Latest Updates
-
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.!
మొలకెత్తిన వెల్లుల్లి పాయల్లో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు...!!
సాధారణ వెల్లుల్లి కన్నా మొలకెత్తిన వెల్లుల్లిలో అంతకు రెట్టింపు పోషకాలు లభిస్తాయి. ఈ క్రమంలో వెల్లుల్లిని ఎలా మొలకెత్తించి తయారు చేసుకోవాలో, దాని వల్ల ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు త
వెల్లుల్లితో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీంట్లో గుండెను పరిరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, వెల్లుల్లి సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్‌గా కూడా పనిచేస్తుంది. అయితే వెల్లుల్లిని సాధారణ రూపంలో కాక మొలకెత్తించి తీసుకుంటే దాంతో ఇంకా అనేక లాభాలు ఉంటాయి. సాధారణ వెల్లుల్లి కన్నా మొలకెత్తిన వెల్లుల్లిలో అంతకు రెట్టింపు పోషకాలు లభిస్తాయి. ఈ క్రమంలో వెల్లుల్లిని ఎలా మొలకెత్తించి తయారు చేసుకోవాలో, దాని వల్ల ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకెత్తిన వెల్లుల్లిపాయల్లో సాధారణం కన్నా ఓ మోస్తరు ఎక్కువగానే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మొలకెత్తుతున్న వాటిలో మెటాబొలెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయట. ఇవి మొలకలు మొక్కలుగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడతాయట. ఆ క్రమంలో వాటికి వ్యాపించే చీడ పీడల నుంచి మొక్కలకు రక్షణనిస్తాయట. అలాంటిది ఆ మెటాబొలెట్స్ ఉన్న మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే మనకు కూడా అలాంటి లాభాలే కలుగుతాయి. ప్రధానంగా పలు రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు నయం అవుతాయి.'వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం..

గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. రక్త సరఫరా మెరుగు పడి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

క్యాన్సర్ నివారణి
మొలకెత్తుతున్న వెల్లుల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని అన్నాం కదా. అవును, అయితే అవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా చూడడమే కాదు, క్యాన్సర్ కణాలను వృద్ధి చెందనీయవు.

ఏజింగ్ సమస్యను నివారిస్తుంది :
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కారణంగా వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. దీంతో చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.

స్టోక్ నివారిస్తుంది:
మొలకెత్తిన వెల్లుల్లిలో అంజోనిన్ అనేకంటేంట్ అధికంగా ఉండటం వల్ల బాడీలో బ్లడ్ క్లాట్స్ నివారిస్తుంది, దాంతో స్టోక్ సమస్య ఉండదు. మొలకెత్తిన వెల్లుల్లిపాయలను తింటుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు తినిపిస్తే వారి మెదడు వికసిస్తుంది. బుద్ధి పెరుగుతుంది. నాడులన్నీ ఉత్తేజం అవుతాయి. స్టోక్ నివారిస్తుంది.

వ్యాదినిరోధకత పెంచుతుంది:
మొలకెత్తిన వెల్లుల్లి రెబ్బలను రెగ్యులర్ గా తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. శరీరంలో ప్రతి కణం ఉత్తేజపరుస్తుంది. వ్యాధులను , ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.

బిపి తగ్గిస్తుంది:
మొలకెత్తిన వెల్లుల్లి రక్తప్రసరణను తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తం పల్చగా అన్ని అవయవాలకు చేర్చుతుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉండటం వల్ల హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

మతి మరుపు నివారిస్తుంది:
మొలకెత్తిన వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కంటెంట్ బ్రెయిన్ సెల్స్ ను ఉత్తేజపరుస్తుంది. మతిమరుపు, ఆల్జైమర్స్ వంటి లక్షణాలను నివారిస్తుంది.

మొలకెత్తిన వెల్లుల్లి తయారీ విధానం ఇలా...
ఒక చిన్నపాటి కప్పు లేదా గ్లాస్‌లో దాని టాప్ వరకు శుభ్రమైన నీటిని నింపాలి. ఇప్పుడు ఓ వెల్లుల్లి రెక్క లేదా పూర్తిగా వెల్లుల్లి మొత్తాన్ని తీసుకుని దానికి చిత్రంలో చూపినట్టుగా 3 వైపులా టూత్‌పిక్‌లను గుచ్చాలి. అనంతరం ఆ టూత్‌పిక్‌ల సహాయంతో వెల్లుల్లిపాయను కప్పు పై భాగంలో ఉంచాలి. అయితే వెల్లుల్లి కింది భాగంలో ఉండే వేర్ల వరకు మాత్రమే నీటిలో మునిగేలా వెల్లుల్లిని ఉంచాలి. అంతే, ఒక 5 రోజులు ఆగితే వెల్లుల్లి మొలకెత్తుతుంది. అయితే వెల్లుల్లిని ఉంచిన కప్పును కిటికీల వంటి ప్రదేశాల్లో, సూర్యరశ్మి తగిలేలా ఉంచాలి. దీంతో మొలకలు బాగా వస్తాయి.



Click it and Unblock the Notifications
