కండోమ్‌ల‌కు కూడా ఎక్స్‌పైరీ ఉంటుందా? వాటిని ఎలా క‌నిపెట్టొచ్చు?

By: sujeeth kumar
Subscribe to Boldsky

ప్ర‌తి వ‌స్తువుకు షెల్ఫ్ లైఫ్ అనేది ఒక‌టి ఉంటుంది. అది తీరిపోతే ఇక దాన్ని వాడ‌లేం. దీన్ని బ‌ట్టే ఆ వ‌స్తువును ఎంత కాలంపాటు ఉప‌యోగించ‌వ‌చ్చో తెలుస్తుంది. ఆ ప‌రిమితి దాటాక ఆ వ‌స్తువు ఉప‌యోగానికి ప‌నికిరాకుండా అయిపోతుంది. కండోమ్‌ల ప‌రిస్థితి ఇంతే!

కండోమ్‌ల‌ను ఉత్ప‌త్తి చేశాక కొంత కాలానికి వాటికి ఇంట్లో కానీ సూప‌ర్ మార్కెట్లో లేదా మెడిక‌ల్ షాపుల్లోని అర‌ల్లో ఉండేందుకు స్థానం కోల్పోతుంది. అంటే ఎక్స్‌పైరీ అయిపోతుంది అన్న‌మాట‌.

కండోమ్స్ ఉపయోగించటం ఎందుకు ఆరోగ్యకరం?

కండోమ్‌ల ఎక్స్‌పైరీ గురించి తెలుసుకునే ముందు వాటిని దేనితో త‌యారు చేస్తారో తెల‌సుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. దాదాపు చాలా కండోమ్‌ల‌ను న్యాచుర‌ల్ ల్యాటెక్స్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేస్తారు. సింథ‌టిక్ వైతే నాన్ లాటెక్స్ తో త‌యార‌వుతాయి. ఇక నాన్ లాటెక్స్ అంటే పాలీ యురిథేన్ లాంటి సింథ‌టిక్ పదార్థాల‌తో త‌యారుచేస్తారు. లాటెక్స్‌, నాన్ లాటెక్స్ ఈ రెండింటి భౌతిక‌, ర‌సాయ‌న గుణాల్లో తేడాలుంటాయి. ఎలాస్టిసిటీ, ప‌ట్టులో, ఉష్ణోగ్ర‌త‌కు, యువీ కిర‌ణాల‌కు, సెన్సిటివిటీ విష‌యంలో, భ‌ద్ర‌ప‌ర్చే విష‌యంలో తేడాలుంటాయి. కండోమ్‌ల‌లో ప‌ట్టు, ఫ్లెక్సిబిలిటీ, ఎలాస్టిటీలోనే ప్ర‌ధానంగా తేడాల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. కొన్ని నెల‌లు గ‌డిచాక కండోమ్‌లు వాటి ప‌ట్టును, ఫ్లెక్సిబిలిటీని కోల్పోతాయి. ఎండిపోయి, పాలిపోయి .. ర‌తి క్రీడ జ‌రిపేట‌ప్పుడు ఏ క్ష‌ణంలోనైనా తెగిపోయేలా కండోమ్‌లు త‌యార‌వుతాయి.

కండోమ్ ఎంత కాలానికి ఎక్స్‌పైర్ అవుతుంది?

కండోమ్ ఎంత కాలానికి ఎక్స్‌పైర్ అవుతుంది?

కండోమ్‌ల‌కు సాధార‌ణంగా అయిదేళ్ల త‌ర్వాతే ఎక్స్‌పైర్ అవుతాయి. అయితే కండోమ్‌కు వాడే మెటీరియ‌ల్‌, ల్యూబ్రికేష‌న్‌ను బ‌ట్టి ఎక్స్‌పైరీ 3 నుంచి 5ఏళ్ల మ‌ధ్య‌లో ఉండొచ్చు. ఎక్స్‌పైరీ తేదీని స‌రిగ్గా తెలుసుకోవాలంటే ప్యాక్ వెన‌కాల చూడ‌ట‌మే. ప్ర‌తి కండోమ్ త‌యారీదారు ప్యాక్ వెన‌కాల ఎక్స్‌పైరీ తేదీని ప్రింట్ చేయిస్తారు. 2017-10 అని ముద్ర‌ణ తేదీ ఉన్న‌ట్ట‌యితే ఆ కండోమ్ 2017 అక్టోబ‌ర్లో త‌యారైంద‌ని దాని ఎక్స్‌పైరీ దాదాపు అక్టోబ‌ర్ 2022లో ఉంటుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

కండోమ్‌ల‌కు అనుకూల‌మైన ప‌రిస్థితులివే...

కండోమ్‌ల‌కు అనుకూల‌మైన ప‌రిస్థితులివే...

ఎక్స్‌పైరీ తేదీ కాకుండా కండోమ్‌ను భ‌ద్ర‌ప‌రిచే విధానాల‌ను బ‌ట్టి కూడా కండోమ్ స్టెబిలిటీ ఆధార‌ప‌డి ఉంటుంది. చ‌ల్ల‌ని, పొడి వాతావ‌ర‌ణంలో కండోమ్‌లు ఎక్కువ కాలం మ‌న్నుతాయి. ఒక్కోసారి 6ఏళ్లు మ‌న్నినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. దీనికి వ్య‌తిరేకంగా ఎండ‌లో, తీవ్ర‌మైన వేడిలో, త‌డి వాతావ‌ర‌ణంలో పెడితే 1 లేదా 2 సంవ‌త్స‌రాల‌కు మించి కండోమ్‌ల‌ను వాడ‌లేం. ఇంకా తొంద‌ర‌గానే వీటి పని ముగిసిపోతుంది. కండోమ్‌లు భ‌ద్ర‌ప‌ర్చుకునే అనుకూల‌మైన ప‌రిస్థితులు ఏవంటే... చ‌ల్ల‌ని, పొడి వాతావ‌ర‌ణం, తేమ‌, సూర్య‌ర‌శ్మి కి దూరంగా ఉంచ‌డం, ఉష్ణోగ్ర‌త 100˚F / 38˚C. కంటే త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవ‌డం.

ఎక్స్‌పైరీ తేదీ ముగిస్తే ఏమ‌వుతుంది?

ఎక్స్‌పైరీ తేదీ ముగిస్తే ఏమ‌వుతుంది?

కండోమ్ ఎక్స్‌పైర్ అయిపోతే లైంగిక చ‌ర్య‌లో పాల్గొనేట‌ప్పుడు చిరిగి పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎక్స్‌పైరీ తేదీ అయిన వెంట‌నే కండోమ్ పై నుండే లేటెక్స్ మెల్ల‌గా పొడిగా మారుతుంది. దీంతో అది నాజూగ్గా అయిపోతుంది. ఇది కాకుండా కండోమ్‌ల స‌హ‌జంగా ఉండే కొన్ని ప‌దార్థాలు శుక్ర‌క‌ణాల‌ను చంపేస్తాయి. అది కాకుండా వీర్యం వేరే శ‌రీరంలోనికి ప్ర‌వేశించ‌కుండా కండోమ్ అడ్డుకుంటుంది. ఇక ఎక్స్‌పైరీ అయిన కండోమ్‌లు ఇవి చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతాయి. దీంతో స‌లుభంగా ఇత‌రుల‌కు సుఖ‌వ్యాధులు అంటే ప్ర‌మాద‌ముంది(ఒక వేళ వ్య‌క్తికి ఉన్న‌ట్ల‌యితే)..

కండోమ్ ఎక్స్‌పైర్ అయిందా లేదా అనే విష‌యాన్ని తెలుసుకునేందుకు ఏం చూడాలో తెలుసుకుందాం...

ప‌టుత్వాన్ని కోల్పోతాయి

ప‌టుత్వాన్ని కోల్పోతాయి

ఎక్స్‌ఫైర్ అయిన కండోమ్‌లు త‌మ ప‌టుత్వాన్ని, ఫ్లెక్సిబిలిటీని కోల్పోయిన‌ట్టు గ‌మ‌నించారు. ముఖ్యంగా అవి పటుత్వానికి, గ‌ట్టిద‌నానికి త‌యారుచేసిన‌వి. అలా అయితే తొంద‌ర‌గా విరిగిపోయే ప్ర‌మాద‌ముంది.

ల్యూబ్రికేష‌న్ పోతుంది

ల్యూబ్రికేష‌న్ పోతుంది

కండోమ్‌ల‌ను ల్యూబ్రికేట్ చేసి పెడ‌తారు. అయితే వాటి ఎక్స్‌పైరీ తేదీ ముగియ‌డంతో ల్యూబ్రికేష‌న్ ప‌దార్థం పోతుంది. దీని ప్ర‌భావంతో కండోమ్‌లపై భాగం పొడిగా, బీట‌లు వారిన‌ట్టుగా క‌నిపిస్తుంది.

త‌డిగా, జిగ‌ట‌గా కూడా మార‌తాయి..

త‌డిగా, జిగ‌ట‌గా కూడా మార‌తాయి..

కొన్ని సంద‌ర్భాల్లో వ్య‌తిరేకంగాను జ‌ర‌గొచ్చు. కండోమ్‌లు త‌డిత‌డిగా త‌యార‌వ‌చ్చు లేదా జిగ‌ట‌గా మార‌వ‌చ్చు. వాటిని ఇక వాడ‌లేం. కండోమ్‌ల ఎక్స్‌పైరీ తేదీ అయిపోగానే వాటి క‌న్‌సిస్టెన్సీ, టెక్స్‌చ‌ర్‌ల‌ను కోల్పోతుంది. జిగ‌ట‌గా లేదా పొడిగా త‌యార‌వుతాయి.

పురుషులు కండోం వాడకాన్ని నిరాకరించేందుకు చెప్పే 10 సాకులు

ప్యాకేజింగ్‌లో లోపాలు..

ప్యాకేజింగ్‌లో లోపాలు..

ఒక్కోసారి కండోమ్‌లు వాటి ఎక్స్‌పైరీ తేదీ కంటే ముందే ప‌నికి రాకుండా పోతాయి. ఇదెలా అంటే ప్యాకేజింగ్‌లో లోపాల వ‌ల్ల కావొచ్చు లేదా కండోమ్‌లో చిన్న బొక్క ఏర్ప‌డ‌డం వ‌ల్ల కావొచ్చు. అలాంటి సందేహం వ‌స్తే కండోమ్ కొనేముందు వాటి పైన క‌వ‌ర్ త‌డిమి చూడాలి. గాలి బ‌య‌ట‌కు లోప‌లికి వ‌స్తున్న‌ట్ట‌యితే కండోమ్ బాగున్న‌ట్టు లెక్క‌. అలా కాకుండా ప్యాకేజీ ముదిరిపోయిన‌ట్టు ఉంటే లోప‌ల బాగాలేన‌ట్టు.

ఒక్కోసారి దుర్వాస‌న వ‌స్తుంది

ఒక్కోసారి దుర్వాస‌న వ‌స్తుంది

ఒక్కోసారి ఎక్స్‌పైరీ తేదీ ముగిసిన కండోమ్‌ల నుంచి దుర్వాస‌న వ‌స్తుంటుంది. అలాంటి పాడైన కండోమ్‌ల‌ను వాడితే ఎల‌ర్జీలు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది.

ఇక నుంచి కండోమ్‌లు కొనేముందు మొహ‌మాట ప‌డ‌కుండా ఇవన్నీ ప‌రిశీలించి బాగా ప‌నిచేసే వాటినే తీసుకుంటారు క‌దూ!

ఇక మీ అనుబంధం గురించి మీ భాగ‌స్వామికి త‌ప్ప ఇత‌రుల‌కు మెప్పించాల్సిన అవ‌స‌రం అంత‌గా లేద‌న్న విష‌యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అదే జీవితానికి ముఖ్యం.

English summary

Do condoms expire? What happens when a condom expires?

Every material has its own Shelf life that determines its storage limits i.e. becoming fit or unfit for consumption or trade. This phenomenon also imply on condoms as well and therefore after a certain time periods they become no longer be on a pantry shelf or on a supermarket shelf i.e. expire. Before knowing the expiry issue of condoms, it is necessary to know that what they are made of. Majority of condoms are made up of natural latex material (latex condoms) and synthetic non latex material (non latex condoms made of polyurethane and other synthetic materials).
Story first published: Friday, November 3, 2017, 19:30 [IST]
Subscribe Newsletter