Latest Updates
-
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.!
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.?
ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎన్ని వ్యాయామాలు చేసినా అప్పుడప్పుడూ ఒళ్లు నొప్పులు కలగడం సహజం. శారీరక శ్రమ ఎక్కువైనా, నరాలు, కండరాలు పట్టేసినా శరీరంలో పలు చోట్ల నొప్పులు ఇబ్బంది పెడతాయి. దీంతో ఒక్కోసారి నిద్ర సరిగా పట్టదు. ఫలితంగా నిద్ర లేమితో రోజంతా అలసటగా ఉంటుంది. బాడీ పెయిన్స్ అలాగే ఉంటాయి. ఈ క్రమంలో మీ శరీరంలో నొప్పి ఎక్కడ ఉందో.. దాని ప్రకారంగా నిద్రపోయేటప్పుడు ఈ పొజిషన్స్‌లో పడుకోండి. తెల్లారేసరికి నొప్పులు మాయమవుతాయి. హాయిగా నిద్రపడుతుంది.

భుజం నొప్పి
ఎప్పుడైనా మీకు భుజం నొప్పి కలిగినప్పుడు పెయిన్ ఉన్న వైపు కాకుండా నొప్పి లేని వైపు మీద పక్కగా పడుకోండి. తలకి, భుజానికి దిండు ఆనించి పడుకోవడం ద్వారా పెయిన్ ఉన్నవైపు ప్రెజర్ లేకుడా రిలీఫ్ అవుతుంది. హెల్తీగా నిద్రపడుతుంది.

ఎగువ వెన్ను నొప్పి
మీరు వెన్నెముకపైన పైభాగంలో నొప్పిగా ఫీల్ అవుతుంటే మంచంపై వీపు ఆనించి పడుకోండి. నొప్పి ఉన్న భాగంలో దిండు పెట్టి ఉంచిచే ఉపశమనం లభిస్తుంది.
తల నొప్పి
తలనొప్పిగా ఉన్నప్పుడు వెల్లకిలా పడుకుని మోకాళ్ల కింద దిండు పెట్టుకుని నిద్రించడం ద్వారా తెల్లారేసరికి నొప్పి నుంచి రిలీఫ్ పొందుతారు.

దిగువ వెన్ను నొప్పి
వెన్ను కింది భాగంలో నొప్పిగా ఉంటే మోకాళ్ల కింద దిండు పెట్టుకోవడం మంచిది. దీంతో రక్త ప్రసరణ మెరుగైన నొప్పి తగ్గేందుకు దోహదపడుతుంది.

మెడ నొప్పి
మెడ నొప్పి ఉన్నవారు ఆ భాగంలో సపోర్ట్ ఇచ్చేవిధంగా మీకు అనువైన పొజిషన్‌లో నిద్రపోండి. నొప్పి ఉన్న వైపు కాకుండా లేని వైపు దిండు ఆనించినట్లయితే రిలీఫ్‌గా ఉంటుంది.
సైనస్
సైనస్ సమస్య ఉన్నవారు వెల్లకిలా పడుకుని తలను కొంచెం ఎత్తుగా ఉంచడం ద్వారా శ్వాస బాగా ఆడుతుంది. నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టదు.
నడుము నొప్పి
మీరు నడుము నొప్పితో బాధపడుతుంటే ఒక వైపునకు తిరిగి పడుకోవాలి. మోకాళ్ల మధ్య దిండు పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా నడుము భాగంలో రిలీఫ్ పొందుతారు. కండరాలు సెట్ అవుతాయి.
మోకాలి నొప్పి
మోకాలి నొప్పి సమస్య ఉన్నవారు వెల్లకిలా పడుకుని మెకాళ్ల కింద దిండు పెట్టుకుని నిద్రకు ఉపక్రమింండి. నొప్పి ఉన్న చోట ఒత్తిడి తగ్గి గాల్లో తేలినట్లుగా ఉంటుంది. పరుపు, దిండు గట్టిగా కాకుండా మెత్తగా ఉండేలా చూసుకోండి. మీరు నిద్రించే గది పీస్‌ఫుల్‌గా ఉంచుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
