Latest Updates
-
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా..
రక్తహీనతతో బాధపడేవారికి ఈ జ్యూస్ ఒక వరం.. డైలీ ఒక్క గ్లాస్ తాగితే చాలు.!
ఈ రోజుల్లో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోవడంతో శరీరంలో వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా లేక వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఐరన్, ఇతర పోషకాలు తీసుకోవాలి. దీని ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చు. దీనికోసం మీరు తప్పనిసరిగా మీ డైట్‌లో ఈ జ్యూస్‌ను తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బీట్‌రూట్ జ్యూస్
రక్తహీనత(అనీమియా) ఈ సమస్యతో బాధపడేవారికి మార్కెట్‌లో చాలా తక్కువ ధరలో దొరికే బీట్‌రూట్ ఒక వరం. ఇందులో అనేక పోషకాలు ఉండటంతో మీ డైట్‌లో భాగం చేసుకోవవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు చాలా తక్కువ ఉన్నవారికి ఈ జ్యూస్ చాలా దోహదపడుతుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫోలేట్‌తో పాటు తక్కువ మోతాదులో ఐరన్ ఉంటుంది.
జ్యూస్ ఎలా తయారుచేసుకోవాలి..
ఒక ఫ్రెష్ బీట్‌రూట్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. తర్వాత మళ్లీ కడిగి చున్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిని జ్యూసర్ లేదా బ్లైండర్‌లో వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ జ్యూస్ తయారుచేసుకోవాలి. రుచి కోసం కాస్తంత నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. నిమ్మరసంలోని విటమిన్ సి, ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. అయితే జ్యూస్‌లో చక్కెర కలుపుకోకుండా చేసుకోవడం మంచిది. రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులను గమనిస్తారు. సరైన స్థాయిలో హిమోగ్లోబిన్ ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగవతుంది.

కేవలం జ్యూస్‌లపైనే ఆధారపడొద్దు..
మీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే కేవలం బీట్‌రూట్ జ్యూస్ తాగడం మాత్రమే సరిపోదని వైద్య నిపుణులు అంటున్నారు. వైద్యుల సలహా మేరకు ఆహారంలో పాలకూర, శనగలు, చిక్కుడు గింజలు, నువ్వులు, ఐరన్ అధికంగా ఉండే ఇతర ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. ఉసిరి, నిమ్మ, నారింజ, జామకాయ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కూడా రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది. వీటిని తీసుకోవడంతో పాటు జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి.
వీటికి దూరం..
మీరు ఐరన్ లోపంతో బాధపడుతున్నట్లయితే భోజనం తర్వాత వెంటనే టీ, కాఫీలు తాగడం మానుకోవాలి. ఎందుకంటే వీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ గ్రహించకుండా అడ్డుకుంటాయి. కనీసం రెండు గంటల విరామం ఇవ్వడం మంచిది. అయితే మీరు నిరంతరం అలసట, నీరసం, తల తిరగడం, తలనొప్పి, కాసేపు పనిచేస్తేనే ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరు హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో పరీక్ష చేయించుకోవాలి. రక్తహీనత సమస్య ఉన్నట్లయితే అందుకు కారణాలను తెలుసుకోవాలి. వైద్యుల సిఫారసు మేరకు ఐరన్ సప్లిమెంట్లు లేదా ఇతర చికిత్సలను తీసుకోవచ్చు.
కేవలం బీట్‌రూట్ జ్యూస్‌పైనే ఆధారపడకుండా శరీరానికి అవసరమైన పోషకాహారం తీసుకుంటూ రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
