Latest Updates
-
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది!
జీర్ణక్రియకు హాని కలిగించి, హార్ట్ బర్న్, ఎసిడిటికి గురిచేసే10 ఆహారాలు
శరీరంలో జీర్ణక్రియ యొక్క ఆరోగ్య స్థితి గతులు మనం తీసుకొనే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది . ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెల్తీ ఫుడ్స్ కంటే జంక్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అందుకు రెండు ప్రధాన కారణాలు ఒకటి ఫ్యాషన్ కల్చర్ , రెండవి టేస్ట్ బడ్స్. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు చాలా సాధారణమైపోయాయి.
ఒక మానవ జీర్ణ వ్యవస్థ ఇలా ప్రొసెసింగ్ చేసిన ఆహారాలకు జీర్ణం చేయడానికి జీర్ణాశయంలో గ్రంథులు మరియు అవయవాలకు కష్టంగా మారుతున్నది. మనం తీసుకొనే ఆహారం శరీరంలో ప్రేగుల్లో ఆహారం చిన్ని చిన్న పరిమాణువులుగా విచ్ఛిన్నం చేసి జీర్ణింప చేసి శరీరానికి అవసరం అయ్యే శక్తిని ఉత్పత్తి చేయడానికి మరియు వ్యర్థాలను శరీరం నుండి విసర్జింప చేయడానికి జీర్ణవ్యవస్థ చాలా అవసరం.
READ MORE: జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు
అలాంటి జీర్ణవ్యవస్థ ఒకసారి దెబ్బతింటే ఏమవుతుంది? జీర్ణ సమస్యలు మొదలవుతాయి? ముఖ్యంగా చాలా చెడుగా మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తాయి. జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపి జీర్ణాశయం ఒక గార్బేజ్ లా తయారవుతుంది. దాంతో హార్ట్ బర్న్, మలబద్దకం, డయోరియా, గ్యాస్ మరియు కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు మొదలవుతాయి. అంటే శరీరంలో అంతర్గతంగా పర్యావరణ వ్యవస్థ కలత చెందినదని అర్ధం.
జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు మైగ్రేన్, ఆందోళన, డిప్రెషన్, జాయింట్ పెయిన్, ఎక్సిమా, మొటిమలు, అలర్జీలు, వంటి ఇతర వ్యాధులను ఎదుర్కోవల్సి వస్తుంది . అందువల్ల జీర్ణవ్యవస్థకు హాని కలిగించే ఆహారాలు తీసుకోవడం చాలా తక్కువ చేయాలి లేదా పూర్తిగా తినకుండా నివారించాలి.
జీర్ణక్రియకు హాని కలిగించే ఆహారాలు వివిధ రకాలుగా ఉన్నాయి . మనం వీటిని హెల్తీ ఆహారాలని భావిస్తాయి. కానీ వీటిని తీసుకొనే ముందు వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి, జీర్ణక్రియకు హాని కలిగించే కొన్ని హైలైటెడ్ పదార్థాలను ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగినది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.
జీర్ణక్రియకు హాని కలిగించే 10 ఫుడ్స్

1. వైట్ బ్రెడ్ :
ప్రొసెడ్స్ ఫుడ్ లో ఒకటైన వైట్ బ్రెడ్, దీన్ని రీఫైండ్ ఫ్లోర్ తో తయారుచేయబడినది . అందువల్ల వీటిలో ఎక్కువ గ్లూటెన్, అధికంగా ఉంటుంది. ఇది చాలా చెడుగా జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది . ఇది చాలా త్వరగా జీర్ణవాహికలోనికి ప్రవేశించి పొట్ట ఉబ్బరం మరియు క్రాంపింగ్ కు గురి చేస్తుంది.

2. పాస్తా:
ప్రాధానమైన ఆహారాలు జీర్ణక్రియలో ముఖ్య పాత్రను పోషిస్థాయి . ఇది మరో ప్రొసెస్డ్ ఫుడ్ . వీటిని రిఫైడ్ ఫ్లోర్ తో తయారుచేసి ఉండటం వల్ల రుచికరంగా బాగుంటుంది మరియు న్యూట్రీషినల్ విలువలు చాలా తక్కువగా ఉంటాయి . ముఖ్యంగా గ్లూటిన్ ఎక్కువగా ఉండి గ్యాస్, క్రాంపింగ్, హార్ట్ బర్న్ మరియు కడుపు ఉబ్బరానికి గురిచేస్తుంది.

3. రెడ్ మీట్:
రెడ్ మీట్. జీర్ణక్రియకు హాని కలిగించే ఒక సాధారణమైన ఆహారం ఇది. రెడ్ మీట్ అంత త్వరగా జీర్ణం అవ్వదు. ముఖ్యంగా హాట్ డాగ్స్, సాసేజస్, బర్గర్ వంటి వాటిలో ఉపయోగించే రెడ్ మీట్ జీర్ణవాహికలో చాలా రఫ్ గా నెట్టుకు రావడం జరుగుతుంది . వీటిలో సోడియం అధికంగా ఉండటం వల్ల, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్ కు గురికావల్సి వస్తుంది.

4. చాక్లెట్:
జీర్ణక్రియను పాడు చేసే మరో ఆహారం చాక్లెట్. చాక్లెట్ లో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల ఇది హార్ట్ బర్న్ కు గురి చేస్తుంది. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టముండి, వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల జీర్ణక్రియలోని డ్యూరియాటిక్ లక్షణాల వల్ల లూజ్ మోషన్ మరియు డయేరియా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.

5. ఆల్కహాల్ :
ఆల్కహాల్ ఇన్ఫ్లమేషన్ కు గురి చేస్తుంది దాంతో జీర్ణవ్యవస్థ యొక్క సెల్స్ మరియు జీర్ణవాహికను డ్యామేజ్ చేస్తాయి.

6. కాఫీ:
కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. గ్లూటిన్ పోలిన ప్రోటీన్ ఇందులో ఉండటం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ విడుదల చేయడానికి అడ్డు పడి జీర్ణక్రియ యొక్క వ్యాధినిరోధక శక్తి మీద ప్రభావం చూపుతుంది.

7. డైరీ ప్రొడక్ట్స్:
పాలులో ల్యాక్టోజ్ అధికంగా ఉంటుంది. పాల వంటి డైరీప్రొడక్ట్స్ పొట్ట సమస్యలకు దారితీస్తుంది . అంటే మీరు పూర్తిగా డైరీ ప్రొడక్ట్స్ ను నివారించాల్సిన అవసరం లేదా . పెరుగు వంటి తక్కువ లాక్టోజ్ ఫుడ్ ను తీసుకోవచ్చు.

8. చిల్ పెప్పర్:
టేస్ట్ బడ్స్ ను సంత్రుప్తి పరచుకోవడానికి చిల్ పెప్పర్ ను ఎక్కువగా ఉపయోగిస్తాము.ఇది అన్నవాహిక మీద ప్రభావం చూపి హార్ట్ బర్న్ కు గురి చేస్తుంది.

9. గ్రీజీ లేదా ఫ్రైడ్ ఫుడ్స్:
అధిక ఫ్యాట్ ఉన్న లేదా ఫ్రై చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇది యాసిడ్ రిఫ్లెక్షన్ మరియు హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది.

10. సోడ:
సోడ మరియు అసిడ్ డ్రింక్స్ జీర్ణవ్యవస్థ మీద తీవ్రప్రభావం చూపి యాసిడ్ రిఫ్లెక్షన్ మరియు హార్ట్ బర్న మరియు కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది.



Click it and Unblock the Notifications