Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.!
టెక్నాలజీ పరంగా ప్రపంచం ముందుకు దూసుకుపోతున్నా, మూఢ నమ్మకాలను మాత్రం ఇంకా విశ్వసించేవారు ఉంటూనే ఉన్నారు. తుమ్మినా, నల్ల పిల్లి ఎదురైనా, కన్ను అదిరినా.. ఏదో అపశకునం జరుగుతుందనే భయంతో ఓ ఐదు నిమిషాల పాటు ఇంట్లోనే ఉండి బయలుదేరతారు. అయితే ఈ చాదస్తం ముదిరిన ఓ వ్యక్తి ఏకంగా తన కళ్లనే పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. చైనాలో జరిగిన ఈ సంఘటన మూఢ నమ్మకాలను అతిగా విశ్వసించేవారిపై ఆందోళన కలిగిస్తోంది.

వుహాన్‌లో జరిగిన ఓ సంఘటన మనిషి జీవితంలో మూఢనమ్మకాలను అతిగా విశ్వసిస్తే ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో తెలియజేస్తుంది. సాధారణంగా కుడి కన్ను అదిరితే ఏదో అపశకునం జరుగుతుందని.. ఎడమకన్ను అదిరితే మంచి శకునం అని భావిస్తారనేది తెలిసిందే. ఈ క్రమంలో మధ్య చైనాకి చెందిన లే అని వ్యక్తికి కొన్ని రోజులుగా కుడి కన్ను నిరంతరం అదరుతుండటంతో తీవ్రమైన భయాందోళనకు గురయ్యాడు. చైనాలో ఎడమ కన్ను అదిరితే డబ్బు వస్తుంది.. కుడి కన్ను అదిరితే కష్టాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఇదే అతనిని భయానికి గురిచేసింది.

మూడు రోజుల పాటు ప్రయత్నాలు
ఈ క్రమంలో కుడి కన్ను అదరకుండా ఉండేందుకు లే చాలా ప్రయత్నాలు చేశాడు. కళ్లకు కాసేపు విశ్రాంతి ఇచ్చాడు. అదురుతున్న ప్రాంతంలో వేడి కాపడం పెట్టాడు. ఆయన సమస్య తీరలేదు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంటే అతను డాక్టర్‌ను సంప్రదించకుండా పరిష్కారం కోసం గూగుల్‌ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో కనురెప్పలను తట్టడం వల్ల దురదృష్టం తొలగుతుందని చదివిన లే.. అతను కంటి చుట్టూ మెల్లగా కొట్టడం మొదలుపెట్టాడు. అయినా తగ్గకపోవడంతో ఇలా మూడు రోజుల పాటు చేస్తూనే ఉన్నాడు. చివరికి కన్ను అదరడం ఆగిపోయింది.
మొదటికే మోసం
అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కనురెప్పలపై నిరంతరంగా కొట్టడంతో అతని కంటి చూపుపై ప్రభావం చూపించింది. దృష్టి క్షీణించి పక్కనే వస్తువులు కూడా కనిపించలేదు. కళ్లు మసకబారడంతో పరిస్థితి విషమించిందని అర్థమై వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. టెస్టుల్లో లే కంటి రెటీనా స్థానభ్రంశం చెందినట్లు గుర్తించారు. దీన్నే రెటీనా డిటాచ్‌మెంట్ అంటారు. ఈ క్రమంలో శస్త్ర చికిత్స ద్వారా తిరిగి కంటిచూపును పొందాడు.
కాగా, మూఢ నమ్మకం, అతి జాగ్రత్త.. కొన్ని రోజుల్లోనే లేకి తీవ్ర కష్టాలు తెచ్చిపట్టాయి. మన శరీరంలోని సర్వేంద్రియాల్లో కళఅలు చాలా ప్రధానమైనవి. సున్నితంగా ఉంటాయి. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలం. ఇక గట్టిగా తగిలితే అది ఏకంగా కనుపాప, రెటీనాపై ప్రభావం చూపిస్తుంది. ఇది కంటి చూపు కోల్పోయేందుకు దారితీస్తుంది.
మూఢ నమ్మకమే
ఈ క్రమంలో కన్ను అదిరితే అది మంచి, చెడు శకునాలకు సూచన కాదని ఇవి కేవలం మూఢ నమ్మకాలని వైద్యులు చెబుతున్నారు. నిద్ర లేమి, అధిక ఒత్తిడి, ఎక్కువ సేపు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ చూడటం ద్వారా ఇలా కనురెప్పలు అదిరే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమస్యను కొన్ని మార్పుల ద్వారా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
నాణ్యమైన నిద్ర, స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా కనురెప్పలు అదిరిపోవడం అదే తగ్గుతుంది. అయితే ఈ సమస్య వారం రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని తేలికగా తీసుకోవద్దు. అంతేకాకుండా చెంపలు, పెదవుల చుట్టూ కనిపించినా న్యూరాలజిస్టు లేదా కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
