Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
ఎక్కువగా వ్యాయామం చేస్తే ఎముకలు బలహీనమవుతాయా ?
వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలను చాలా కాలం నుంచి వింటూనే ఉన్నాం. అయితే.. సరైన క్రమంలో వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడానికి, మెటబాలిజం పెరగడానికి, ఇమ్యునిటీ పెరగడానికి సహాయపడుతుంది.
వ్యాయామం వల్ల శారీరక ఆరోగ్యంతోపాటు, ఒత్తిడి, మానసిక రుగ్మతలైన అల్జీమర్స్ వంటి వ్యాధులను వ్యాయామం నయం చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న వ్యాయామం ఎముకల ఆరోగ్యానికి హానికరమా ?
అవును వ్యాయామం సరైన క్రమంలో చేస్తే ఎలాంటి నష్టం ఉండదు. కానీ.. చాలా ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యానికి హానికరమనే చెప్పాలి. శరీర సౌష్టవానికి డైట్, ఎక్సర్ సైజ్ రెండూ బ్యాలెన్స్ చేయాలి. మరీ ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల ఎముకలపై కలిగే దుష్ర్పభావాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఎముకలు పెళుసవడం
ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల మీ ఎముకలు పెళుసవడానికి కారణమవుతాయి. అలాగే ఎముకలు చాలా వీక్ అవుతాయి. అలాగే ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కార్టిలేజ్ ని కూడా నిస్సత్తువకు గురిచేస్తాయి.

వ్యాయామంలో పొరపాట్లు
మీకు ఒకవేళ ఏవైనా ఎముకల అనారోగ్య సమస్యలు ఉంటే.. ఆస్టియోఫోరోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల వద్ద శిక్షణ తీసుకుని వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామంలో తప్పులు చేయడం వల్ల ఎముకల ఆరోగ్యానికి తీవ్రంగా హానికలుగుతుంది.

ఎముకలు కోల్పోయే అవకాశం
వ్యాయామం చేయడం వల్ల ఎముకలు శక్తికోల్పాతాయా అని మహిళలు తరచుగా ప్రశ్నిస్తూ ఉంటారు. అథ్లెట్స్, లేదా మహిళలు రన్నింగ్, లాంగ్ డిస్టెన్స్ వంటి శారీరక వ్యాయామాలు చేసేటప్పుడు డూట్ బ్యాలెన్స్డ్ గా ఫాలో అవకపోతే.. సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి క్యాల్షియం, పోషకాలు ఉండేలా ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు.

ఎముకలకు గాయాలు
మోతాదుకి మించి ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల ఎముకలకు గాయాలయ్యే అవకాశం ఉంది. నిపుణుల సలహా ప్రకారం, లేదా నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చేయడం చాలా అవసరం.

స్విమ్మింగ్
స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల కారణంగా ఎముకల ఆరోగ్యం మెరుగవదు. కాబట్టి నడక, రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలతో ఎముకల ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు.

ఎముకలకు
ఎముకలు, కీళ్లు స్ట్రాంగ్ గా మారడానికి వ్యాయామం చాలా అవసరం. అయితే సరైన వ్యాయామం ఎంపిక చేసుకున్నప్పుడే మీ ఆరోగ్యానికి మంచిది. వ్యాయామం చేసేటప్పుడు ఖచ్చితంగా సరైన షూస్, డ్రెస్ ఎంచుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు.

డైట్
కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. వ్యాయామంతోపాటు సరైన ఆహార ప్రణాళిక ఎంచుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి, పోషకాలు వంటివి డైట్ లో ఉండేలా జాగ్రత్త పడటం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవన్నీ డైట్ లో మిస్సయితే.. రోగనిరోధక వ్యవస్థపైనా దుష్ర్పభావం చూపుతుంది.



Click it and Unblock the Notifications