Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
రెడ్ కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో దాగున్న రియల్ హెల్త్ సీక్రెట్స్
రెడ్ కలర్ లో ఉన్న యాపిల్స్ మాత్రమే కాదు.. ఇంకా రెడ్ కలర్ లో ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేకుండా చూస్తాయి.. రెడ్ ఫ్రూట్స్.
రెడ్ కలర్ లో నిగనిగలాడుతూ ఉండే ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపెన్, యాంటోసైయానిన్స్ ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. గుండె సంబంధిత వ్యాధులు, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వాటితో పోరాడతాయి. అలాగే స్ట్రోక్ రిస్క్ తగ్గిస్తాయి.
రెడ్ కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి.. అలాంటి రియల్ హెల్త్ సీక్రెట్స్ దాగున్న రెడ్ కలర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏంటో చూసేద్దామా..

రెడ్ యాపిల్స్
రెడ్ యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇవి డయాబెటిస్ ని కంట్రోల్ చేసి, లంగ్, కోలన్, బ్రెస్ట్, లివర్ క్యాన్సర్ లను అరికడతాయి. అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.

టమాటా
టమోటాల్లో విటమిన్ సి, బయోటిన్, మోలిబ్డెనిమ్, విటమిన్ ఈ, విటమిన్ కె, విటమిన్ ఏ ఉంటాయి. అలాగే పొటాషియం, కాపర్, మాంగనీస్, డైటరీ ఫైబర్ ఉంటాయి. ఇవి ఏజింగ్ ని అరికట్టి.. హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గిస్తాయి.

దానిమ్మ
దానిమ్మలో ఫ్లేవనాయిడ్స్ హై లెవెల్ లో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ డిసీజ్, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి వాటిని అరికడతాయి. అలాగే బ్లడ్ ప్రెజర్ నివారించడానికి సహాయపడతాయి.

రెడ్ గ్రేప్స్
రెడ్ గ్రేప్స్ చూడ్డానికే చాలా ఎట్రాక్టివ్ గా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, ఫోలేట్, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. చర్మ సమస్యలను నివారిస్తాయి.

చెర్రీస్
చెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గోట్, కీళ్ల నొప్పులు, క్యాన్సర్, డయాబెటీస్ ని అరికడతాయి. వీటిల్లో పొటాషియం, విటమిన్ ఏ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

పుచ్చకాయ
పుచ్చకాయలో విటమిన్ ఏ, బి6, విటమిన్ సి ఉంటాయి. అలాగే ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్ రిస్క్ తగ్గిస్తాయి.

బీట్ రూట్
రోజుకి కావాల్సిన ఫోలేట్ లో బీట్ రూట్ 19 శాతం ప్రొవైడ్ చేస్తుంది. విటమిన్ బి ఉండటం వల్ల కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. ఇందులో ఉండే బెటానిన్ ఇమ్యునిటీ పెంచుతాయి.

క్యాప్సికమ్
క్యాప్సికమ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.. ఇవి బ్లడ్ వెజెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి శరీరంలోని మెటబాలిజంను పెంచుతాయి. వీటిని డైట్ లో చేర్చుకుంటే.. బరువు తగ్గిస్తాయి.

స్ట్రాబెర్రీస్
స్ట్రాబెర్రీస్ చూడగానే ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఇందులో ఫోలేట్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి ఇమ్యునిటీ పవర్ పెంచుతుంది. ఫోలేట్, ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి చాలా మంచిది. బర్త్ డిఫెక్ట్ ల రిస్క్ నుంచి స్ట్రాబెర్రీస్ కాపాడుతాయి.

క్రాన్ బెర్రీస్
క్రాన్ బెర్రీస్ లో స్టమక్ అల్సర్లు నివారించే సత్తా ఉంటుంది. అలాగే యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను అరికడుతుంది.



Click it and Unblock the Notifications











