Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
చిన్న కాయ.. పెద్ద ప్రయోజనాలు: వాక్కాయలతో ఈ లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు!
చిన్నగా, ఎర్రగా, చూడముచ్చటగా ఉండే వాక్కాయలు లేదా కలిమి కాయలు చూస్తే ఎవరికైనా ఇట్టే తినాలనిపిస్తుంది. తీపి, పులుపుల అద్భుతమైన కలయికతో నోరూరించే ఈ పండ్లు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక పెన్నిధి లాంటివి. ఆయుర్వేదం కూడా ఈ పండ్లను ఒక దివ్యౌషధంగా పరిగణిస్తుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ E, ఐరన్, కాల్షియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించే కవచంలా పనిచేస్తాయి. వాక్కాయలను రోజూ తినడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూడండి.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఫ్రెండ్
ఈ రోజుల్లో పెరిగిన బరువును తగ్గించుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. మీరు కూడా బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాక్కాయలు పర్ఫక్ట్. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ పీచుపదార్థం (ఫైబర్) మాత్రం మెండుగా ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయడం, జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది మన శరీరంలోని జీవక్రియల రేటును (మెటబాలిజం) పెంచుతుంది, తద్వారా శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది.
దృఢమైన ఎముకల కోసం
వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు అరిగిపోవడం, కీళ్ల నొప్పులు రావడం నేడు సర్వసాధారణం అయిపోయాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే వాక్కాయలు తినాల్సిందే. వీటిలో ఎముకలకు అత్యంత అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం మన ఎముకలను, దంతాలను దృఢంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పెద్ద వయసు వారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్టియోపొరోసిస్ (ఎముకలు గుల్లబారడం) వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు.
రోగనిరోధక శక్తికి బూస్టర్ డోస్
వాక్కాయలు విటమిన్ C కి పవర్ హౌస్ లాంటివి. విటమిన్ సి.. మన శరీరంలో వ్యాధులతో పోరాడే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. బలమైన రోగనిరోధక శక్తి ఉంటే వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు దరిదాపుల్లోకి కూడా రాలేవు. ముఖ్యంగా ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మన శరీర కణాలకు డ్యామేజ్ జరగకుండా కాపాడతాయి.
పదిలమైన గుండె
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడితో కూడిన జీవితంలో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యం. వాక్కాయలు రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. అలాగే బీపీ ఎప్పుడూ అదుపులో ఉంచుతాయి. దీనివల్ల భవిష్యత్తులో గుండెపోటు, పక్షవాతం వంటి హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశాలు ముందే అడ్డుకోవచ్చు.
సాఫీగా సాగే జీర్ణక్రియ
మనం ఎంత మంచి ఆహారం తిన్నా, అది సరిగ్గా జీర్ణం కాకపోతే శరీరానికి ప్రయోజనం ఉండదు. వాక్కాయల్లో ఉండే అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును అమాంతం మెరుగుపరుస్తుంది. నేడు చాలా మందిని వేధిస్తున్న మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వీటిని రోజూ తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడి, శరీరంలోని హానికరమైన విషపదార్థాలు సులువుగా బయటకు పోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
