం అల్పాహారం మద్యహ్నాన భోజనం తీసుకొనే వరకూ మీకు ఆకలి అవ్వకుండా చేస్తుంది. దాంతో పాటు మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. అయితే ఉదయం తీసుకొనే కొన్ని ఆహారాలు శరీరానికి ఒంటబట్టకు తిరిగి మిమ్మల్ని నిస్తేజంగా మార్చుతుంది.
అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
ఇంకా మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఎంపిక మీద జాగ్రత్తగా ఉండాలి . మరి బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

బ్రెడ్ అండ్ జామ్:
చిన్న వయస్సు నుండి బ్రెడ్ అండ్ జామ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఉదయం సమయంలో జామ్ తీసుకోవడం నిజంగా ఆరోగ్యానికి అంత మంచిది కాదు . జామ్ కు ప్రత్యామ్నాయంగా బ్రెడ్ అండ్ ఎగ్ తీసుకోవడం లేదా కేవలం గుడ్డు మాత్రమే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

ప్రొసెస్డ్ మీట్:
రోజులో ప్రొసెస్ చేసిన ఆహారాలు డేలో ఎప్పుడు తీసుకొన్నా ఆరోగ్యానికి హానికరమే . అదే విధంగా ఉదయం తీసుకోవడం కూడా హానికరమే. ప్రొసెస్ చేసిన మాంసాహారాల్లో నైట్రేట్స్ ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది.

డోనట్స్:
డోనట్స్ పాస్టీస్ లేదా మైదాతో తయారుచేసిన ఇతర ఏ పదార్థాలైనా సరే మార్నింగ్ తీసుకోవడం చాలా చెడు అలవాటుగా గుర్తించాలి. హెల్తీ ఫుడ్స్ ను ఎంపికచేసుకోవాలి.

బర్గర్:
ఇంకా బర్గర్ వంటివి కూడా ఉదయం సమయంలో తీసుకోవడం కూడా చెడే..చాలా మంది , ఈ మోడ్రన్ ప్రపంచంలో సమయం లేక ఇలాంటి రెడీ మేడ్ బర్గర్స్ ను పిక్ చేసుకుంటుంటారు . వీటి తయారీకి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ మరియు సాస్, ఆడిటివ్స్ వంటివి ఆరోగ్యానికి చాలా హానికలిగిస్తాయి.

షుగరీ జ్యూస్:
ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. షుగర్ కంటెంట్స్ ఉన్నవి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం ఒక బ్యాడ్ చాయిస్ అనే చెప్పుకోవచ్చు . అందుకు వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు అవసరం అయ్యే ఎనర్జీ, న్యూట్రీషియన్స్ ను పొందవచ్చు .

గ్రెయినీ ప్రొడక్ట్స్ :
చాలా వరకూ సెరల్ ప్రొడక్ట్స్ గ్రెయిన్స్ తో తయారుచేసినవే . వీటిలో గ్లూటిన్ మరియు షుగర్స్ ఉంటాయి. కాబట్టి సెరెల్స్ ఉదయం తీసుకోవడం అంత ఆరోగ్యకరం కాదు.

స్వీట్స్ అండ్ డిజర్ట్స్:
మీరు షుగర్ మరియు స్వీట్స్ కు వ్యసనపరులుగా మారిఉన్నా, ఉదయం మాత్రమే స్వీట్స్ మరియు డిజర్ట్స్ తీసుకోకూడదు. ఇలాంటి వాటిల్లో షుగర్స్ అధికంగా ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ మరియు మైదాతో తయారుచేస్తారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను అమాంతంగా పెంచేస్తుంది.



Click it and Unblock the Notifications
