మీరు ఊహించని ఈ అలవాట్లే మీ మెదడును దెబ్బతీస్తున్నాయి.!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మన శరీరంలో ఇతర అవయవాలలానే, మెదడు కూడా అనేక కారణాలు, ఇంకా కొన్ని తెలియని విషయాల వల్ల పాడవ్వవచ్చు. కొన్నిసార్లు, ఈ కారణాలు ఊహించలేని విధంగా కూడా ఉంటాయి.

కొన్ని ముఖ్యమైన అలవాట్లు సమయంతో పాటు మీ మెదడుపై చెడు ప్రభావం చూపించి, దెబ్బతినేలా చేస్తాయి.

కొన్నిసార్లు, మీరు కేవలం అలసిపోయి, పనిపై ఏకాగ్రత పెట్టలేక విషయాలను మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. కానీ నిజానికి మీరు మీ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం మెదడును సంరక్షించుకోటం మర్చిపోతున్నారు.

Unexpected Things That Are Harming Your Brain

మెదడును దెబ్బతీసే విషయాలు

మీరు చేసే పనులు మీ శరీరాన్ని కొన్ని పద్ధతులలో ప్రభావితం చేయవచ్చు. కొన్నిసార్లు, కొన్ని పనులు మెదడును సాధారణంగా పనిచేయనివ్వకుండా, దాని ఆకృతిని కూడా పాడుచేస్తాయి.

మీరు ఈ పనులను ప్రతిరోజూ,ఏళ్ళకి ఏళ్ళు చేయటం కొనసాగిస్తే, మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే. ఎందుకంటే, మీ మెదడుని అలా బాగా దెబ్బతీస్తున్నారు.

ఈ వ్యాసంలో, మీ మెదడును పాడుచేసే ముఖ్య విషయాల లిస్టును పొందుపరిచాం. మెదడును దీర్ఘకాలంలో దెబ్బతీసే అలవాట్ల గురించి చదివి, వెంటనే అవి ఆపేయండి.

1. సంభాషణలకి దూరంగా ఉండటం (ఏదీ వ్యక్తీకరించకపోవటం)

1. సంభాషణలకి దూరంగా ఉండటం (ఏదీ వ్యక్తీకరించకపోవటం)

పరిశోధనల ప్రకారం రోజుకి కనీసం 10నిమిషాల పాటు అయినా మాట్లాడుతుండటం వలన మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది. మాట్లాడటం మెదడును ఉత్తేజపరిస్తే, మౌనంగానే ఉండటం సమయంతో పాటు మెదడును దెబ్బతీస్తుంది.

2.అధిక చక్కెర పదార్థాలు

2.అధిక చక్కెర పదార్థాలు

ఎక్కువమొత్తాల్లో చక్కెరపదార్థాలపై ఆధారపడితే మీ నాడీకణాలు ఉత్పత్తిచేసే ప్రేరకంపై ప్రభావం పడిపోతుంది. మెదడును దెబ్బతీసే ముఖ్యవిషయాల్లో ఇది చాలా ముఖ్యమైనది.

3. మెదడుకి వ్యాయామం ఇవ్వకపోవటం

3. మెదడుకి వ్యాయామం ఇవ్వకపోవటం

మెదడు యొక్క ఉత్పాదకత 16-25 సంవత్సరాల మధ్య ఉఛ్చస్థాయిలో ఉండి, తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. మెదడుకి తగిన వ్యాయామం రెగ్యులర్ గా ఉంటే దాని పనితీరు పెరుగుతుంది.ఇది వృద్ధుల్లో మతిమరుపు వచ్చేవారికి కూడా వర్తిస్తుంది.

4.బ్రేక్ ఫాస్ట్ ను తప్పించుకోవటం

4.బ్రేక్ ఫాస్ట్ ను తప్పించుకోవటం

పరిశోధనల ప్రకారం రోజూ పొద్దున బ్రేక్ ఫాస్ట్ చేసేవారు బాగా చదువుతారు మరియు అన్నిటిలో ప్రతిభ కనబరుస్తారు. అదే అల్పాహారాన్ని ఎగ్గొట్టడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయి మెదడుపై చెడ్డ ప్రభావం పడుతుంది. ఈ మెదడును పాడుచేసే అలవాటును మీరు తప్పక మార్చుకుని తీరాలి.

5.బయట చిరుతిళ్ళను అధికంగా తినటం

5.బయట చిరుతిళ్ళను అధికంగా తినటం

మీ ఆహారంలో ఫాస్ట్ ఫుడ్ కి ఎక్కువగా చోటు ఉంటే, మీ నాడీకణాల మధ్య సంబంధాలపై ప్రభావం పడుతున్నట్టే. ఇది మీ దీర్ఘకాల మరియు తక్కువకాల జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది.

6.పడుకునేటప్పుడు మీ తలను మూసివేయటం

6.పడుకునేటప్పుడు మీ తలను మూసివేయటం

మనం పడుకున్నప్పుడు, దుప్పటితో తలను కూడా మూసేస్తే శరీరంలోకి ఆక్సిజన్ వచ్చే శాతాన్ని తగ్గించేస్తున్నాం. అప్పుడు మనం వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ కలిసిఉన్న గాలినే తిరిగి పీలుస్తాం. ఈ అలవాటు మెదడును దెబ్బతీయవచ్చు.

English summary

Unexpected Things That Are Harming Your Brain

In this article, we have listed some of the top things that can be harming the brain. Read further to know more about the brain damaging habits that you need to stop right now.
Subscribe Newsletter