Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
మీరు ఎంతటి ఆరోగ్యవంతలో మీ ఫేస్ ను బట్టి తెలుసుకోవచ్చు...
సహజంగా ఏదైనా జబ్బు పడి డాక్టర్ వద్దకు వెళితే కళ్ళు, నాలుక, గోళ్ళు చూసి అనారోగ్యాన్ని పసిగడుతుంటారు. అయితే వీటి ద్వారానే కాదు ముఖం చూసి కూడా మన ఆరోగ్య స్థితిగతులను తెసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఒక్కోసారి వాతావరణంతో సంబంధం లేకుండా పెదాలు పగలడం, నుదిటిపై, బుగ్గల మీద చిన్నచిన్న మొటిమలు రావడం, ఎప్పుడూ చూసిని ముఖ చర్మం జిడ్డుగా కనబడం..
READ MORE: షుగర్స్ మరియు షుగర్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే డేంజరెస్ ఎఫెక్ట్స్
ఇలా ముఖంలోని కొన్ని భాగాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే వీటిని చాలా మంది నిర్లఖ్యం చేస్తుంటారు. ఇలాంటి మార్పులన్నీ కూడా వివిధ ఆరోగ్య సమస్యలకు సంకేతాలని అంటున్నారు ఆరోగ్య నిపునులు. ఈ క్రమంలో ముఖంలో వివిధ భాగాల్లో చోటుచేసుకునే మార్పులు ఎలాంటి అనారోగ్యాలను సూచిస్తాయి ముందుగా గుర్తించి, వాటి విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...

నుదిటిపై మొటిమలు :
కొంత మందికి నుదుటిపై మొటిమలు రావడం, మరికొందరికి నుదుటిపై సన్నతి గీతల్లా కనిపించడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే నుదుటిపై ఇల కనిపించడం ద్వారా శరీరంలో కాలేయం, జీర్ణవ్యవస్థల్లో సమస్యలున్నట్లుగా అనుమానించాలి. మరి ఈ సమస్యల నుండి విముక్తి పొందాలంటే నీరుగా ఎక్కువగా త్రాగాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడంతో పాటు కెఫిన్ సంబంధిత పదార్థాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి క్యాలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఫలితంగా శరీరంలోని విషపదార్థాలు తొలగిపోయి ఇలాంటి సమస్యల బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది.

పెదాలు డ్రైగా మారడం:
చలికాలంలో పెదాలు డ్రైగా మారడం సహజం. అయితే దీన్ని తేలికగా తీసుకోవడం మంచిది కాదు. కొంత మందిలో వింటర్లోనే కాకు అన్ని సీజన్లలో పెదాలు పొడిబారిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇది మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఏదో లోపించిందని మనకు సూచిస్తుంది. ఐరన్, విటమిన్ బి శాతం క్రమంగా తగ్గిపోవడం, నీరు సరిగ్గా తాగకపోవడం, వంటివి కారణాలు కావచ్చు. ఇంకొందరిలో అయితే పెదవుల చుట్టూ చిన్న చిన్న కురుపులు, చివర్లలో పగుళ్ళు వంటివి ఏర్పడుతాయి. విటమిన్ బి శాతం దాదాపు తగ్గిందని చెప్పడానికి ఇది ఓ సూచన. కాబట్టి విటమిన్ బి అధికంగా ఉండే కూరగాయలు, మాంసం, త్రుణధాన్యాలు, వంటివి ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు నీరు ఎక్కువగా త్రాగుతుండాలి. ఫలితంగా ఈ సమస్య నుంచి త్వరగా విముక్తిపొందవచ్చు.

బుగ్గ మీద, బుగ్గల క్రింద మొటిమలు:
కొంత మందికి బుగ్గల కింద, దవడ భాగంలో మొటిమలు వస్తుంటాయి. వారిలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడమే ఇందుకు కారణం. ఎందుకంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ చర్మఆరోగ్యానికి చాలా అవసరం. ఇది తగ్గే కొద్ది ముఖంలో మెరుపు క్షీణించడం, మొటిమలు రావడం..వంటివి గమనించవచ్చు. మరి ఈ సమస్య నుంచి బయటపడటానికి పంచదార, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే విటమిన్ ఎ అధికంగా ఉండే పుట్టగొడుగులు, చిలకడదుంప, ఆప్రికాట్స్, క్యారట్స్, వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఫలితంగా కొత్త చర్మ కణాలు పుట్టుకొచ్చి చర్మం యవ్వనంగా కనబడుతుంది.

చర్మంపై :
ముఖంపై ఉండే చర్మం విషయంలో...కొందరి చిన్న చిన్న గుంతలు పడడం, మాటిమాటికీ జిడ్డుగా తయారవడం నల్లటి మచ్చలు రావడం...వంటి లక్షణాలన్నీ శరీరంలో విషపదార్థాలు పెరుగుతున్నాయనడానికి సూచనలే. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే నీరు అధికంగా తాగడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు. అలాగే నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం మంచిది.

ఏజ్ లైన్స్:
మూతి చుట్టూ ఏజ్ లైస్ కనబడుతుంటాయి. ఇవి స్మోక్ చేయడం వల్ల ఏర్పడుతాయి. కాబట్టి స్మోకింగ్ ను మానేయడం మరియు పెదాలు, పెదాల చుట్టు లిప్ బామ్ రాయడం అలవాటు చేసుకోవాలి.

చెవులు దురద పెట్టడం:
చెవుల చుట్టూ దురద పెడుతుంటే ఇది అలర్జీలకు సంకేతం మరియు వ్యాధినిరోధకశక్తి తగ్గినట్లు గుర్తించాలి. పోరియోసిస్ మరియు ఎక్జిమా కు దారితీస్తుంది. ఈ లక్షణాలు విటమిన్ డి లోపం వల్ల గుర్తించి విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవడంతో పాటు, ప్రతి రోజూ ఉదయం ఎండలో నిలబడాలి.

కళ్ల చుట్టూ నల్లని వలయాలు:
కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, ఇది సరైన విశ్రాంతి లేకపోవడం నిద్రలేమి, పోషకాహార లోపం వల్ల కూడా కళ్ల క్రింది డార్క్ సర్కిల్స్ ను కలిగి ఉంటుంది. డార్క్ సర్కిల్స్ నివారించాలంటే డైరీ ప్రొడక్ట్స్ మరియు వీట్ ప్రొడక్ట్స్ ను రెగ్యులర్ డైట్ నుండి నివారించుకోవాలి. డార్క్ సర్కిల్స్ కు మరో కారణం ఆల్కహాల్. ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మంచిది.

డార్క్ ప్యాచెస్:
ముఖ చర్మంలో డార్క్ ప్యాచెస్ మెడికేషన్స్ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధు కారణంగా ముఖంలో డ్యార్క్ ప్యాచెస్ సూచిస్తుంది. ఇంకా ఏజ్ స్పాట్స్, శరీరంలో టాక్స్ మూలంగా డార్క్ ప్యాచెస్ ఏర్పడవచ్చు . ఈ సమస్య నివారణకు ఫ్రెడ్ ఫ్రూట్స్ తినడం, ఎక్కువ నీరు త్రాగడం చేయాలి. డార్క్ ప్యాచ్ ల మీద ఆముదంను అప్లై చేసి శుభ్రం చేసుకుంటుండాలి.

ఆయిల్ స్కిన్:
ఆయిల్ స్కిన్ తీసుకొనే ఆహారం వల్ల కావచ్చు. కాబట్టి మీరు తీసుకొనే ఆహారం మీద ఓలుక్ వేసి ఉంచండి. చర్మం సెబమ్ ను విడుదల చేస్తుంది. ముఖం శుభ్రం చేసుకోవడానికి మంచి క్లెన్సర్ ను ఉపయోగించాలి. తర్వాత రెగ్యులర్ గా ఫేస్ మాస్క్ ను ఉపయోగించాలి.

ముక్కు మీద మొటిమలు:
మొటిలతో ఇబ్బంది కలిగించే మరో ప్రదేశం ముక్క. ఎప్పుడైతే పౌష్టికాహార లోపం మరియు అజీర్తి సమస్యలుంటాయో అప్పడు ఇలాంటి లక్షణాలు బయటపడుతాయి. శరీరంలో టాక్సిన్స్ కు కారణం అదనపు హార్మోనులు, డైటరీ ప్రొడక్ట్స్, ఫ్రీరాడికల్స్ వల్ల స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు మొటిమలకు దారితీస్తుంది.



Click it and Unblock the Notifications
