Latest Updates
-
సెప్టెంబర్ 2026 రాశి ఫలాలు: వీరి అదృష్టం మారబోతుంది.. 12 రాశుల ఫలితాలివే.! -
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా?
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో షుగర్ పేషెంట్లు ఉన్నారు. అందుకే మనదేశాన్ని వరల్డ్ డయాబెటిస్ రాజధాని అని కూడా పిలుస్తుంటారు. అయితే షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు డాక్టర్లు మీది ప్రీ డయాబెటిస్ స్టేజ్ అని చెప్పిన వెంటనే హమ్మయ్య.. ఇంకా డయాబెటిస్ రాలేదు, నేను సేఫ్ జోన్ లోనే ఉన్నాను అనుకుని ఊపిరి పీల్చుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే.

చాలా మంది ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నప్పుడు తాము ఇంకా సేఫ్ గానే ఉన్నామని భావించి తినే ఆహారం, జీవనశైలి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ నిర్లక్ష్యమే అతిపెద్ద ముప్పుకు దారితీస్తుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా హెచ్చరిస్తున్నారు.
ప్రీ-డయాబెటిస్ అంటే ఆ సంకేతమే
ఢిల్లీకి చెందిన డాక్టర్ అలోక్ చోప్రా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన పంచుకున్న విషయాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ప్రీ డయాబెటిస్ అనే నిర్ధారణ ఒక అపోహ మాత్రమే.
ఒక వ్యక్తికి ప్రీ డయాబెటిస్ ఉందని చెప్పడం.. మీరు కొద్దిగా గర్భవతిగా ఉన్నారు అని చెప్పడం లాంటిదే. అంటే గర్భం ఉంటే ఉంటుంది లేదా ఉండదు, అలాగే డయాబెటిస్ విషయంలో కూడా ఈ మధ్యస్థ దశ అనేది మీ శరీరంలో అప్పటికే వ్యాధి మొదలైంది అనడానికి సంకేతం అని ఆయన స్పష్టం చేశారు.
అసలు శరీరంలో ఏం జరుగుతుంది?
ఒక వ్యక్తి రిపోర్ట్ లో ప్రీ డయాబెటిక్ అని వస్తే..వారి శరీరం చక్కెర (గ్లూకోజ్) లెవల్స్ ను సరిగ్గా నియంత్రించలేకపోతోందని అర్థం. మనం తీసుకునే ఆహారంలోని చక్కెరను కణాల్లోకి పంపే ఇన్సులిన్ అనే హార్మోన్ తన పనితీరును మందగిస్తుంది. దీన్నే మెడికల్ భాషలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు.
ఇది రాత్రికి రాత్రే వచ్చే సమస్య కాదు, చాలా నిశ్శబ్దంగా మన శరీరంలో పెరుగుతూ వస్తుంది. మీ శరీరం మీకు హెచ్చరికలు పంపుతోందంటే, అది అప్పుడే మీ జీవనశైలిలో మార్పును కోరుకుంటోందని అర్థం అని డాక్టర్ అలోక్ హెచ్చరించారు.
ఏది నార్మల్? ఏది డేంజర్?
అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రమాణాల ప్రకారం రక్తంలో షుగర్ లెవల్స్ (HbA1c)పరిధి ఇలా ఉంటుంది.
సాధారణ లెవల్: 5.7 శాతం కంటే తక్కువ.
ప్రీ డయాబెటిస్ లెవల్: 5.7 నుండి 6.4 శాతం మధ్య.
డయాబెటిస్ (మధుమేహం): 6.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ.
ప్రీ డయాబెటిస్ అనేది టైప్-2 డయాబెటిస్ కు ముందు కనబడే మొదటి మెట్టు. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని సీడీసీ రిపోర్ట్ చెబుతోంది.
సరైన చర్యలతో దీనిని వెనక్కి తిప్పొచ్చు
డాక్టర్ అలోక్ సూచనల ప్రకారం.. ఇందులో ఒక శుభవార్త కూడా ఉంది. ఈ దశలో ఉన్నప్పుడు మనం మేల్కొంటే, టైప్-2 మధుమేహం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, ప్రీ డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. అందుకు ఆయన సూచిస్తున్న 4 కీలకమైన జీవనశైలి మార్పులు ఏంటంటే..
సరైన పోషణ: చక్కెర, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండి, పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.
శరీర కదలిక: రోజూ వ్యాయామం చేయడం, నడవడం ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచాలి.
నిద్ర: శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. నాణ్యమైన నిద్ర ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
ఒత్తిడి నిర్వహణ: మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications