Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
World No Tobacco Day 2023: సిగరెట్లు తెగ తాగేస్తున్నారా? పడగ్గదిలో భాగస్వామిని సుఖపెట్టలేరు.. జాగ్రత్త!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ ఒక్క అలవాటు జీవితంపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఒక్కసారి అలవాటైతే బానిసలను చేసుకుంటుంది. అంత సులభంగా వదిలిపెట్టలేరు. శ్వాసకోశ ఇబ్బందులు, హృదయనాళ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అలాగే స్మోకింగ్ చేసే వారి లైంగిక పనితీరు కూడా దెబ్బతింటుంది. విపరీతంగా స్మోకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ తగ్గి సెక్సువల్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. అంగస్తంభన సమస్యలు సహా స్మోకింగ్ లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తప్రసరణ తగ్గుతుంది:
ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది అంగస్తంభన లేదా ఉద్వేగం పొందడం కష్టతరం చేసుంది.
అంగస్తంభన లోపం:
అంగస్తంభన సమస్య(Erectile Dysfunction) ధూమపానం ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం చేసే పురుషులు ధూమపానం చేయని వారి కంటే అంగస్తంభన సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు.
అకాల స్ఖలనం:
ధూమపానం అకాల స్ఖలనం సమస్యను పెంచుతుంది. ధూమపానం వల్ల పురుషాంగంలోని కండరాలను అదుపు చేయడం కష్టం అవుతుంది.
లిబిడో తగ్గుతుంది:
స్మోకింగ్ సెక్స్ డ్రైవ్‌ను తగ్గిస్తుంది. ఎందుకంటే స్మోకింగ్ లైంగిక ప్రేరేపణలో పాల్గొనే నరాలు, హార్మోన్లను దెబ్బతీస్తుంది.
లైంగిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది:
ధూమపానం చేయడం వల్ల లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు(STI) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం జననేంద్రియాల్లోని కణజాలాలను దెబ్బతీస్తుంది. తద్వారా అవి ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.
స్మోకింగ్ మానేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే వాటన్నింటికి కావాల్సింది దృఢ సంకల్పం. స్మోకింగ్ మానేయలని బలంగా కోరుకుంటే తప్ప మానేయడం సాధ్యం కాదు. స్మోకింగ్ మానేయడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
ఒక తేదీ సెట్ చేసుకోవాలి:
ధూమపానం ఎప్పటి నుండి మానేయాలనుకుంటున్నారో ఒక తేదీ సెట్ చేసుకోవాలి. దానికి కట్టుబడి ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో ఆ తేదీని వాయిదా వేయవద్దు.
స్నేహితులు, కుటుంబసభ్యులతో చెప్పాలి:
స్మోకింగ్ మానేస్తున్నానని స్నేహితులు, కుటుంబ సభ్యులతో చెప్పాలి. వారి సపోర్ట్ అడగాలి. మీరు స్మోకింగ్ మానేయడానికి సహాయం చేయమనాలి.
సిగరెట్లు ఉంటే పక్కన పెట్టేయాలి:
సిగరెట్లు, సిగార్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు మీకు దగ్గర్లో ఉంటే వాటిని దూరం పెట్టేయండి, కారులో ఉంటే తీసేయండి. అవి మన కళ్ల ముందే ఉంటే తాగాలన్న కోరిక కలుగుతుంది.
తాగాలన్న కోరికను అణచివేయాలి:
సిగరెట్లు తాగాలనిపించేలా చేసే ట్రిగ్గర్ పాయింట్లను నివారించాలి. కొందరికి ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు స్మోకింగ్ చేయాలనిపిస్తుంది. మరొకరికి ఇంకేదో పని చేస్తున్నప్పుడు స్మోకింగ్ చేయాలనిపిస్తుంది. అలాంటి సమయంలో కఠినంగా వ్యవహరించాలి.
ఒత్తిడిని తట్టుకోవడానికి ఇతర మార్గాలు చూడాలి:
ఒత్తిడిని తట్టుకోవడానికి స్మోకింగ్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. వ్యాయామం, యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని తట్టుకోవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
