Latest Updates
-
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..
కళ్లు తరచుగా పొడిబారుతున్నాయా.. ఇదే కారణం అనుకుంటే పొరబడినట్లే.!
చాలా మందిలో తరచుగా కళ్లు పొడిబారడం జరుగుతుంటుంది. అయితే మన కళ్లు తగినంత మోతాదులో కన్నీళ్లను ఉత్పత్తి చేయనప్పుడు, లేదంటే కన్నీళ్లు త్వరగా ఎండిపోయిన సందర్భాల్లో ఈ ఈ పరిస్థితి సంభవిస్తుంది. ఫలితంగా కళ్లలో మంట, కుట్టడం, దురద, ఎర్రబడటం, కంటి చూపు మసకబారడం, కళ్లలో ఏదో ఇరుక్కుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది చదువుతో పాటు ఆఫీసు కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తుంది.

డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేకుండా గడపడం చాలా కష్టం. రోజువారీ జీవితంలో స్క్రీన్ సమయం కీలకంగా మారింది. అయితే స్క్రీన్ టైం కారణంగా కళ్లు పొరిబాడుతుంటాయని చాలా మంది భావిస్తుంటారు. ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చాలా తక్కువగా కనురెప్పలు ఆర్పుంతుంటాం. ఫలితంగా కన్నీటి పొర త్వరగా ఆరిపోయి కళ్లు పొడిబారుతుంది. అయితే ఇందుకు స్క్రీన్ టైం ఒక్కటే కారణం కాదని.. దీని వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చని వైద్య నిపణులు చెబుతున్నారు. ఆ కారణాలు తెలుసుకుని నివారణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు.
వయసు పెరిగేకొద్దీ కళ్లలో కన్నీటి ఉత్పత్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా కళ్లు పొరిబాడతాయి. కొన్ని రకాల మందులు వాడటం, ఎక్కువ కాలం పాటు కాంటాక్ట్ లెన్సులు ధరించడం, కంటి శస్త్ర చికిత్స, ఆటోఇమ్యూన్ వ్యాధులు, దుమ్ము, పొగ, బలమైన గాలులకి ఎఫెక్ట్ కావడం, పొడి వాతావరణంలో ఎక్కువ కాలం గడపడం కూడా కళ్లు పొడిబారడానికి దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పులు కూడా కళ్లు పొడిబారడానికి కారణమవుతాయి.
అయితే కేవలం స్క్రీన్ సమయం ఎక్కువ సేపు ఉండటం ద్వారానే కళ్లు పొడిబారుతున్నాయని లైట్ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి కంటి వైద్య నిపుణుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.
వీటిని నిర్లక్ష్యం చేయకండి..
కళ్లు నిరంతరం పొడిబారుతూ ఉండటం, మంట పెట్టడం, కళ్లు కుడుతున్నట్లు అనిపించడం, ఎర్రబడటం, దృష్టిలో తేడా, లైట్ చూడటంలో ఇబ్బంది పడటం, కళ్లలో ఏదో ఇరుక్కుపోయినట్లు అనిపించినా, కళ్లలో నుంచి అధికంగా నీరు కారడం వంటి సమస్యలు ఎదురైనా ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. అదేవిధంగా కంటి నొప్పి తీవ్ర గకావడం, అకస్మాత్తుగా దృష్టి కోల్పోవడం వంటి సమస్యలు ఎదురైనా.. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. దీర్ఘకాలం పాటు చూడకుండా సకాలంలో వైద్యం తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి.

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అందుకే కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. చాలా సున్నితమైన కంటి భాగాలను కాపాడుకోవాలి. అందుకే కళ్లు పొడిబారకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. స్క్రీన్ సమయాన్ని వీలైనంత తగ్గించాలి. లేదంటే పని మధ్యలో కాసేపు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. పని మధ్యలో తరచుగా కనురెప్పలు ఆర్పుతూ ఉండటం ద్వారా తేమ ఉత్పత్తి అవుతుంది. పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. కళ్లలో దుమ్ము, పొగ, బలమైన గాలులు పడకుండా రక్షించుకోవాలి. డాక్టర్ సలహా మేరకు కంటి చుక్కల మందును అలవాటు చేసుకోవచ్చు. ఇది కళ్లు పొడిబారకుండా కాపాడుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
