Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
మహిళల మెన్సెస్ పై కొన్ని అపోహలు...వాస్తవాలు!

మహిళ మెన్సెస్ పై కొన్నిఅపోహలు మరియు వాస్తవాలు
అపోహ - ఈ సమయంలో యువతి స్విమ్మింగ్ చేయరాదు.
వాస్తవం - మహిళకు పిరీయడ్ సమయంలో స్విమ్మింగ్ అనారోగ్యకరమని ఎవరన్నారు? శారీరక శ్రమ కలిగించే నడక, పరుగుపెట్టటం వంటివి కూడా చేయకూడదని ఎందరో చెపుతారు. గతంలో స్విమ్మింగ్ సమయంలో పూల్ లో అంతా రక్తం అయిపోతుందని అని వుంటారు. కాని నేడు మార్కెట్ లో అదివరలోకంటే, అధునాతనమైన ప్యాడ్ ల వంటివి మహిళకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఆమె పరుగు పెట్టినా, లేక స్విమ్మింగ్ చేసినా, రక్తం బయటకు చిమ్మదు. అంతేకాక, ఈ సమయంలో ఆమెకు కడుపులో నొప్పులు వస్తాయి. స్విమ్మింగ్ కనుక పది లేదా పదిహేను నిమిషాలు చేస్తూ వుంటే, మంచి ఆరోగ్యం, ఎంతో శక్తి భావించి ఆమె తన రుతుక్రమ నొప్పులు కూడా తగ్గించుకోగలదు.
అపోహ - పిరీయడ్ సమయంలో రతిచేసినా గర్భం రాదు.
వాస్తవం - మహిళకు అండం విడుదల అనేది ఏ సమయంలో అయినా సరే జరుగవచ్చు. పిరియడ్ తో సంబంధం లేకుండా, ఉద్రేక పడి కూడా అండం విడుదలకావచ్చు. కనుక అవాంఛిత గర్భం రాకుండా ఉండాలంటే, అసురక్షిత విధానాలను ఆచరించంకండి.
అపోహ - పిరియడ్ మూడో రోజు తలకి స్నానం చేయాలి.
వాస్తవం - సాధారణంగా మన హిందూ మతంలో పిరియడ్ అయిన మహిళను ఇంటిపనికి అనుమతించరు. ఈ 5 లేదా 6 రోజులలో వారు శుభ్రంగా వుండరని భావిస్తారు. కనుక పిరీయడ్ తర్వాత శుభ్రంగా వుండేందుకు మూడవ రోజున తలస్నానం ఆచరిస్తారు. అది అపోహ అనుకుంటే, ప్రతిరోజూ మీరు తల వెంట్రుకలు కడగవచ్చు. వేడి నీటి స్నానం, పిరియడ్ నొప్పులను కూడా ఆమెకు తగ్గిస్తుంది. ఆమె తాజాదనం భావిస్తుంది.
అపోహ - బిడ్డల తల్లులకు మాత్రమే, పిరీయడ్ సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది.
వాస్తవం - చాలామంది యువతులకు అధిక రక్తస్రావం పెళ్ళికి ముందే అవుతుంది. కనుక బిడ్డ తల్లులకు అధిక రక్తస్రావం అనేది అపోహ. పిరియడ్స్ సరిగా రాకపోవటం, ప్రొజెస్టిరోన్ హార్మోన్ సరిగా లేకపోవటం కూడా అధిక రక్తస్రావం కలిగిస్తుంది.
అపోహ - పిరియడ్స్ లో వ్యాయామం మానేయాలి
వాస్తవం - కడుపులో నొప్పులు బాగా ఉంటే తప్ప, ప్రతిరోజూ ఈ సమయంలో కూడా కొద్ది సమయం వ్యాయామం చేయవచ్చు. రీసెర్చిల మేరకు అరబిక్ వ్యాయామాలైన జాగింగ్, స్విమ్మింగ్, నడక, పరుగు వంటివి ఈ సమయంలో సరైనవే. కనుక ఈ సమయంలో వ్యాయామాలు చేయరాదనేది లేదు.
అపోహ - పిరియడ్ అయిన మహిళలకు తల స్నానం చేస్తే జలుబు చేస్తుంది.
వాస్తవం - ఇది కూడా పాతకాలం వారు చెప్పిన కధ. స్నానం తర్వాత అధిక రక్తస్రావం అవుతూంటే లేదా నొప్పులు వస్తే ఈ కధ చెప్పేవారు. నొప్పికి కారణం స్నానం అని భావించేవారు. నొప్పులు ఎందుకు వస్తాయంటే, గర్భాశయంలోని ద్రవాలను బయటకు నెట్టటానికి పొట్ట కండరాలు ప్రయత్నిస్తాయి. ఆ సమయంలో ఆమెకు నొప్పి కలుగుతుంది. చల్లటి నీటి స్నానం పొట్టలోని కండరాలను సంకోచించి నొప్పులు తగ్గేలా కూడా చేస్తుంది.
ఈ అపోహలు, వాస్తవాలు, మహిళ మెన్సెస్ పై ఇవ్వబడ్డాయి. మీకు కనుక మరిన్ని తెలిస్తే, మాకు వ్రాయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
