Latest Updates
-
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే?
సమ్మర్‌లో పెరుగుతున్న పైల్స్, ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు.. నిర్లక్ష్యం చేస్తే అంతే.!
ఎండాకాలంలో వేడి కారణంగా చాలా మందిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేడి తాపంతో శరీరంలో జరిగే మార్పుల కారణంగా మెటబాలిజం(జీవక్రియ)పై తీవ్రంగా ప్రభావం పడుతుంది. తద్వారా పైల్స్, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అసలు వేసవి కాలంలో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి.? వీటికి పరిష్కారమేంటి? వైద్యులు ఏం చెబుతున్నారు.. ఇక్కడ చూద్దాం.

పైల్స్‌కి కారణాలు
వేసవిలో పైల్స్(హెమరాయిడ్స్) సమస్య తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. డీ హైడ్రేషన్, జీర్ణక్రియలో మార్పులు, శారీరక శ్రమలో మార్పులు.. పైల్స్‌కి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి కారణంగా చెమట ద్వారా బాడీ ద్రవాలను కోల్పోతుంది. దీంతో మలం నుంచి శరీరం తేమను స్వీకరిస్తుంది. ఫలితంగా మలం గట్టిపడి పొడిగా మారి అర్ష మొలలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రోలైట్ సమతుల్యతలో మార్పులతో పేగు కదలికలు నెమ్మదించి, మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. దీంతో తీవ్రమైన దురద, చికాకు కలిగి బాహ్య మొలలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. దీనివల్ల బయట పనులపై ఎక్కువగా ఫోకస్ చేయలేక ఇబ్బందులు పడుతుంటారి.
పైల్స్‌కి పరిష్కారమేంటి.?
పైల్స్‌కి శాశ్వత పరిష్కారం పొందాలంటే ఇంట్లోనే ఉంటూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతిరోజూ కనీసం 3 లీటర్ల వరకు నీటిని తాగాలి. ఇంకా కొబ్బరి నీరు, మజ్జిగతో మీ ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మీ జీర్ణవ్యవస్థకి ఉపశమనం కలిగి పైల్స్ సమస్యను తగ్గిస్తుంది. ఇంకా పీచు పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరానికి చల్లదనం కలిగిస్తుంది.
వేసవిలో పైల్స్ బారిన పడకుండా మసాలా, వేపుడు పదార్థాలు, స్ట్రీట్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. నీటి శాతం, పీచుపదార్థం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, బొప్పాయి వంటి వాటిని కాలానుగుణంగా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.

పరిశుభ్రత మఖ్యం
సీజన్ ఏదైనా పైల్స్ బారిన పడకుండా మలద్వార పరిశుభ్రతను పాటించడం ముఖ్యం. మలద్వారం వద్ద బ్యాక్టీరియా, ఫంగస్ పెరగకుండా శుభ్రంగా, పొడిగా ఉంచుకుంటూ ఉండాలి. పైల్స్ సమస్య ఉన్నవారు మలద్వార ప్రాంతాన్ని 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచడం ద్వారా వాపు నొప్పి తగ్గి ఉపశమనం కలిగిస్తుంది.
వేసవిలో ఫుడ్ పాయిజనింగ్
వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఆహారాన్ని సరిగ్గా ఉడకనివ్వకపోవడం, నిల్వ చేసే విధానం సరిగా లేకపోవడం, పాడైన పాల ఉత్పత్తులను తీసుకోవడం, పచ్చిమాంసం, జంక్ ఫుడ్, ఎక్కువ కాలం ఉంచిన ప్రిజర్వేటివ్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా వాంతులు, విరేచనాల సమస్యలు తలెత్తుతున్నాయి.
ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి
వేసవిలో వంట చేసే ప్రదేశాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. భోజనానికి ముందు తర్వాత చేతులు కడుక్కుంటూ ఉండాలి. సరైన ఉష్ణోగ్రత వద్ద వండిన ఆహారాన్ని తీసుకోవాలి. తరచుగా నీళ్లు, మజ్జిగ, జ్యూస్ లాంటి ద్రావణాలను తాగుతూ ఉండాలి. ఈ సమస్య తీవ్రమైతే సంబంధిత వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
