Latest Updates
-
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.!
వేసవి సీజన్ లో ఖచ్చితంగా తినాల్సిన బెస్ట్ ఇండియన్ ఫుడ్స్
వేసవి సీజన్ లో శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. ముఖం పేలవంగా మారుతుంది. వివిధ రకాల చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వేసవిలో వేడి శాతం శరీరం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. మొటిమలు మరియు స్కిన్ రాషెస్, సన్ టాన్, నీటిబొడిపలు వివిధ రకాలుగా సమస్యలను ఎదుర్కోవాలి.
వీటన్నింటికి చెక్ పెట్టాలంటే, వేసవి వేడిని బీట్ చేయాల్సిందే. సమ్మర్ హీట్ ను బీట్ చేయడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వేసవి సీజన్ లో మీశరీరానికి తగినంత ఎనర్జీ, నీటిని అందించే కొన్ని సూపర్ ఫుడ్స్ ను బోల్డ్ స్కై మీతో షేర్ చేసుకుంటున్నది.
READ MORE:ఎనర్జీని అందించే 14 బ్రేక్ ఫాస్ట్ సమ్మర్ ఫుడ్స్
ఈ ఇండియన్ సూపర్ ఫుడ్స్ అనేక ప్రోటీనులు మరియు న్యూట్రీషియన్స్ కలిగి ఉన్నది. ఇవి శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి, శరీరాన్ని చల్లబరుస్తుంది. ముఖ్యంగా, ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఫుడ్స్ అన్నీ కూడా చౌకనవి, మనకు చాల సులభంగా అందుబాటులో ఉండే ఫుడ్స్, కాబట్టి ఈ హెల్తీ ఫుడ్స్ కోసం ఎక్కువ ఖర్చు అవుతుందన్న భయం లేదు. హెల్తీ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. READ MORE: వేసవికాలంలో ఆరోగ్యానికి మేలుచేసే మరియు హానికలిగించే ఆహారాలు
మరి హెల్తీ సమ్మర్ ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం...!

వాటర్ మెలోన్:
వాటర్ మెలోన్ (పుచ్చకాయ)వేసవి సీజన్ లో తీసుకొనే సూపర్ ఫుడ్స్ లో ఇది ఒకటి. ఇందులో ఎక్కు వాటర్ ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

కీరదోసకాయ:
కీరదోసకాయలో కూడా నీటిశాతం అధికంగా ఉంటుంది. కాబట్టి, వేసవి సీజన్ లో వీటిని తీసుకోవడం చాలా అవసరం . కీరదోసకాయను డైలీడైట్ లో చేర్చుకోవాలి..

మజ్జిగ:
వేసవి సీజన్ లో జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాల్లో బట్టర్ మిల్క్ ఒకటి . ఇది శరీరంలో వేడి తగ్గిస్తుంది. శరీరంను చల్లబరుస్తుంది.

మామిడిపండ్లు:
మామిడిపండ్లును వేసవి సీజన్ లో తప్పనిసరిగా తీసుకోవాలి . ఇది శరీరంలో వేడి పుట్టించే ఫుడ్స్ అయినా, వేసవి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

ఆరెంజ్:
ఇండియన్ సమ్మర్ ఫుడ్స్ లో ఆరెంజ్ మరో హెల్తీ ఫుడ్. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండట వల్ల ఇది చర్మ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

స్వీట్ లెమన్:
వేసవి సీజన్ లో మరో వాటర్ కంటెంట్ ఫుడ్ మరియు శరీరానికి ఎక్కువ చల్లదనాన్ని అందిస్తుంది. స్వీట్ లైమ్ జీవక్రియలకు చాలా మేలు చేస్తుంది . మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది. వేడిని త్వరగా తగ్గిస్తుంది.

టమోటోలు:
టమోటోలు లేదా టమోటో జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక పెంచడంతో పాటు సమ్మర్ హీట్ ను ఎదుర్కోవచ్చు. ఈ ఇండియన్ సూపర్ ఫుడ్ క్యాన్సర్ నిరోధిని.

కోకనట్ వాటర్
కోకనట్ వాటర్ లో న్యూట్రీషియన్ అధికంగా ఉంటాయి. వేసవి సీజన్ లో కోకనట్ వాటర్ త్రాగడం చాలా అవసరం.

గ్రీన్ బీన్స్:
గ్రీన్ బీన్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో వ్యాధినిరోధకతను పెంచడానికి అవసరం అయ్యే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా అందిస్తుంది.వీటిని సలాడ్స్ లో జోడించుకోవచ్చు. వీటిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది

సాల్మన్:
సాల్మన్ చేపలు హెల్తీ సూపర్ ఫుడ్. సమ్మర్ సీజన్ సూట్ అయ్యే ఆహారాల్లో ఇది ఒకటి. ఇది వేడి పుట్టించే ఆహారం కాదు .

బ్రౌన్ రైస్:
వైట్ రైస్ తో పోల్చితే బ్రౌన్ రైస్ చాలా మంచిది. ఇది బరువు తగ్గించడానికి, పొట్ట చాలా తేలికగా ఉంచడానికి సహాయపడే హెల్తీ సమ్మర్ ఫుడ్ .

అరటిపండ్లు:
అరటిపండ్లలో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక బెస్ట్ ఇండియన్ సూపర్ ఫుడ్ .

ద్రాక్ష:
ద్రాక్ష మహిళలకు ఒక ఆరోగ్యకరమైన ఫుడ్. ఇందులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

కార్న్:
కార్న్ మరో హెల్తీ ఫుడ్ ఇందులో లో ఉండే అధిక ప్రోటీనులు మరియు మినిరల్స్ ఉండటం వల్ల ఇండియన్ సమ్మర్ ఫుడ్స్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి.

స్ట్రాబెర్రీస్:
స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఈ సూపర్ ఫుడ్ సమ్మర్ సీజన్ ఒక ఒక ఉత్తమ ఫుడ్ అంతే కాదు వీటిలో క్యాల్షియం కంటెంట్ కూడా అధికంగా ుండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.



Click it and Unblock the Notifications