Latest Updates
-
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.! -
స్వీట్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ట్రీట్..బాదం సేమియా పాయసం ఇలా చేశారంటే అదిరిపోతుంది! -
వాస్తు ప్రకారం తులసి మొక్క వద్ద ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా.. లేదంటే అరిష్టాలు తప్పవు.! -
మిగిలిన అన్నాన్ని ఇలా వాడారంటే.. ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తినాల్సిందే! -
ఈ ఒక్క పౌడర్ కలిపారంటే.. మొక్కజొన్నతో కరకరలాడుతూ టేస్టీ పకోడీ రెడీ.! -
పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం.. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు ఇవే.!
ప్రాణాంతక క్యాన్సర్ ని దూరం చేసే ఫుడ్ హ్యాబిట్స్
ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న భూతం క్యాన్సర్. ఒకటి కాదు రెండు.. రకరకాల క్యాన్సర్ లు శరీరంలోని అన్ని భాగాలకు వస్తున్నాయి. చర్మం నుంచి కాలేయం వరకు ప్రతి అవయవానికి అటాక్ అవుతోంది క్యాన్సర్. ఇంత ప్రాణాంతకమైన క్యాన్సర్ ని ముందుగానే రాకుండా నివారించాలి. క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయిందంటే కష్టం. కాబట్టి.. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి కాబట్టి.. ముందు జాగ్రత్తలు పాటిస్తే.. మంచిది.
మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని నివారించవచ్చు అనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే.. మనం క్యాన్సర్ కి దూరంగా ఉండవచ్చో తెలుసుకుందాం.. క్యాన్సర్ నిర్మూలిద్దాం..

గ్రీన్ టీ
గ్రీన్ టీ ఈసీసీజీని కలిగి ఉంటుంది. దీనిలోని పోలిఫినాల్ అనేది క్యాన్సర్ సెల్ పెరుగుదలను క్రమంలో ఉంచుతుంది. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ లెవల్స్ పై ప్రభావం చూపుతుంది.

ఆకుకూరలు
ఆకుకారల్లోని పోషక విలువలు డీఎన్‌ఏ డ్యామేజ్ కాకుండా చేస్తుంది. అలాగే ట్యూమర్లను సక్రమమైన పద్ధతిలో ఉంచుతాయి. నాన్ ఎంజీవో సోయా బీన్ క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తాయి. అంతేకాదు ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కంట్రోల్ లో ఉంచుతుంది.

టమోటా
టమోటాలలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వివిధ రకాల క్యాన్సర్ లను కలుగచేసే కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి. కాబట్టి వీటిని వంటకాల్లో వాడటం వల్ల క్యాన్సర్ కి దూరంగా ఉండవచ్చు.

వెల్లుల్లి
దంచిన లేదా కత్తిరించిన వెల్లుల్లి, వంటలలో వాడటానికి ముందు 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయటం వల్ల అల్లిసిన్ అనే ఫైటోకెమికల్ తయారవుతుంది. ఇది అనేక రకాల వ్యాధులను కలిగించే కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది.

బంగాళదుంప
బంగాళదుంపను కొన్ని పద్దతిలో వండినపుడు ఆక్రిలమెయిడ్ అనే ఎంజైంను తయారుచేస్తుంది. ఈ రసాయనం వివిధ రకాల క్యాన్సర్ లను కలుగచేస్తుంది. బంగాళదుంపను ఫ్రిజ్ లో ఉంచకూడదు. అలాగే బంగాళదుంపను వంటలో వాడటానికి ముందు 15 నుంచి 30 నిమిషాలపాటు నీటిలో నానబెట్టడం వల్ల ఆక్రిలమెయిడ్ రసాయనం విడుదల కాకుండా ఉంటుంది.

బ్రెడ్
బ్రెడ్ కూడా బంగాళదుంపలా ఎక్కువ వేడి చేయటం వలన అక్రిలమెయిడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. బ్రెడ్ లేత గోధుమ రంగులోకి మారిన తరువాత వంటకాలలో వాడకూడదు.

మాంసం
ఎక్కువ ఉష్ణోగ్రతలలో వండటం వలన డీఎన్ఏలను ప్రమాదానికి గురి చేసే సమ్మేళనాలను మాంసం విడుదల చేస్తుంది. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికమవుతాయి. బొగ్గులపైన వండిన మాంసం లేదా ఉడకబెట్టిన మాంసం తినడం మంచిది.

హెర్బల్స్
హెర్బల్స్ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టే వీటిని వ్యాధులను తగ్గించటానికి వాడతారు. రోజ్మేరీ వంటివి క్యాన్సర్ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి. రోజ్మేరీ కార్న్ జోల్ అనే పదార్థాన్ని కలిగి ఉండి, క్యాన్సర్ ను పెంచే కారకాలకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది.

పండ్లు, కూరగాయలు
పండ్లు, కూరగాయలపై ఉండే తొక్కను తీసేసి తినడం ప్రస్తుతం అందరికీ ఉన్న అలవాటు. కానీ ఈ తొక్కలు క్యాన్సర్ కారకాలను నశింపచేసే ఫైటోకెమికల్స్ లను కలిగి ఉంటాయి. అలాగే కూరగాయలను ఎక్కువ సమయం వండికూడదు. ఎందుకంటే అవి నీటిలో కరిగే విటమిన్ లను కోల్పోతాయి.

విటమిన్ సి
నిమ్మ, కమలా వంటి విటమిన్ సి ఉండే.. పండ్లు తీసుకోవడం మంచిది. ఇవి క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. అలాగే విటమిన్ డి, విటమిన్ ఈ ఉండే ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి.



Click it and Unblock the Notifications