For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీళ్ళ నొప్పులు - వ్యాయామం!

By B N Sharma
|

Arthritis and exercise!
కీళ్ళ నొప్పులనే అర్ధరైటిస్ అని కూడా అంటారు. కీళ్ళ భాగంలో నొప్పి, గట్టిపడుట, వాపులు మొదలైనవాటినే అర్ధరైటిస్ గా పేర్కొంటారు. ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే మంచి మందు వ్యాయామం. వ్యాయామం చేస్తూ వుంటే గట్టితనం పోయి మెతకదనం వస్తుంది. కడరాలు బలాన్ని పుంచుకొని బరువు భరించే నశక్తి పొందుతాయి. బరువు కూడా తగ్గుతారు కనుక ఆరోగ్యంగా వుంటారు.

వీటికి ట్రీట్ మెంట్ లో భాగంగా తగిన విశ్రాంతి, రిలాక్సేషన్, సరైన ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయటం వంటివి కూడా చెప్పవచ్చు. వివిధ కదలికలతో కూడిన వ్యాయామాలు ప్రతిరోజూ లేదా రోజు విడిచి రోజు తప్పనిసరిగా చేయాలి. బలం కోసం చేసే వ్యాయామాలు కండరాల బలానన్ని పెంచుతాయి. బలమైన కండరాలు దెబ్బతిన్న జాయింట్లకు సహకరించి సరిగా పనిచేసేలా చేస్తాయి.

జాయింట్లలో వాపు లేదా నొప్పి చూపితే తప్ప వ్యాయామాలు మానాల్సిన అవసరం లేదు. అరబిక్ వ్యాయామాలు కీళ్ళనొప్పులకు సహకరించటమే కాక, అధిక బరువు తగ్గించటం, శరీరం ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. నొప్పి లేకుంటే ప్రతిరోజూ రెండు సార్లు 20 నిమిషాల చొప్పున ఈ వ్యాయామాలు చేయాలి. వ్యాయామాలు మొదలుపెట్టే ముందు, మీ శారీరక ఫిట్ నెస్ కొరకై డాక్టర్ ను సంప్రదించండి. చాలామంది తక్కువ శ్రమకల వ్యాయామాలను కీళ్ళనొప్పులకై చేసి అధిక లాభం పొందుతూంటారు. కీళ్ళ నొప్పులకు వ్యాయామాలు మొదలు పెట్టాలనుకునేవారు ఒక శారీరక వైద్యుని సంప్రదించి అందుకు తగిన వ్యాయామాలు, నొప్పి తగ్గించే పద్ధతులు, కీళ్ళ రక్షణ, శరీర శక్తి సంరక్షణ వంటి అంశాలను తెలుసుకొని మొదలు పెట్టటం సరైనదిగా భావించాలి.

English summary

Arthritis and exercise! | కీళ్ళ నొప్పులు - వ్యాయామం!

Aerobic or endurance exercises improve cardiovascular fitness, help control weight, and improve overall function. Weight control can be important to people who have arthritis because extra weight puts extra pressure on many joints. Endurance exercises should be done for 20 to 30 minutes three times a week unless you have severe pain or swelling in your joints.
Story first published:Monday, January 9, 2012, 12:08 [IST]
Desktop Bottom Promotion