Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
ఈ 6 ఫుడ్స్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు
ఈ 6 ఫుడ్స్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఎటువంటి ఫుడ్స్ ను తీసుకోవాలో అన్న ఆలోచన మిమ్మల్ని వెంటాడుతోందా? దిగులు చెందవద్దు. మీ సందేహాన్ని మేము నివృత్తి చేస్తాం. ఈ ఆర్టికల్ లో రెయినీ సీజన్ లో తీసుకోవలసిన ఆహారాల గురించి వివరించాము. తద్వారా, ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు విముక్తి పొందవచ్చు.
వర్షాకాలం మొదలైంది. వర్షాలు ఎన్నో ప్రాంతాలను పలకరిస్తున్నాయి. ఈ సమయంలో అనేక వ్యాధులు ఆలాగే ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. డెంగ్యూ, వాటర్ ఇన్ఫెక్షన్, ఫ్లూ, జలుబు, ఫుడ్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కలరా మరియు లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది.
మరి ఈ వర్షాకాలంలో ఎటువంటి ఫుడ్స్ ను తీసుకోవాలో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

1. హాట్ సూప్స్:
వర్షాకాలంలో చాలా మంది వేడి వేడి సూప్స్ ను తాగడానికి ఇష్టపడతారు. నిజానికి, ఇది ఎంతో ఆరోగ్యమైన అలవాటు. దీని వలన స్టమక్ ఇన్ఫెక్షన్స్ తో పాటు అజీర్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కాస్తంత వెల్లుల్లి, నల్ల మిరియాలు మరియు బటర్ ని జోడించి తయారుచేసే సూప్ వలన శక్తి అందుతుంది. జలుబు అలాగే దగ్గు నయమవుతాయి. సూప్ ని తీసుకోవడం వలన త్రోట్ అలర్జీస్ అనేవి తగ్గుతాయి.

2. మసాలా టీ:
వర్షాకాలంలో ఒక కప్పుడు మసాలా టీ వలన మనసు ఉత్తేజం పొందుతుంది. శరీరం ఉపశమనం పొందుతుంది. ఇలాచీ, దాల్చిన లేదా అల్లం మరియు తులసి ఆకులనేవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తద్వారా, ఇన్ఫెక్షన్స్ శరీరంపై దాడి చేసే అవకాశం తగ్గుతుంది. జలుబు మరియు గొంతు ఇన్ఫెక్షన్స్ ను తగ్గించేందుకు మసాలా టీ అమితంగా తోడ్పడుతుంది.

3. సొరకాయ
ఆనపకాయ అనేది ఆరోగ్యకరమైన వెజిటబుల్స్ లో ముఖ్యమైన స్థానాన్ని పొందింది. ముఖ్యంగా, వర్షాకాలంలో దీనిని తీసుకోవడం వలన అమితమైన ప్రయోజనం కలుగుతుంది. ఇందులో, సాల్యుబుల్ మరియు ఇన్సోల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అందువలన, డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే, ఈ వెజిటబుల్ లో ఐరన్, విటమిన్ బి మరియు విటమిన్ సి లభిస్తాయి.

4. ఇండియన్ స్క్వాష్:
ఇది ఆరోగ్యకరమైన వెజిటబుల్. దీని ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో, విటమిన్స్ తో పాటు మినరల్స్ అలాగే యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ పుష్కలంగా లభిస్తాయి. అందువలన, బ్లోటింగ్, హార్ట్ బర్న్ మరియు ఎసిడిటీ లక్షణాలు అదుపులో ఉంటాయి. అలాగే, ఈ వెజిటబుల్ అనేది అజీర్తి సమస్యలను నివారిస్తుంది. బౌల్ డిజార్డర్స్ ను తగ్గిస్తుంది. దీనిలో పుష్కలంగా లభించే ఫైబర్ ఇందుకు తోడ్పడుతుంది.

5. కాకరకాయ:
కాకరకాయ రుచి అందరికీ నచ్చకపోవచ్చు. కానీ, దీని ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అనిర్వచనీయం. కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ వైరల్ ప్రాపర్టీస్ లభిస్తాయి. అవి మిమ్మల్ని ఎల్లప్పుడు ఫిట్ గా మరియు హెల్తీగా ఉంచుతాయి. ఇక్కడ మీరు ప్రయత్నించగలిగిన రెండు బిటర్ గార్డ్ రెసిపీస్ ను పొందుబరిచాము. బిటర్ గార్డ్ జ్యూస్ ఫర్ డయాబెటిస్ అండ్ వెయిట్ లాస్ అండ్ క్రిస్ప్ కరేలా ఫ్రై విత్ కోకోనట్.

6. పాయింటెడ్ గార్డ్ (పర్వాల్):
ఈ గ్రీన్ వెజిటబుల్స్ ను వర్షాకాలంలో తీసుకోవడం మంచిది. వీటిని తీసుకోవడం ద్వారా తలనొప్పి, జలుబు మరియు దగ్గు అరికట్టబడతయి. పర్వాల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియు విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు తోడ్పడతాయి.

వర్షాకాలంలో సాధారణంగా ఎదురయ్యే ఇన్ఫెక్షన్స్
1. ఫంగల్ డిసీసెస్:
ఈ రైనీ సీజన్ లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు గురయ్యే ప్రమాదం అధికంగా ఉంది. అందువలన, మీరు ఎల్లప్పుడూ పొడిగా ఉండాలి. ముఖ్యంగా, బొటన వేలి వద్ద అలాగే మోకాలు వెనుకవైపు మరియు మోచేతుల వద్ద పొడిగా ఉంచుకోవాలి. యాంటీ ఫంగల్ టాల్కమ్ పౌడర్ ని వాడటం ద్వారా చెమటను తగ్గించుకోవచ్చు.

2. కలరా:
వర్షాకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆహారం అలాగే నీళ్లు కలుషితం అయినప్పుడు కలరా వ్యాధి సోకుతుంది. మీరు ఎల్లప్పుడూ హైజీన్ గా ఉండాలి. హైజీన్ గా లేకపోతే ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. శుభ్రమైన నీటిని తాగండి. నీటిని తాగేముందు బాగా మరిగించుకోండి.

3. డెంగ్యూ:
ఈ సీజన్ లో ఎదురయ్యే మరొక వ్యాధి డెంగ్యూ. ఇది దోమల వలన వ్యాప్తిస్తుంది. ఒళ్ళు నొప్పులు, బాడీ ర్యాషెస్, కీళ్ల నొప్పులు అలాగే ఫీవర్ ఈ వ్యాధి లక్షణాలు. దోమకాటు నుంచి రక్షణ పొందేందుకు మస్కిటో రేపెలెంట్ ను వాడండి. ఫుల్ స్లీవ్ క్లాత్స్ ని వాడి శరీరాన్ని కవర్ చేసుకోండి.

4. జాండిస్:
ఇది కలుషితమైన ఆహారం వలన అలాగే నీటి ద్వారా తలెత్తే వైరల్ డిసీజ్. జాండిస్ మిమ్మల్ని బలహీనపరుస్తుంది. మూత్రం రంగు ఎల్లో కలర్ లోకి మారుతుంది. కళ్ళు పాలిపోతాయి. లివర్ పనితీరు దెబ్బతింటుంది. వాంతు చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే మరిగిన నీటిని తీసుకోండి. బయట లభ్యమయ్యే ఆహార పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయండి.

5. టైఫాయిడ్:
అశుభ్రమైన నీటిని తాగినప్పుడు టైఫాయిడ్ బారిన పడతారు. ఇంప్రోపర్ శానిటేషన్ వలన ఈ వ్యాధి బారిన పడతారు. తలనొప్పి, గొంతు నొప్పి, బలహీనత మరియు నొప్పి వంటివి టైఫాయిడ్ ఫీవర్ లక్షణాలు. ఏదైనా తినేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యం. బయట వీధుల్లో లభ్యమయ్యే ఫుడ్స్ ను అలాగే డ్రింక్స్ ను దూరంగా ఉంచండి.

6. మలేరియా:
మలేరియా వ్యాధి వర్షాకాలంలో విజృంభిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పేరుకుపోవడం వలన దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. అందువలన దోమకాటు నుంచి రక్షణకు తగిన చర్యలను తీసుకోవాలి.

7. డయేరియా:
నీళ్ల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు వర్షాకాలంలో విశ్వరూపం చూపిస్తాయి. అందువలన, మీరు అదనపు కేర్ ను తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. స్ట్రీట్ ఫుడ్స్ ను సాధ్యమైనంత మేరకు అవాయిడ్ చేయాలి. లేదంటే, డయేరియా బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications











