Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
15రోజులు కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!
ఏళ్లు గడిచినా... నాగరిత మారినా... మార్కెట్లలో రకరకాల కూల్ డ్రింగ్స్ వచ్చినా.. స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లకు ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. కలుషితం లేని కొబ్బరి నీళ్లను.. సర్వరోగ నివారిణిగా భావిస్తారు.
ఎండలో తిరిగినా.. బాగా అలసటగా అనిపించినా.. ఠక్కున గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. దాహార్తీని తీర్చడమే కాకుండా.. మెండైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి కొబ్బరి నీళ్లు. 15 రోజులపాటు క్రమం తప్పకుండా ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల పొందే ఫలితాలు అన్నీ ఇన్నీ కావు అంటున్నారు నిపుణులు.

ఏళ్లు గడిచినా... నాగరిత మారినా... మార్కెట్లలో రకరకాల కూల్ డ్రింగ్స్ వచ్చినా.. స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లకు ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. రోజురోజుకీ కొబ్బరి బొండానికి ఆదరణ పెరుగుతోంది. కలుషితం లేని స్వచ్ఛమైన కొబ్బరి నీటిని.. సర్వరోగ నివారిణిగా భావిస్తారు.
నిజానికి కొబ్బరినీళ్లలో దాగున్న హెల్త్ బెన్ఫిట్స్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. జీర్ణసమస్యలు, డయేరియా, తలనొప్పి ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు తాగమని డాక్టర్లు కూడా సూచిస్తాయి. కొబ్బరి నీళ్లలో విటమిన్ కె, ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, సోడియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. మరి ఇన్ని బెన్ఫిట్స్ ఉన్న కొబ్బరినీళ్లను 15 రోజులు రోజుకి రెండు సార్లు తాగితే.. శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో చూద్దాం..

డెటాక్స్
కొబ్బరినీళ్లు శరీరంలోని అన్ని అవయవాలకు చేరుతాయి. ఆ యా భాగాల్లో పేరుకున్న మలినాలను శరీరం నుంచి తొలగిస్తాయి. యూరిన్ ద్వారా టాక్సిన్స్ ని బయటకు పంపి.. శరీరాన్ని డెటాక్స్ చేస్తాయి.

హైపర్ టెన్షన్
15 రోజులపాటు కొబ్బరి నీళ్లను ప్రతిరోజూ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ చాలా కంట్రోల్ అవుతుంది. కొబ్బరినీళ్లు రక్త ప్రసరణ నెమ్మదిగా జరగడానికి సహాయపడతాయి.

హార్ట్ బర్న్
కొబ్బరి నీళ్లులో పేగులకు ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పొట్టలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ ని తగ్గిస్తాయి. అలాగే హార్ట్ బర్న్ ని ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.

డయాబెటిస్
కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా 15 రోజులు తాగడం వల్ల.. డయాబెటిస్ లక్షణాలను నివారించుకోవచ్చు. కొబ్బరినీళ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి.

బరువు తగ్గడం
ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు కొబ్బరినీళ్లు తాగడం వల్ల మెటబాలిజంను మెరుగుపరచవచ్చు. దీనివల్ల వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

లిబిడో
కొబ్బరినీళ్లు అన్ని భాగాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో లిబిడో లేదా సెక్స్ డ్రైవ్ కూడా మెరుగుపడుతుంది.

మోకాళ్ల నొప్పులు
15 రోజులపాటు ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులను నివారించవచ్చు. ఎముకలను బలహీనంగా మార్చే ఆస్టియోపోరోసిస్ ని నివారించవచ్చు.



Click it and Unblock the Notifications