Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఖరీదైన ఆపిల్ కంటే.. చౌకైన జామతోనే బెన్ఫిట్స్ ఎక్కువ
హాయిరే.. హాయి జామపండు రోయి.. అంటూ హాయిగా పాటయే కాదు.. తియ్యగా నోరు తీపి చేసుకోవచ్చు. చూడగానే తినేయాలనిపించే జామపండు అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. అందరూ అమితంగా ఇష్టపడే ఈ జామపండు వగరు, తీపి, విత్తనాల రుచి కలిగి ఉంటుంది. చూడగానే నోరూరించే ఈ పండులో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
READ MORE: జామ ఆకులో ఆశ్చర్యం కలిగించి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
మిగిలిన పండ్లతో పోల్చితే జామలో కాల్షియం, ఐరన్ ఎక్కువ. థాయ్‌మెరూన్ రకం జామ పండ్లలో కెరోటినాయిడ్లూ, పాలీఫినాల్స్ శాతం కూడా చాలా ఎక్కువ. అందుకే ఈ పండ్ల తొక్క, గుజ్జు ఎర్రగా ఉంటుంది. మామూలుగానే జామలో యాంటీ ఆక్సిడెంట్లలో కెల్లా కీలకమైన పాలీపినాల్స్ పుష్కలంగా దొరుకుతాయి. జామలో ఉండే పోషకాలు అనేక వ్యాధులకు మంచి మందులా పనిచేస్తుంది.
READ MORE: గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..
జామ పండు ఇష్టపడని వారుండరు. జామ చెట్టు దాదాపు అందరి ఇళ్లలో ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగుల గుజ్జుతో కలిగి వగరూ, పులుపుతో ఉండే ఈ జామచెట్టు ఆకులోనూ హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయి. జామపండు ను ఆంధ్రా యాపిల్, పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తారు. చెప్పాలంటే కాశ్మీర్ యాపిల్ కంటే అందరికీ అందుబాటులో ధరలో ఉండే జామపండులోనే ఎక్కువ ప్రయోజనాలు దాగున్నాయి.

బరువు తగ్గడానికి
జామపండు తక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ర్టాల్ గుణాలు కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కాబట్టి రోజుకి ఒక్క జామపండు తింటే మంచిది. అంతేకాదు జామపండు, శరీరంలో పొటాషియం గ్రహించాటాన్ని పెంచి శరీర కండరాలను దృడ పరిచి, కొవ్వుని తగ్గిస్తుంది.

మలబద్ధకం
జామపండులో ఫైబర్ లేదా పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు.

వయసు ఛాయలు
చిన్న వయసులోనే వచ్చే ముడతలు, చర్మం సాగుదల వంటి సమస్యలను జామపండు ద్వారా తగ్గించుకోవచ్చు. జామపండు చర్మాన్ని శుభ్రంగా, కాంతివంతంగా చేస్తుంది. అంతేకాకుండా, ఇది ముఖచాయని మెరుగుపరుస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్
జామపండులో విటమిన్ ఏ, బి, సిలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన యాంటి ఆక్సిడెంట్లు జామపండు ద్వారా పుష్కలంగా లభిస్తాయి.

కంటి సమస్యలు
రోజు జామపండు తినటం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. జామపండు విటమిన్ ఏ ని కలిగి ఉండటం వల్ల ఇది కంటి చూపును అభివృద్ది చేస్తుంది.

క్యాన్సర్
జామపండులో టమాటోల కన్నా ఎక్కువ లైకోపిన్ ఉంటుంది. లైకోపిన్ యూవీ కిరణాల నుంచి చర్మాన్ని చెడిపోకుండా, క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడానికి జామపండు సహాయపడుతుంది.

స్త్రీలకు
జామపండు స్త్రీల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రుతుచక్ర సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి రాకుండా నివారిస్తుంది. అలాగే మగవాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.

వ్యాధి నిరోధక శక్తి
జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

ఊపిరితిత్తులకు
జామపండులో ఉండే ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్, లైకోపిన్ ఉపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడతాయి. లంగ్స్ లో వచ్చే అనారోగ్య సమస్యలను మొదట్లోనే నివారించే గుణం జామపండులో ఉంది.

ఎర్రరక్త కణాలు
జామకాయలో బి కాంప్లెక్స్ విటమిన్స్ అయితే బి6, బి9తోపాటు విటమిన్ ఈ, విటమిన్ కె ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడతాయి.

జీర్ణక్రియ
జామపండు అధికంగా ఫైబర్స్ ని కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థను శుభ్రపరచి, బోవేల్ కదలికలను ప్రోత్సహించటంలో తోడ్పడుతుంది. భోజనం తర్వాత జామపండు తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

ఒత్తిడి
ఉదయం, రాత్రి భోజనం తర్వాత జామపండు తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి మాయమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె జబ్బులకు
గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుంది. ఇందులో ఉండే పొటాషియం హార్ట్ డిసీజ్ లు రాకుండా నివారిస్తుంది.

రక్త ప్రసరణ
జామపండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.

డయాబెటీస్
జామపండు తొక్క మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా ఉపయోగపడుతుంది. తాజా అధ్యయనాల ప్రకారం జామపండు తినే వాళ్లలో బ్లడ్ ప్రెషర్, కొవ్వు పదార్థాలు చాలా కంట్రోల్ లో ఉన్నట్టు తేలింది.

పంటి నొప్పులకు
జామ ఆకులు 20-25 తీసుకుని నీటిలో ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోవాలి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులు తగ్గిపోతాయి.

ఎనర్జీ లెవెల్స్
బాగా మాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాములు తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పెరుగుతుంది. నూతనోత్సాహం వస్తుంది.

జుట్టు రాలడం నివారించడానికి
జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.



Click it and Unblock the Notifications