Latest Updates
-
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే! -
ప్రోటీన్స్ నిండిన రాజస్థానీ పంచరత్న దాల్..అమృతాన్ని తలపించే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
వ్యాధి ఒకటే అయినా స్త్రీ, పురుషుల్లో వేర్వేరు లక్షణాలు.. పోల్చుకుంటే ప్రాణ ముప్పు తప్పదు.! -
బ్యూటీ సీక్రెట్.. చుక్క నీరు, మినప్పప్పు లేకుండా నిమిషాల్లో చేసుకునే కీరదోస ఇడ్లీ.! -
సెప్టెంబర్ 2026 రాశి ఫలాలు: వీరి అదృష్టం మారబోతుంది.. 12 రాశుల ఫలితాలివే.! -
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.!
ఆంధ్రా స్టైల్ పచ్చిమిర్చి కోడి పులావ్.. స్పైసీగా ఇష్టపడేవారికి పర్ఫెక్ట్ ఛాయిస్.!
ఆంధ్రాలో కోడి పులావ్ చాలా ఫేమస్. నాటు కోడి పులావ్, కోనసీమ రాజుల కోడి పులావ్ ఇలా చాలా రకాల వంటకాలతో అతిథి మర్యాదలు జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైనా పచ్చిమిర్చితో కోడి పులావ్ ట్రై చేశారా.? బిర్యానీ తిని బోర్ కొట్టిన వారికి, రెగ్యులర్ కోడి పులావ్ రుచికి భిన్నంగా కోరుకునే వారికి ఘాటుఘాటుగా పుదీనా సువాసనలతో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంట్లో నూటికి నూరు మార్కులు కొట్టేయాల్సిందే.!

పచ్చిమిర్చి కోడి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమిర్చి పేస్ట్ కోసం
పచ్చిమిర్చి- 15
ఉల్లిపాయ- ఒకటి
పుదీనా- ఒక కప్పు
కొత్తిమీర- ఒక కప్పు
-పేస్ట్ కోసం ఓ పాన్‌లో కొద్దిగా నూనె వేసి
వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర వేసి
వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా
పేస్ట్‌లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె- పావు కప్పు
చికెన్- అరకేజీ
నెయ్యి- ఒక టీ స్పూన్
బాస్మతి బియ్యం- కప్పు
మసాలా దినుసులు- టీస్పూన్
ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు
పచ్చిమిర్చి- రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీ స్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
ధనియాల పొడి- టీ స్పూన్
నీళ్లు- మూడు కప్పులు
కొత్తిమీర తురుము- అర కప్పు
నిమ్మరసం- కొద్దిగా
ఉప్పు- తగినంత
పసుపు- కొద్దిగా
తయారీ విధానం
-ఒక వెడల్పాటి గిన్నెలో నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి మసాలా దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగాక శుభ్రంగా కడిగిన చికెన్‌ను వేసి కలుపుకోవాలి. నీరు ఇంకిపోయాక పచ్చిమిర్చి మసాలా పేస్ట్ వేసి కలుపుకోవాలి. కాసుపు ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మళ్లీ ఒకసారి కలపాలి.
-చికెన్ ఉడికాక మూడు కప్పుల నీళ్లు పోసి నెయ్యి, కొత్తిమీర,
నిమ్మరసం వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కడిగి నానబెట్టిన
బాస్మతి బియ్యాన్ని వేసి కలుపుకోవాలి. పులావ్ ఉడికి
దగ్గరపడుతున్నప్పుడు స్టవ్ మంట చిన్నగా పెట్టి కాసేపు
ఉడకనివ్వాలి. అంతే స్పైసీ స్పైసీ ఆంధ్రా స్టైల్ పచ్చిమిర్చి
కోడి పులావ్ రెడీ. ఈ డిష్‌ను రైతాతో
సర్వ్ చేసుకుని తింటే బిర్యానీని కూడా మర్చిపోతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications