Latest Updates
-
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
స్ట్రోక్ యొక్క ఆరంభ హెచ్చరిక చిహ్నాలు
స్ట్రోక్ కి వైద్యం అత్యవసరం, దీనివల్ల ఎక్కువగా పెద్దవారిలో అంగవైకల్యం, మరణం సంభవిస్తుంది. కొన్నిసార్లు స్ట్రోక్ చిహ్నాలను గుర్తించడం కూడా చాలా కష్టం. మీ అత్యంత విలువైన జీవితాన్ని రక్షించుకోవడానికి స్ట్రోక్ యొక్క చిహ్నాలను తప్పక గమనించుకోవాలి. స్ట్రోక్ కు హెచ్చరిక చిహ్నాలను గురించి మాట్లాడుకునే ముందు అసలు స్ట్రోక్ అంటే ఏమిటో తెలుసుకుందామా?
మెదడుకు రక్తప్రసరణ నిలకడగా ఉంటే దాని పనితీరు బాగుంటుంది. రక్త ప్రసరణ మెదడు కణాలకు కీలకమైన పోషకాలను, ఆక్సిజన్ ను అందిస్తుంది. రక్త కణాలు (ధమనులు) ఆక్సిజెన్ తో కూడిన అధిక రక్తాన్ని గుండె నుండి అన్ని అవయవాలకు, మెదడుతో సహా శరీరంలోని కణాలకు రవాణా చేస్తాయి.
మెదడుకు ప్రవహించే రక్తానికి ఏదైనా ఆటంకం ఏర్పడితే దానివల్ల స్ట్రోక్ వస్తుంది. రెండు కారణాల వల్ల ఆటంకం కలుగుతుంది. మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనిలో క్లాట్ ఉంటే ఆ బ్లాక్స్ రక్త ప్రసారాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు.
రెండవ కారణం మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమని దెబ్బతింటే దానివల్ల అధిక రక్తపోటు వస్తుంది. దీనిని హేమోర్హాజిక్ స్ట్రోక్ అంటారు. ఇది కూడా మెదడు ప్రాంతంలో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది.
స్ట్రోక్ లేదా పక్షవాతంకు ప్రారంభ లక్షణాలు:

స్ట్రోక్ వల్ల కలిగే అంగవైకల్యాలు
మెదడుకు రక్త ప్రసరణ ఆటంకం కలిగినా, ఆగి పోయినా, మెదడు కణాలు చనిపోవడం ప్రారంభమై, దానివల్ల మెదడు దెబ్బతింటుంది. ఇలాంటి సందర్భాలలో మెదడులోని ఏ ప్రాంతానని నియంత్రిస్తుందో శరీరంలోని ఆ భాగం వైకల్యానికి గురౌతుంది. దీనివల్ల మాట పడిపోవడం, జ్ఞాపకశక్తి, కదలిక కోల్పోవడం జరుగుతుంది. ఈ స్ట్రోక్ మెదడులో ఏ భాగానికి ప్రభావితమైంది, మెదడు ఎంత దెబ్బతిన్నది అనేదానిపై ఆధారపడి రోగిపై ప్రభావం చూపుతుంది.

బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పక్షవాతం
స్ట్రోక్ చిన్నదే అయితే, దానివల్ల మోచేయి లేదా కాలు కొద్దిగా నీరసిస్తాయి. కానీ అదే పెద్ద స్ట్రోక్ అయితే ఆ రోగికి ఒక వైపు భాగమంతా పనిచేయక పోవడం, మాట్లాడే సామర్ధ్యాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉండి. అయినప్పటికీ, రక్త ప్రసరణ పూర్తిగా దేబ్బతినకపోతే బతికి ఉండడం సాధ్యపడుతుంది, వారు చనిపోయే కొన్ని గంటల ముందు రక్త కణాలు కోల్పోతారు.

చిన్న స్ట్రోక్ (తాత్కాలికమైన ఇస్కీమిక్ అటాక్)
అదృష్టవశాత్తూ, కొంతమంది రోగులకు, స్ట్రోక్ తరువాత కొన్ని కణాలు కోలుకుని కొన్ని గంటలు, నిమిశాలలు తిరిగి రక్త ప్రసరణ జరుగుతుంది. దీనిని కూడా మినీ స్ట్రోక్ అంటారు. ఇది తాత్కాలికమైన బ్లాకేజ్ దీనివల్ల పూర్తిగా మెదడు దేబ్బతినదు, కానీ స్ట్రోక్ హెచ్చరికా చిహ్నాలు కొన్ని నిముషాలు లేదా గంటలలోనే తెలుసుకోవచ్చు, ఈ హెచ్చరిక చిహ్నాల పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి, వాటిని వదిలేయకూడదు.

స్ట్రోక్ యొక్క హెచ్చరిక చిహ్నాలు
మీరు స్ట్రోక్ చిహ్నాలను ముందుగానే తెలుసుకోవాలి, అలాంటి చిహ్నాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. కొంతమంది స్ట్రోక్ నుండి పూర్తిగా కోలుకుంటారు, కానీ 2 లేదా 3 సార్లు స్ట్రోక్ వచ్చినవారు కొన్ని రకాల దీర్ఘకాలిక వైకల్యాల బారిన పడతారు. స్ట్రోక్ వచ్చినపుడు ఎపుడూ అత్యవసర వైద్యం అవసరం, అంతేకాక స్ట్రోక్ లక్షణాలను గుర్తించి, సాధ్యమైనంత వరకు త్వరగా సహాయం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. సూక్ష్మం గ్రహించండి.

నీరసం లేదా మోద్దుబారడం
ఇది స్ట్రోక్ యొక్క ఘంటాపధంతో చెప్పే హెచ్చరిక చిహ్నాలలో ఒకటి. ముఖం కండరాలలో, మోచేయి లేదా కాలు శరీరంలోని ఒకవైపు భాగంలో అనుకోకుండా నీరసం లేదా మోద్దుబారడం జరుగుతుంది. కొన్నిసార్లు రోగి పూర్తిగా మొద్దుబారిపోయి, కనీసం మోచేతిని కూడా ఎత్తలేడు. ఇతర సందర్భాలలో ముఖం ఒకవైపుకి వంగిపోయి, మాట్లాడేటపుడు లేదా నవ్వ దానికి ప్రయత్నం చేసినుడు ముఖ౦ వంకరగా కనిపిస్తుంది.

ఉన్నట్టుండి మాటపడిపోవడం
రోగికి ఒకరితో మాట్లాడటంలో సమస్యలు, మాటలను అర్ధం చేసుకునే సామర్ధ్యం, మాట్లాడడానికి ఇబ్బంది లేదా తెలివిగా మాట్లాడటంలో తడబడటం, తికమకగా కనిపించడం లేదా వివరాలను లేదా ఆదేశాలను అర్ధం చేసుకోవడంలో పొరపాట్లు జరుగుతాయి.

ఉన్నట్టుండి వినిపించక పోవడం
స్పష్టంగా కనిపించడం, ప్రత్యేకంగా ఒక కంటితో చూడడం లో సమస్యలు వస్తాయి. ఇది స్ట్రోక్ లో ముందుగా వచ్చే హెచ్చరిక సూచనలలో ఒకటి.

ఆకస్మికంగా సంచలనం కోల్పోవడం
ఇది చర్మం పై ఈ ప్రభావం లేకుండా ఉంటుంది లేదా ఇతర చలనాలు అంటే వాసన, రుచి, వినిపించక పోవడం వంటివాటిపై ప్రభావం చూపుతుంది.

హఠాత్తుగా సమన్వయము, సమతుల్యత కోల్పోవడం
రోగికి వాంతులు, వికారం, జ్వరం లేదా కొద్దిగా స్పృహ కోల్పోయినట్లు అనిపించడం తోపాటు నీరసంగా, తలతిరిగినట్లు అనిపిస్తుంది. తరచుగా బాధితులు సమన్వయము, సమతుల్యం కోల్పోయి నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.

హఠాత్తుగా, తీవ్రమైన తలనొప్పి
స్పృహ కోల్పోవడం వల్ల త్వరగా తలనొప్పి వస్తుంది.
అసంకల్పిత చర్య తగ్గడం లేదా కోల్పోవడం
ఇలాంటి సందర్భాలలో రోగికి మ్రింగడానికి ఇబ్బంది ఏర్పడి బలవంతంగా ఆహారాన్ని నోట్లోకి నేట్టాల్సి వస్తుంది.

అత్యవసర సహాయం
దీనికి అత్యవసర వైద్యం అవసరం, వెంటనే తగిన చర్య తీసుకోకపోతే ఆ వ్యక్తి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మీరు కానీ లేదా ఎవరైనా అతనికి స్ట్రోక్ వచ్చే చిహ్నం గమనిస్తే, వెనకాడకండి. సరైన పద్ధతిలో అత్యవసర వైద్య శ్రద్ధ తీసుకోండి. వెంటనే రోగాన్ని గుర్తించి, శీఘ్రంగా హాస్పిటల్ కి తరలిస్తే ఆ వ్యక్తి జీవితాన్ని రక్షించ వచ్చు.

స్ట్రోక్ చిహ్నాలకు పరీక్ష
మీ పక్కన ఉన్న వ్యక్తికి స్ట్రోక్ వచ్చిందని మీరు గమనించలేక పోతే, ఈ తేలికైన పరీక్షలను అనుసరించండి, ఆ రోగికి 4 చిన్న విషయాలను తెలియచేయండి.

ముఖం మీది కండరాలు
రోగిని నవ్వమని చెప్పండి, ఆమె/అతను సరిగా నవ్వుతున్నారో లేదో చూడండి లేదా ఒక వైపుకి మొహం వంగితే, అది హెచ్చరిక గుర్తుగా పరిగణించండి.

చేతులు
రోగిని రెండు చేతులూ ఒకేసారి పైకి ఎత్తమని చెప్పండి. ఒక చెయ్యి వంపుగా ఉందా లేదా ఎత్తలేక పోతున్నారా చూడండి. అలా ఉంటే అది స్ట్రోక్ కి హెచ్చరిక సూచనగా భావించండి.

మాట్లాడటం
రోగిని ఒక చిన్న వాక్యం చెప్పమని అడగండి. అతని మాటలు విచిత్రంగా లేదా అర్ధం కాకుండా ఉందేమో గమనించండి. పైన చెప్పినవి ఏవి సరిగా పనిచేయకపోయినా, వైద్య సహాయం కోసం వెంటనే అంబులెన్సు పిలవండి.

అసంకల్పిత చర్య తగ్గడం లేదా కోల్పోవడం
ఇలాంటి సందర్భాలలో రోగికి మ్రింగడానికి ఇబ్బంది ఏర్పడి బలవంతంగా ఆహారాన్ని నోట్లోకి నేట్టాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications











