Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
ఆఫీసుల్లో పనిచేసే వారి సిట్టింగ్ పొజీషన్ ఎలా ఉండాలి...?

ఒక యంత్రంతో పదే పదే పనిచేస్తే కొన్నాళ్లకు దాని సామర్థ్యం తగ్గిపోతుంది. దానికి వెంటనే పలు మరమ్మతులు అవసరం అవుతాయి. మానవ శరీరం కూడా ఒక యంత్రంలాంటిదే. అందుకే మన కండరాలు, ఎముకలపై పరిమితి దాటి ఒత్తిడి అధికమై అవి బలహీనం అవుతాయి. ఫలితంగా ఆ భాగంలో నొప్పి ప్రారంభమవుతుంది. ఈ సమస్యనే రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజురీ అంటారు. దీనివల్ల చేతులు, భుజాలు, మెడ, నడుము... ఇలా ఏ భాగంలో నైనా నొప్పి రావచ్చు. దీనికి స్పష్టమైన కారణమేంటో పూర్తిగా తెలియకపోయినా వ్యాయామం లేకపోవడం, నరాలు, కండరాలపై ఒత్తిడి ఎక్కువ కావడమే ఇందుకు దోహదం చేస్తుందన్నది వైద్యనిపుణుల భావన. ముఖ్యంగా, వెన్ను నొప్పికి మనం కూర్చొనే సీట్ల నిర్మాణం, అమరిక కూడా ఒక కారణమని తాజా పరిశోధనల్లో తేలింది.
1. కుర్చీ నిర్మాణం అన్నింటి కన్నా ముఖ్యమైనది. మన వెనుక భాగం మొత్తానికి ఆధారాన్నిచ్చేదిగా ఉండాలి. చాలావరకు కుర్చీలు కేవలం వెన్నుభాగానికి మాత్రమే పరిమితం అవుతాయి. కానీ తల వరకు ఉండాలి. లేకుంటే మెడనొప్పి పట్టుకుంటుంది. ఇటీవల కనిపిస్తున్న ఆధునిక కుర్చీలు వెన్నుకు కూడా సపోర్టు లేకుండా ఉంటున్నాయి. ఇలాంటి కుర్చీలపై ఎక్కువ సమయం కూర్చుంటే మొత్తం వెన్నుపాము బలహీనం అవుతుంది. నడుంనొప్పి, వెన్నునొప్పి, మెడనొప్పి అన్నీ చుట్టుముడతాయి.
2. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు మానిటర్ సరిగ్గా మన కళ్లకు ఎదురుగా ఉండాలి. తల ఎత్తి లేదా దించి చూడాల్సి వచ్చేట్టుగా ఉండకూడదు. తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి. యాంటీగ్లేర్ స్క్రీన్స్ వాడాలి. తద్వారా మోనిటర్ నుండి వచ్చే రేడియేషన్ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది.
3. కీబోర్డు ఎత్తు ఎక్కువ తక్కువలు లేకుండా సరిగ్గా ఉండాలి. చేతులు వంకరగా కాకుండా ఛాతీకి దగ్గరగా, లంబకోణంలో ఉంచాలి.
4. మౌజ్ చేతికి దగ్గర్లో ఉండాలి. లేకుంటే భుజంనొప్పి మొదలవుతుంది. ఒత్తిడి తగ్గి భుజాలు విశ్రాంతి పొందేందుకు వీలుగా అప్పుడప్పుడు భుజాలను పైకి లేపుతూ ఉండాలి.
5. ఎక్కువ సమయం ఒకే భంగిమలో ఉండకుండా అటూ ఇటూ కదలడం మంచిది. కనీసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారైనా కుర్చీలోంచి లేచి కాస్త అటూఇటూ తిరగాలి.
6. పని తీవ్రంగా ఉన్నప్పుడు మధ్యమధ్యలో మెడకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
7. ఆఫీసులో సహోద్యోగుల దగ్గరకు వెళ్లే అవకాశం ఉన్నప్పుడు ఫోన్లు, ఈ-మెయిళ్ల వంటివి చేయకుండా కాస్త కాళ్లకు పని కల్పించటం మంచిది.
8. ఫోన్ వచ్చినపుడు లేచి నిలబడి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే కారిడార్‌లో పచార్లు చేస్తూ సంభాషించటం మేలు.
9. వీలైనంతవరకు లిఫ్ట్‌ని వాడకుండా మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాలి.
10. కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
