For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వుల నూనెను అక్కడ రుద్దుకోండి.. రాత్రంతా మంచి సుఖం

నువ్వులు సాధారాణంగా అందరికీ తెలిసినవే. అందరికీ అందుబాటులో ఉండే నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి.నువ్వుల నూనెను అక్కడ రుద్దుకోండి.. రాత్రంతా మంచి సుఖం

|

నువ్వులు సాధారాణంగా అందరికీ తెలిసినవే. అందరికీ అందుబాటులో ఉండే నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి కావున వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. ఇవి మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ 'ఇ'లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే చాలా రకాల మూలాకాలు వీటిలో ఉంటాయి. అన్ని నూనెల్లోకెల్లా నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది.

ప్రోటీన్లు కూడా

ప్రోటీన్లు కూడా

నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇవి తెల్ల నువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటితో తయారుచేసిన పదార్థాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు.

చర్మాన్ని సంరక్షించడంలో

చర్మాన్ని సంరక్షించడంలో

చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వల నూనెలో ఉన్న ‘ఇ' మరియు ‘బి' విటమిన్లు చర్మానికి సంబంధిచిన అన్నిరకాల సమస్యలను దూరం చూసే గుణం ఇందులో పుష్కలంగా ఉంది. నువ్వులన నూనెను చర్మ సంరక్షణలో ఉపయోగించడం ద్వారా ముఖాన్ని ఫ్రెష్‌గా, యవ్వనంగా మెరుస్తూ ఉండేట్లు చేస్తుంది.

దేహాన్ని పుష్టిగా ఉంచడంలో

దేహాన్ని పుష్టిగా ఉంచడంలో

చిన్నారుల అందం, ఆరోగ్యం విషయంలో నువ్వుల నూనెది కీలక పాత్ర. దీనిలోని విటమిన్స్, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. ఈ నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, ఐరన్, విటమిన్ బి36.. లాంటివి ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

మెదడు ఎదుగుదలకు

మెదడు ఎదుగుదలకు

స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి నువ్వులనూనెతో మర్దనా చేస్తే హాయిగా నిద్రపోతారు. ఈ నూనె చిన్నారుల్లో మెదడు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. వెన్నెముక, కండరాలు బలపడేందుకు సహాయకారిగా ఉంటుంది. నిత్యం స్నానానికి, పడుకునేందుకు ముందు నువ్వుల నూనెతో ఒళ్లంతా రుద్దితో పిల్లల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తుంది.

అధిక రక్తపోటు నియంత్రణలో

అధిక రక్తపోటు నియంత్రణలో

ఈ నూనెలో ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడంతో పాటు... బీపీ స్థాయి ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో ఉన్న పెద్దవారికి బీపీని సమస్థాయికి తీసుకొస్తుంది. అంతేగాకుండా, వయసు పైబడ్డవారు ఈ నూనెతో చేసిన పదార్థాలను తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉంటారు.

కీళ్లనొప్పుల నివారణలో

కీళ్లనొప్పుల నివారణలో

నువ్వులు కాపర్ వంటి మూలకాలు. ఇవి యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృఢంగా ఉండేలా చేస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడే మెగ్నీషియం... పేగు క్యాన్సర్, మైగ్రేన్ లాంటి సమస్యలను అరికట్టే కాల్షియం.. ఎముకలు గట్టిపడేందుకు సాయపడే జింక్... తదితరాలన్నీ ఈ నువ్వుల నూనెలో ఉండటం ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు.

మధుమేహ వ్యాధి నివారణకు

మధుమేహ వ్యాధి నివారణకు

నువ్వులలో ఉండే మెగ్నీషియం వంటి ఇతరేతర పోషకాలు మధుమేహ వ్యాధి తగ్గించుటలో సహాయడతాయి. నువ్వు విత్తనాల నుండి తీసిన నూనెలు శక్తివంతమగా శరీర రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను మరియు రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే

జుట్టు మృదువుగా ఉండాలన్నా, చుండ్రు మాయం కావాలన్నా నువ్వుల నూనె బెస్ట్‌ అంటున్నారు సౌందర్య నిపుణులు. నువ్వుల నూనెతో జుట్టుకి కావల్సిన పోషకాలు అందుతాయి. నువ్వుల నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నువ్వుల నూనెతో కేశాలకు తలకు బాగా పట్టిస్తే , హెయిర్‌ సెల్స్‌ యాక్టివ్‌‌గా ఉండే హెయిర్‌ గ్రోత్‌‌ను ప్రోత్సహిస్తుంది. అతినీలలోహిత కిరణాల ప్రభావం జుట్టు మీద పడకుండా నువ్వుల నూనె రక్షిస్తుంది. చాలావరకు జుట్టు సమస్యలు చుండ్రు వల్లనే ఎదురవుతాయి. చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె.

రక్తహీనత తగ్గేందుకు

రక్తహీనత తగ్గేందుకు

రక్తహీనత తగ్గేందుకు... 100 గ్రాముల నల్ల నువ్వులలో, 100 గ్రాముల బెల్లం కలిపి దంచి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఉసిరికాయంత తిని, ఆ తర్వాత 100 మిల్లీ లీటర్ల పాలు లేదా, గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులు బెల్లం లేకుండా కేవలం 5 గ్రాముల నల్లనువ్వుల పొడిని 100 మిల్లీ లీటర్ల వేడి పాలలో కలిపి రాత్రిపూట త్రాగుతుండాలి.

నోటిపూత

నోటిపూత

నోటిపూతకు... నువ్వుల చూర్ణం, పటికబెల్లం పొడి ఒక్కొక్కటి 50 గ్రా. చొప్పున తీసుకొని రెండింటిని కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రెండు పూటలా అరస్పూన్ పొడిని ఒక టీస్పూన్ వెన్నతో కలిపి సేవించడం వలన నోటిపూత తగ్గుతుంది.

రాత్రంతానిద్ర బాగా వస్తుంది

రాత్రంతానిద్ర బాగా వస్తుంది

నువ్వుల నూనెను బాగా వేడి చేసి పక్కన పెట్టి నాల్గవ వంతు కర్పూరం కలిపి మూతపెట్టి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజూ రాత్రి ఒకసారి అరికాళ్లకు మర్దన చేస్తుంటే చక్కటి నిద్ర పడుతుంది. రోజూ రాత్రి ఇలా చేసుకుంటే చాలా మంచిది. రాత్రంతా మంచి నిద్ర బాగా పోయి మంచి సుఖం దొరుకుతుంది.

English summary

15 amazing health benefits of sesame oil

15 amazing health benefits of sesame oil
Story first published:Monday, June 18, 2018, 15:02 [IST]
Desktop Bottom Promotion