Latest Updates
-
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం..
ట్రెడిషినల్ మెడిసిన్ బీట్ రూట్ జ్యూస్ లోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...
సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్‌రూట్ ఒకటి.శక్తినిచ్చే శాకాహారదుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. దీని లాభాలు ఎన్నో తెలుసా! బీట్ రూట్ లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్ లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
బత్తాయి జ్యూస్ లోని టాప్ 12 గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్
బీట్‌రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. క్రీడాకారులు బీట్ రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు. ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్ రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది. వీటిల్లోని బీటేన్ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా.
క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..!
రెడ్ బ్లడ్ బీట్ రూట్ కి ఇది ఒక మంచి సీజన్. బీట్ రూట్ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. బీట్ రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చు. ఎందకంటే వీటిలో విటమిన్స్, మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్, మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. బీట్ రూట్ లో ఇంకా విటమిన్ సి, మ్యాంగనీస్, ఫొల్లెట్, విటమిన్ బి6 బీటైన్ మరియు పొటాషియంలు అధికంగా ఉన్నాయి.
ఆశ్చర్యం కలిగించే బీట్ రూట్ చర్మ సౌందర్య రహస్యాలు
ఆరోగ్యానికి సహాయపడే ఇన్ని రకాల పోషకవిలువలు, న్యూట్రీషియన్ విలువలున్న బీట్ , బీట్ జ్యూస్ ను ముఖ్యంగా ట్రెడిషినల్ మెడిసిన్స్ లో అధికంగా ఉపయోగిస్తున్నారు. అందుకే బీట్ రూట్ జ్యూస్ ను ఇప్పటికీ ఒక ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్ గా భావిస్తున్నారు. మరి ఈ నేచురల్ బీట్ జ్యూస్ రెమెడీలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

1. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది:
బీట్ రూట్ ను హైనైట్రేట్ ఫుడ్ గా భావిస్తున్నారు కాబట్టి, ఈ నైట్రేట్ తిన్నప్పుడు, నోట్లోని బ్యాక్టీరియాతో చేరి, నైట్రిట్స్ గా మారి బ్రెయిన్ కు బ్లడ్ ఫ్లోను పెంచుతుంది.

2. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:
బీట్ జ్యూస్ లోని హైనైట్రేట్స్ బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. ప్రతి రోజూ రెండు గ్లాసుల బీట్ రూట్ జ్యూస్ త్రాగడం వల్ల క్రమంగా బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది.

3. లివర్ డిటాక్సిఫై చేస్తుంది:
బీట్ రూట్ జ్యూస్ లో ఉండే బీటైన్ కంటెంట్ హెల్తీ లివర్ ఫంక్షన్ కు సహాయపడుతుంది.

4. ఐరన్ లోపంతో వచ్చే అనీమియాను తగ్గిస్తుంది:
బీట్ రూట్ జ్యూస్ లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల , రెగ్యులర్ గా త్రాగడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ రీజనరేట్ చేస్తుంది . దాంతో అనీమియాను నివారించడంతో పాటు, చికిత్సగా సహాయపడుతుంది . మెనుష్ట్ర్యువల్ డిజార్డర్స్ మరియు మోనోపాజ్ లక్షణాలను ఒక మంచి హోం రెమెడీ.

5. కండరాలకు చాలా మేలు చేస్తుంది:
బీట్ రూట్ జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల మజిల్ స్ట్రెంగ్గ్ మరియు పవర్ పెంచుతుంది . చాలా మంది ఆరోగ్య నిపుణులు వారి రెగ్యులర్ డైట్ లో బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లు వెల్లడిచేస్తున్నారు.

6. చర్మకాంతికి:
బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలు కనిపించవు. ఎందుకంటే ఇందులో ఉండే ఫొల్లెట్, ముఖంలో ముడతలు, ఇతర చర్మ సమస్యలతో పోరాడుతుంది . బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

7. క్యాన్సర్ నివారిణిగా, చికిత్సగా సహాయపడుతుంది:
బీట్ రూట్ జ్యూస్ లో యాంటీట్యూమర్ ఎఫెక్ట్స్ పుష్కలంగా ఉన్నట్లు కొన్ని పరిశోధల్లో కనుగొనడం జరిగింది. ఇవి మన శరీరంలోని సెల్స్ కు రక్షణ కల్పిస్తాయి మరియు కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతాయి.

8. పుట్టకలో లోపాలను నివారిస్తాయి.
బీట్ రూట్ జ్యూస్ లో ఉండే ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలలో బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది . గర్భిణీ స్త్రీల కూడా బీట్ రూట్ జ్యూస్ ను మితంగా తీసుకోవడానికి ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

9. మలబద్దకం నివారిస్తుంది:
బీట్ రూట్ జ్యూస్ లో జీర్ణ సమస్యలకు మంచి నివారిణిగా పనిచేస్తుంది. కాబట్టి ఇది మలబద్దకంను నేచురల్ గా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

10. మానసికస్థితిని మెరుగుపరుస్తుంది:
బీట్ రూట్ జ్యూస్ లోని బిటైన్ మరియు ట్రైఫోటాన్ అనే కంటెంట్స్ మనస్సును విశ్రాంతిపరిచే లక్షణాలు కలిగి ఉంటాయి . మరియు డిప్రెషన్ నుండి కోలుకొనేలా చేస్తాయి కాబట్టి బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.



Click it and Unblock the Notifications