Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
హెల్తీ ఐడియా..!! డైలీ డైట్ లో ఉప్పుడు బియ్యం..!
మీరు బరువు తగ్గాలనే ఆలోచనలో.. టేస్టీ ఫుడ్ మిస్ అవుతున్నారా ? రైస్ తినాలని ఉన్నా.. తినలేకపోతున్నారా ? కొన్ని రకాల వంటకాల్లోకి అంటే చికెన్ కర్రీ వండామంటే.. రైస్ ఉంటే మరింత రుచికరంగా ఉంటుంది. కానీ.. వెయిట్ లాస్ డైట్ లో ఉండటం వల్ల రైస్ తినకూడదని.. మీ నోరు కట్టేసుకుంటున్నారా ?
అయితే మీకొక హెల్తీ ఐడియా !! మీ డైట్ లో నుంచి వైట్ రైస్ ని తీసేసినప్పుడు.. ఉప్పుడు బియ్యంను ఎందుకు చేర్చుకోకూడదు ? ఎందుకంటే.. ఇవి పైపొట్టు తీయకుండా ఉండే బియ్యం. ఎలాంటి పాలిష్ లేకుండా ఉండే ఈ బియ్యం సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వైట్ రైస్ ని నానబెట్టి, ఆరబెట్టి.. పొట్టు తీసేస్తారు. కానీ.. ఉప్పుడు బియ్యం అలా కాదు. అన్ని పోషకాలు ఈ బియ్యంలో ఉంటాయి.
ఒక గ్లాసు అన్నం గంజి ( రైస్ వాటర్ )తో పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్
వైట్ రైస్ నే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. కానీ.. అన్ని పోషకాలు తొలగించిన తర్వాత వీటిని మనం సేవిస్తున్నాం. పొట్టు తీసే ప్రాసెస్ లోనే పాలీష్డ్ బియ్యం అన్ని నూట్రియంట్స్ ని కోల్పోతాయి. కాబట్టి.. పొట్టు తీయని వాటినే ఉప్పుడు బియ్యం అంటారు. ఈ బియ్యంను డైట్ లో చేర్చుకోవడం వల్ల రకరకాలుగా ప్రయోజనం పొందవచ్చని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. కాబట్టి.. ఉప్పుడు బియ్యంను మీ డైట్ లో చేర్చుకోవడం హెల్తీ అనడానికి కారణాలేంటో చూద్దాం..

యాంటీ ఆక్సిడెంట్స్
ఉప్పుడు బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. అలాగే ఫైటో నూట్రియంట్స్ ఉంటాయి. ఇవన్నీ.. ఇన్ల్ఫమేషన్, క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తాయి.

మినరల్స్
కేవలం ఒక కప్పు ఉప్పుడు బియ్యంలో 2 నుంచి 3 శాతం క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం పొందవచ్చు. రోజుకి అవసరమైన మోతాదులో మినరల్స్ పొందడానికి ఒక కప్పు ఉప్పుడు బియ్యం సరిపోతాయని నిపుణుల సూచన.

బ్లడ్ ప్రెజర్
ఉప్పుడు బియ్యంలో మాంగనీస్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఇది బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ ని అరికడుతుంది.

ఇమ్యునిటీ
ఉప్పుడు బియ్యం రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల.. జింక్ అంది.. వ్యాధినిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇమ్యునిటీ లెవెల్స్ పెరుగుతాయి.

విటమిన్స్
మీరు విటమిన్స్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటే.. ఉప్పుడు బియ్యం చక్కటి పరిష్కారం. వైట్ రైస్ తో పోల్చితే.. ఉప్పుడు బియ్యంలో విటమిన్స్ రెట్టింపు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా నైయాసిన్, రైబో ఫ్లేవిన్, విటమిన్ బి6, న్యూట్రియంట్స్ ఎక్కువగా పొందవచ్చు. దీనివల్ల మెటబాలిజం పెరిగి.. ఆహారం ఎనర్జీగా మారుతుంది.

డయాబెటిస్
ఉప్పుడు బియ్యంలో గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది షుగర్ పేషంట్స్ కి మంచి ఆహారం. ఈ బియ్యంను డైట్ లో చేర్చుకుంటే.. షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియ
ఉప్పుడు బియ్యం జీర్ణవ్యవస్థ స్మూత్ గా రన్ అవడానికి సహాయపడుతుంది. సాధారణంగా వచ్చే జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. డయేరియా, కాన్స్టిపేషన్ సమస్యలను దూరం చేస్తుంది.



Click it and Unblock the Notifications