Latest Updates
-
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే?
వ్యాధి ఒకటే అయినా స్త్రీ, పురుషుల్లో వేర్వేరు లక్షణాలు.. పోల్చుకుంటే ప్రాణ ముప్పు తప్పదు.!
ఒకే రకమైన వ్యాధి అయినా దాని ప్రభావంతో ఒక్కోసారి బాధితుల్లో వేర్వేరు లక్షణాలు చూపిస్తాయి. అయితే ఈ తేడాలు స్త్రీ, పురుషుల మధ్య మరింత స్పష్టంగా కనిపిస్తాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అందులో ప్రధానమైనది గుండెపోటు. దీంతో పాటు ఆటోఇమ్యూన్ వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలకి సంబంధించి కూడా ఆడ, మగవారిలో లక్షణాలు విభిన్నంగా ఉంటాయని చెబుతున్నారు. మరి ఆ లక్షణాలేంటి.. వాటిని ఎలా గుర్తించాలి.. డాక్టర్ల సలహాలు చూద్దాం..

గుండెపోటు అంటే ప్రధానంగా ఛాతీ నొప్పిని అనుభవిస్తారు. స్త్రీ పురుషులిద్దరిలోనూ ఛాతీలో ఒత్తిడి, బిగువు, నొప్పి ఉండవచ్చు. కానీ ఇలాంటి లక్షణాలే ఎప్పుడూ ఉండకపోవచ్చు. మహిళల్లో కొన్నిసార్లు తీవ్రంగా ఆయాసం, అలసట, వికారం, వాంతులు వంటి లక్షణాలు గుండెపోటును సూచించవచ్చు. పురుషుల్లో కూడా ఈ లక్షణాలు కనిపించినా స్త్రీలలో ఇవి ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే కొన్నిసార్లు మహిళల్లో ఈ లక్షణాలు కనిపించకపోవడం కారణంగా.. గుండె సంబంధిత సమస్యలను గుర్తించడంలో ఆలస్యం జరిగే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే మహిళలు సడెన్‌గా ఛాతీలో అసౌకర్యం, ఆయాసం, చల్లగా చెమటలు పట్టడం అనుభవిస్తే వాటిని తీవ్రంగా పరిగణించి వైద్యుడిని సంప్రదించాలి.
ఆటో ఇమ్యూన్ వ్యాధులు
ఆటోఇమ్యూన్ వ్యాధులు అంటే మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఒక్కోసారి సొంత ఆరోగ్యకరమైన కణజాలాలనే దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా లూపస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి అనేక వ్యాధుల లక్షణాలు మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఆటోఇమ్యూన్ వ్యాధులు నిర్ధారణ అయిన ప్రతి ఐదుగురిలో దాదాపు నలుగురు మహిళలే ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళలకు ఈ ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. జన్యువులు, హార్మోన్ల మార్పులు తదితర కారణాల వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ చురుకుగా మారి సొంత కణజాలాలనే దెబ్బతీస్తున్నాయి.

మానసిక సమస్యలు
మానసిక ఆరోగ్య సమస్యలు అంటే కేవలం భావోద్వేగాలు మాత్రమే కావు. డిప్రెషన్ కారణంగా విచారం, ఇంట్రెస్ట్ లేకపోలడం, నీరసం, నిద్ర, ఆకలిలో మార్పులు కనిపించడం, ఏకాగ్రత లోపించడం వంటి వాటిని మానసిక ఆరోగ్య సమస్యలుగా పరిగణించాలి. కాగా, పురుషుల్లో డిప్రెషన్ అనేది ఎక్కువగా చిరాకు, కోపం, ప్రవర్తన, మద్యపానం ఎక్కువగా తీసుకోవడం ద్వారా వస్తుంది. కానీ మహిళల్లో మాత్రం విచారం, ఆందోళన, సమాజంలో కలవకపోవడం, అలసట, నిద్రవేళల్లో మార్పులు వంటి వాటి ద్వారా వారి మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
వైద్యుల సలహా
ఏదైనా వ్యాధికి సంబంధించి స్త్రీ పురుషుల మధ్య లక్షణాల్లో తేడాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. వ్యాధి ఒకటే అయినా వారి వయసు, కుటుంబం, ఇతర అనారోగ్యాలు, మందుల వాడకం వంటి లక్షణాలు ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇంట్లో రోగ నిర్ధారణ చేసుకోకుండా మీ శరీరంలో ఏ మాత్రం అసౌకర్యంగా అనిపించినా, సడెన్‌గా తీవ్రంగా లక్షణాలు కనిపించినా డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
