Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
వర్షాకాలంలో వీటిని తినే ముందు జాగ్రత్త.. లేదంటే వాంతులు, విరేచనాలు తప్పవు.!
వర్షాకాలంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి ఆవరణాల పరిశుభ్రతతో పాటు తినే ఆహారం విషయంలో కూడా ఈ కాలంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ కాలంలో ఏ ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలో చూద్దాం..

దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. ఎడతెరిపి లేకుండా వానలు, ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై వరద నీరు, బురద కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వాతావరణంలో తేమ పెరిగి, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఫలితంగా వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, వాంతులు, టైఫాయిడ్, కలరాతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే ఈ కాలంలో మంచి ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.
వర్షాకాలంలో ఆకుకూరలు
తోటకూర, పాలకూర, క్యాబేజ్, మెంతికూర వంటి వివిధ రకాల ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని వర్షాకాలంలో పరిమితంగా మాత్రమే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో అధిక తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్, కీటకాలు ఆకులపై వృద్ధి చెందుతాయి. సాధారణంగా కడగడం ద్వారా ఇవి అంత సులభంగా పోవు. మీరు తినాలి అనుకున్నప్పుడు మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. ఉప్పు నీటితో కడిగితే ఇంకా మేలు. పచ్చిగా తినకుండా మంచిగా ఉడికిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.
ఆయిల్ ఫుడ్
వర్షాకాలంలో పకోడీలు, సమోసాలు, మిరపకాయ బజ్జీలు, కచోరీలు వంటి ఆయిల్ ఫుడ్, చిరుతిళ్లపై మనసు లాగుతుంది. వీటిని ఇంట్లో చేసుకుంటే మంచిదే. అది కూడా తరచుగా తీసుకోవద్దు. అధిక నూనె, మసాలాలు వాడటం ద్వారా జీర్ణవ్యవస్థపై ఒత్తిడి కలిగిస్తుంది. స్ట్రీట్ ఫుడ్‌లో పరిశుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజనింగ్‌కి గురై డయేరియా, గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి వాటితో ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది.
పుట్టగొడుగులు
పోషకాలు మెండుగా ఉన్న శాకాహార పదార్థాల్లో పుట్టగొడుగులు ఒకటి. వీటిని వర్షాకాలంలో తినేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇవి సహజంగానే తేమ ఎక్కువగా ఉన్న, చీకటి ప్రదేశాల్లో మాత్రమే పెరుగుతాయి. దీంతో బ్యాక్టిరీయా, కీటకాలు పెరిగే అవకాశం ఉంటుంది. శుభ్రంగా కడిగి, ఉడికిన తర్వాత మాత్రమే వీటిని వండుకోవాలి. నాణ్యమైన, తాజా పుట్టగొడుగులను మాత్రమే వంటకి ఉపయోగించాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్, విరేచనాలు, వాంతులు సమస్య వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

పాలు
వర్షాకాలంలో పాలు, పాల ఉత్పత్తులను మితంగా తీసుకోవాలని, లేదంటే పూర్తిగా మానేయాలని నిపుణులు సూచిస్తారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నా.. తేమ కారణంగా అవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో పాలు తాగాలనుకునేవారు తాగే ముందు గ్లాసు వేడి పాలల్లో చిటికెడు పసులు వేసి బాగా కలిపి తాగాలు. దీంతో పసుపులోని యాంటీబయాటిక్స్ మీకు మేలు చేస్తాయి.
వర్షాకాలంలో ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్త, పరిశుభ్రత పాటించాలి. లేదంటే సులువుగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న చోట ఆహారం విషయంలో తాజా, ఆరోగ్యకరమైన కూరగాయలను మాత్రమే ఎంచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
