Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన ప్రొటీన్ రిచ్ ఫుడ్స్
శరీరానికి ప్రొటీన్స్ చాలా కీలకం. ప్రొటీన్స్ ఉండే ఎమినో యాసిడ్స్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ప్రొటీన్స్ ముఖ్యమైన మెటబాలిక్ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తాయి. ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలంటే.. ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. కండరాలు, ఎముకలు, టిష్యూస్ పెరుగుదల, డెవలప్ మెంట్ కి.. ప్రొటీన్స్ చాలా అవసరం.
ఇమ్యునిటీ తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి ప్రొటీన్స్ సహాయపడతాయి. అలాగే జీర్ణశక్తి, మెటబాలిజం, సర్క్యులేషన్ సజావుగా సాగడానికి కావాల్సిన శక్తిని ప్రొటీన్స్ అందిస్తాయి. శరీరానికి ఎంజైమ్స్, హార్మోన్స్, ఇతర శరీర కెమికల్స్ ఉత్పత్తి చేయడానికి మైక్రోన్యూట్రియంట్స్ చాలా అవసరమవుతాయి. శరీరంలో ప్రొటీన్స్ తగ్గిపోతే.. కండరాల టీష్యూస్ తగ్గుతాయి, హార్ట్ వీక్ గా అవుతుంది, ఇమ్యునిటీ బలహీనమవుతుంది. చాలా అరుదుగా.. మరణానికి కూడా కారణమవుతాయి.
మరి శరీరానికి ఎంతో అవసరమైన ప్రొటీన్ రిచ్ ఫుడ్ ని ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాల్సిందే కదూ. మరి హెల్తీగా ఉండటానికి సహాయపడే ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటో మీరేచూడండి..

మాంసాహారం
మేక, గొర్రె వంటి మాంసాహారాల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. లిమిట్ గా తీసుకోవాలి. అలాగే స్కిన్ లెస్ చికెన్ తినడం వల్ల కూడా ప్రొటీన్స్ పొందవచ్చు. అలాగే కోడిగుడ్లు కూడా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ పొందవచ్చు.
చేపలు
చేపల్లో గుండెకు మేలు చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ట్యూనా, సార్డీన్, ట్రాట్ వంటి చేపలు తీసుకోవడం వల్ల.. ఎక్కువ ప్రొటీన్స్ పొందవచ్చు. వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది.

నట్స్
బాదాం, పిస్తా, ఆక్రోట్ వంటి నట్స్ ని రెగ్యులర్ గా తీసుకోవాలి. అయితే లిమిట్ గా తీసుకోవడం మంచిది. వీటిని సలాడ్లు, ఉడికించిన కూరగాయలతో కలిపి తీసుకుంటే.. టేస్ట్ తో పాటు, కావాల్సిన ప్రొటీన్స్ అందుతాయి.
డైరీ ప్రొడక్ట్స్
కండరాల నిర్మాణానికి సహాయపడే ప్రొటీన్స్ డైరీ ప్రొడక్ట్స్ ద్వారా పుష్కలంగా లభిస్తాయి. మధుమేహం, గుండె జబ్బు, రక్తపోటు తగ్గడానికి ఇవి గ్రేట్ గా సహాయపడతాయి. అయితే కొవ్వు తీసేసిన పాలు తీసుకోవడం చాలా మంచిది.
వెజిటబుల్స్
పచ్చి బఠాణీలు, రాజ్మా గింజలు, చిక్కుళ్లు వంటి వాటిల్లో ప్రొటీన్స్ లభిస్తాయి. వీటిని వారంలో కనీసం ఒకసారైనా.. డైట్ లో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ అందిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications