Latest Updates
-
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
ప్రేగులను శుభ్రపరిచి, బరువు తగ్గించే ఫైబర్ రిచ్ ఫుడ్స్
మానవ శరీరంలో జీర్ణ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. అతి పెద్ద వ్యవస్థలో ఒకటిగా దీన్ని చెప్పవచ్చు. చిన్న పేగులో ఆహారం జీర్ణమవుతుంది. అయితే కాలేయం, క్లోమం నుంచి విడుదలైన స్రావకాలు ఈ జీర్ణ ప్రక్రియకు సహకరిస్తాయి. అంతిమంగా జీర్ణమైన పదార్థాలు పేగు ద్వారా రక్తంలో కలిసిపోయి మిగిలిన వ్యర్థాలు మాత్రం అక్కడ నుంచి రెక్టం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
ఈ జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే శరీరానికి శక్తి సజావుగా అందుతూ ఉంటుంది. లేకపోతే ఇబ్బంది తప్పదు. జీర్ణకోశ వ్యవస్థలో అనే సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇందులో ప్రధానమైనవి పేగులో మలబద్దకం, అల్సర్లు, ఇన్‌ఫెక్షన్లు,పేగు వాపు, పేగు మడత పడడం, పేగు అడ్డు పడటం క్యాన్సర్ వంటి చెప్పవచ్చు కాలేయం, క్లోమంలో వాపు రావడం, రాళ్లు చేరటం, క్యాన్సర్, కామెర్లు రావటం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ప్రేగు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తినడం తప్పనిసరి
జీర్ణం కావటంలో ఇబ్బంది నొప్పి, వాంతులు , మల విసర్జన లో ఇబ్బంది, వాంతులు, మలంలో రక్తం పోవడం, శరీరం నీరసించడం, బరువు తగ్గడం, జ్వరం, పొట్టలో నీరు చేరడం, కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రతి సమయంలోనూ అన్ని లక్షణాలు కనిపించాలని లేదు ఒక్కోసమయంలో ఒక్కోరకంగా లక్షణాలు కనిపిస్తాయి. వీటి ఆధారంగా సమస్యను అంచనా వేయవచ్చు. మనం తీసుకొన్న ఆహారాలు జీర్ణం కాకుండా ప్రేగుల్లో నిల్వచేరినప్పుడు అసౌకర్యంగా మరియు ఫుల్ గా ఉన్న అనుభూతి కలుగుతుంది . కాబట్టీ, జీర్ణవ్యవస్థ ఎప్పటికప్పుడు శుభ్రపడుతున్నట్లైతే ఆరోగ్యకరంగా జీవించవచ్చు. ఈ క్లీనింగ్ సిస్టమ్ వల్ల హెల్తీ బాడీ పొందవచ్చు. అందువల్ల ప్రతి రోజూ తీసుకొనే ఆహారాల్లో ఆరోగ్యకరమైనవి, పేగులను మరియు కోలన్ ను శుభ్రపరిచే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
హార్ట్ అటాక్, క్యాన్సర్ తో మరణించిన టాప్ సెలబ్రెటీలు
కొన్ని రకాల ఆహారాలు ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మరియు వాటర్ కంటెంట్, మంచి బ్యాక్టీరియా(ప్రోబయోటిక్స్)అధికంగా ఉండే ఆహారాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇవి పేగులను శుభ్రపరచడం మాత్రమే కాదు, ఇవి జీర్ణవ్యవస్థ, జీర్ణవాహిక యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . కాబట్టి ఇలాంటి ఆహారాలు ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం వారి రెగ్యులర్ డైట్ చేర్చుకోవాలి. అంతే కాదు పొట్టలో ప్రేగులు ఎప్పటికప్పుడు శుభ్రపడటం ద్వారా, బరువు కూడా తగ్గించుకుంటారు.
మరి పొట్టను, ప్రేగులను వుభ్రం చేసి, బరువు తగ్గించే అమేజింగ్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

1. కలబంద:
పేగులను శుభ్రపరిచే బెస్ట్ ఫుడ్స్ లో అలోవెరా ఒకటి. ఇది పేగకు కొద్దిగా మంట కలిగించినా, బౌల్ మూమెంట్ క్రమంగా ఉంటుంది. మరియు పేగుల్లో ఉండే వ్యర్థాలను , జీర్ణవాహిక ద్వారా బయటకు నెట్టివేస్తుంది . అంతే కాదు, పొట్ట మరియు ప్రేగుల్లో అల్సర్ వల్ల బ్లీడింగ్ అవుతుంటే దాన్ని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . కాబట్టి ప్రతి రోజూ ఉదయం అలోవెరా జ్యూస్ త్రాగడం వల్ల ప్రేగులను శుభ్రపరచుకోవచ్చు.

2. ఫైబర్ ఫుడ్స్:
ఓట్స్, హోల్ గ్రెయిన్స్, మైజ్, బార్లీ, గోధులములు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మొదలగు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ప్రేగుల్లోని వ్యర్థాలను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రపరుస్తుంది . ఈ ఫైబర్ ఫుడ్స్ ప్రేగుల్లో చేరడం వల్ల ప్రేగుల్లో బౌల్ మూమెంట్ మీద ఒత్తిడి పెంచుతుంది. మరియు ప్రేగుల్లోనీ నీటితో చేరి స్టూల్ ను స్మూత్ గా మార్చుతుంది . దాంతో బౌల్ మరింత సులభతరం అవుతుంది .

3. ఆపిల్స్:
పేగులను శుభ్రపరచడానికి మరియు మలబద్దకం నివారించడానికి ఆపిల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఆపిల్స్ లో అద్భుతమైన క్లెన్సిమగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి . బౌల్ మూమెంట్ పెంచుకోవాలంటే సాధ్యమైనంత వరకూ ఆపిల్స్ ను అధికంగా తీసుకోవాలి. ఆపిల్స్ లో పెక్టిన్, ఫైబర్ , కార్బోహైడ్రేట్స్, మొదలగునవి అధికంగా ఉండటం వల్ల అది బల్క్ గా ఏర్పడటానికి సహాయపడుతుంది, నీరు కోల్పోవడాన్ని తగ్గిస్తుంది మరియు బౌల్ మూమెంట్ ను క్రమబద్దం చేస్తుంది.

4. అరటిపండ్లు:
అరటిపండ్లలో పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి . అంతే కాదు ఇందులో క్లెన్సింగ్ ప్రొపర్టీస్ కూడా అధికమే . అరటిపండ్లు రెగ్యులర్ గా తీసుకుంటుంటే డైజెస్టివ్ సిస్టమ్ మంచి కండీషన్లో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల పేగులను శుబ్రపరచుకోవడంతో పాటు ఫిట్ గా ఉండవచ్చు. అరటిపండ్లు బెస్ట్ కోలన్ క్లెన్సింగ్ ఫుడ్స్ గా చెప్పవచ్చు.

5. పెరుగు:
పేగులను శుభ్రపరచడంలో మరో బెస్ట్ ఫుడ్ పెరుగు. పెరుగులో మంచి బ్యాక్టీరియా(ప్రోబయోటిక్స్) అధికంగా ఉంటాయి . ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి మరియు శరీరంలో షోషింపబడుతాయి . జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడానికి పెరుగు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు ఇది ప్రేగులను శుభ్రపరిచి కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

6.పాలు:
పాలను ఎవరైతే సులభంగా జీర్ణించుకోగలలో అలాంటి వారిలో పేగులు చాలా సులభంగా సుభ్రపడుతాయి . పాలలో కొద్దిగా లాక్సేటివ్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఇది మలబద్దకాన్ని చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. పాలు పేగుల్లో చేరిన జీర్ణం కానీ ఆహారాలు మరియు టాక్సిన్స్ ను శుబ్రం చేస్తుంది . కాబట్టి ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు పాలు మరియు తేనె తీసుకోవడం వల్ల పేగులు శుభ్రపడుతాయి.

7. అవొకాడో:
కోలన్ ను శుభ్రపరుస్తుంది. అవొకాడోలో సోలబుల్ మరియు అన్ సోలబుల్ ఫైబర్స్ అధికంగా ఉన్నాయి . మరియు ప్రోటీనులు మరియు ఇతర న్యూట్రీషియన్స్ కూడా పుష్కలంగా ఉండటంతో మంచి జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

8. వెల్లుల్లి:
వెల్లుల్లి తినడం వల్ల అనేక ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది మరియు ఇది యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. పేగులను శుభ్రపరిచి టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది . వెల్లుల్లి తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హైబ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications