స్మోకింగ్ మానేసిన తర్వాత బాడీ డ్యామేజ్ కాకుండా రక్షించే 9 హీలింగ్ ఫుడ్స్

ప్రపంచ వ్యాప్తంగా వందల, వేలాది ప్రజలు ప్రతి సంవత్సరం సిగరెట్ల ధూమపానం వలన కలిగే వ్యాదులతో మరణిస్తున్నారు. ఈ ధూమపానం అనేక వ్యాదులకు కారణమవుతున్నది. మరియు ఇది నెమ్మదిగా మరణించటానికి ఒక మార్గం. ఈ ధూమపానం చూపే శరీరం మీద చెడు ప్రభావాలు అనుభవించే బాధ కొన్ని సంవత్సరాల వరకు కారణమవుతున్నది. ఈ ధూమపానం చేయని పురుషుల కంటే, ధూమపానం చేసే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి చనిపోయే అవకాశం పది రెట్లు ఎక్కువగా ఉన్నది. యువతలో, నలుగురిలో ముగ్గురికి ఈ ధూమపానం వలన కలిగే గుండె జబ్బులతో మరణాలు సంభవిస్తున్నాయి.

సిగరెట్ ప్యాకెట్ మీద ఆరోగ్యానికి హానికరం అన్న వార్నింగ్ సూచన ఎన్ని సార్లు చదివారన్నిది విషయం కాదు, సిగరెట్ కు చాలా త్వరగా అలవాటు పడటానికి ముఖ్య కారణం అందులోని నికోటిన్ ప్రభావంతోనే చాలా త్వరగా అడిక్ట్ అవుతారు.

సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు

సిగరెట్ త్రాగేవారు నిజంగా సిగరెట్ మానేయాలనుకుంటే, మానేయడం అంత పెద్ద కష్టమైన పనేం కాదు. స్మోకింగ్ హ్యాబిట్ ను వదిలేయడానికి వివిధ మార్గాలున్నాయి. కానీ అలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన వారు కూడా స్మోక్ ను నిలపలేకపోతున్నారు. అందుకు ముఖ్య కారణం స్మోకింగ్ కు పూర్తిగా అలవాటు పడి, వాటిని నిలపలదల చేసే శక్తిసామర్థ్యాలు పూర్తిగా కోల్పోయి ఉండవచ్చు. మీరు లక్ష్యాన్ని మీరు పూర్తి చేయడానికి కొన్ని సులభ పద్దతులను ఎంపిక చేసుకుంటే చాలా త్వరగా స్మోకింగ్ ను నిలుపు చేయగలుగుతారు. అలా నిలపు చేయగలిగినప్పుడు మీకు మాత్రమే కాదు, మీ చుట్టు పక్కల ఉన్న వారిని కూడా మీరు సేవ్ చేయగలుగుతారు. పొగ తాగే వారి పక్కన ఉండి పొగ పీల్చినా కూడా త్రాగే వారికంటే తాగని వారికి హానికరమెక్కువ. దీన్నే పాసివ్ స్మోకింగ్ అంటారు.

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు

కాబ్టటి ఒక బలమైన నిర్ణయంతో పాసివ్ స్మోకింగ్ ను మానేసిన తర్వాత ఆరోగ్యం గురించి చింతించాల్సిన పనిలేదు. ఇప్పటికే పొగతాగడం మానేసినట్లైతే..ఇక ఇప్పుడు శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే కొన్ని హెల్తీ గ్రీన్ ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడే నయమయ్యే గుణాలు పుష్కలంగా ఉంటాయి . స్మోకింగ్ వల్ల ఇదివరకే శరీరంలో చేరుకున్న నికోటిన్ మరియు టాక్సిన్స్ తొలగించుకోవడం చాలా అవసరం . శరీరంలో రక్తంలోని మలినాలను శుభ్రపరచడంతో పాటు శరీరాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడే ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ నేచురల్ అండ్ హీలింగ్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

విటమిన్ సి రిచ్ ఫుడ్స్:

విటమిన్ సి రిచ్ ఫుడ్స్:

విటమిన్ సి మెటబాలిజంను పెంచుతుంది మరియు స్మోకింగ్ వల్ల బాడిలో చేరిన టాక్సిన్స్ ను వేగంగా నివారిస్తుంది . అందుకోసం విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి . ఆరెంజ్ బొప్పాయి, టమోటోలు వంటి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

క్యారెట్ జ్యూస్ :

క్యారెట్ జ్యూస్ :

బాడీని డిటాక్సిఫై చేయడానికి మరియు రక్తంలోని మరియు ఇతర అవయవాల్లోని మలినాలన్నీ తొలగించడానికి క్యారెట్ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఎ, సి, కె మరియు బిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని పాడైన భాగాలను రిపేర్ చేయడంతో పాటు శరీరంను నయంచేస్తుంది.

బ్రొకోలి:

బ్రొకోలి:

స్మోకింగ్ ఆపు చేసిన తర్వాత ఈ రకం వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది లంగ్స్ ను శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా లంగ్స్ మరియు రక్తంలో చేరిన నికోటిన్ ను శుభ్రం చేయడానికి ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ గ్రేట్ గా సహాయపడుతుంది. బ్రొకోలీలిలో సల్ఫరోఫాన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది లంగ్స్ ను శుభ్రం చేస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

స్మోకింగ్ ఆపేసిన తర్వాత గ్రీన్ లీఫ్స్ తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలను నివారించడానికి కిడ్నీలు రక్తం వడపోతకు సహాయపడుతుంది . అంతే కాదు ఆకుకూరల్లో ఉండే విటమిన్స్ మరియు ఫోలిక్ యాసిడ్, సిగరెట్స్ త్రాగాలనే ఆలోచనను తగ్గిస్తుంది.

కివి, స్ట్రాబెర్రీస్ మరియు నిమ్మరసం:

కివి, స్ట్రాబెర్రీస్ మరియు నిమ్మరసం:

స్మోకింగ్ వల్ల శరీరంలో కోల్పోయిన్ విటమిన్స్ ను రీస్టోర్ చేయడానికి ఈ ఫ్రూట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . కివి ఫ్రూట్స్ మరియు స్ట్రాబెర్రీస్ బాడీలోపల అవయవాలు బెటర్ షేప్ లో ఉండటానికి సహాయపడుతుంది

పైన్ నీడిల్ టీ:

పైన్ నీడిల్ టీ:

స్మోకింగ్ వల్ల దంతాల మీద ఏర్పడ్డ మరకలు మరియు ఓరల్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. పైన్ నీడిల్ టీ లంగ్స్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది మరియు ఇది హార్ట్ కూడా మంచిది . గొంతునొప్పి మరియు ఇతర సమస్యలుండవు.

ఎగ్ ప్లాంట్ మరియు బీన్ మరియు కీరదోస:

ఎగ్ ప్లాంట్ మరియు బీన్ మరియు కీరదోస:

ఈ వెజిటేబుల్ శరీరంను హైడ్రేట్ చేస్తుంది . మరియు వీటిలో ఉండే స్టార్చ్ మరియు స్వీట్ స్మోక్ చేయాలనే ఆలోచనలను బ్రెయిన్ లో తగ్గిస్తుంది.

నాటెల్ లీవ్స్ టీ:

నాటెల్ లీవ్స్ టీ:

నాటెల్ టీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంను హీల్ చేయడానికి, స్మోకింగ్ వల్ల కోల్పోయిన ఎనర్జీని రీబిల్డ్ చేయడానికి స్మోకింగ్ గ్రేట్ గా సహాయపడుతుంది.

వాటర్:

వాటర్:

స్మోకింగ్ వదిలేసిన తర్వాత రోజుకు రెండు లీటర్ల నీళ్లు త్రాగడం శరీరంలో చేరిన నికోటిన్ తో పాటు ఇతర టాక్సిన్స్ ను కిడ్నీల నుండి యూరిన్ రూపంలో తొలగించడానికి సహాయపడుతుంది.

Story first published: Tuesday, March 8, 2016, 14:40 [IST]
Desktop Bottom Promotion