Latest Updates
-
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.! -
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్! -
భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే! -
ఈనాటి దాంపత్యానికి ఆదర్శంగా నిలిచే ఆనాటి ప్రేమకథలు.. ఒక్కో కథలో ఒక్కో పాఠం.! -
కర్ణాటక ఫేమస్ మెంతి బాత్.. ఈ స్టైల్ లో చేస్తే టేస్ట్ వేరే లెవెల్..లంచ్ బాక్స్ కి సెట్! -
చిన్న కాయ.. పెద్ద ప్రయోజనాలు: వాక్కాయలతో ఈ లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
ఉద్యోగులు రోజంతా యాక్టివ్గా ఉండాలంటే.. ఈ పది ఆరోగ్య సూత్రాలను పాటించాల్సిందే.! -
మీ మూడ్ ని తక్షణమే రిఫ్రెష్ చేసే కుంకుమపువ్వు ఐస్డ్ టీ..5 నిమిషాల్లో చేసుకోండిలా.. -
ఈ రోజు సూర్య గోచారం.. ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.!
World No Tobacco Day: సిగరెట్ వదిలేసిన 20 నిమిషాల్లోనే అద్భుతం.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రధాన కారణాల్లో పొగాకు వాడకం, ధూమపానం మొదటి వరుసలో ఉంటాయి. ఈ మహమ్మారి బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, పొగాకు వల్ల కలిగే తీవ్రమైన నష్టాలను వివరించడానికి, దానిని మానేయడం వల్ల జరిగే మేలు గురించి ప్రజలను చైతన్యపరచడానికి ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం(World No Tobacco Day) జరుపుకుంటాం.

చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది..ఇన్నేళ్లుగా సిగరెట్లు తాగుతున్నాను, ఇప్పుడు మానేసినా నా ఆరోగ్యం బాగుపడటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది కదా అని. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. మీరు పొగాకుకు దూరమైన కొద్ది నిమిషాల్లోనే మీ శరీరం తనను తాను రిపేర్ చేసుకునే అద్భుతమైన ప్రక్రియను ప్రారంభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శరీరంపై పొగాకు దాడి ఇలా ఉంటుంది
నిపుణుల ప్రకారం పొగాకులో ఉండే నికోటిన్ అనే ప్రమాదకరమైన రసాయనం కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాదు. ఇది రక్తంలో కలిసిపోయి గుండె, రక్తనాళాలు, మెదడుతో సహా శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలం పాటు పొగాకు వాడటం వల్ల క్యాన్సర్, గుండెపోటు, పక్షవాతం, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
మానేసిన క్షణం నుంచి జరిగే మాయాజాలం
మీరు పొగాకును వదిలేసిన క్షణం నుండి మీ శరీరంలో సానుకూల మార్పులు ఎలా మొదలవుతాయో చూస్తే ఆశ్చర్యపోతారు.
కేవలం 20 నిమిషాల్లో
సిగరెట్ ఆర్పేసిన కేవలం 20 నిమిషాలకే మీ శరీరంలో అద్భుతం మొదలవుతుంది. అప్పటివరకు విపరీతంగా పెరిగిన మీ హృదయ స్పందన రేటు, రక్తపోటు నెమ్మదిగా సాధారణ స్థాయికి చేరుకుంటాయి. నికోటిన్ చెర నుంచి శరీరం కోలుకుంటోందనడానికి ఇదే తొలి సంకేతం.
24 గంటల తర్వాత
ఒక్క రోజు గడిచేసరికి, శరీరం తనలోని నికోటిన్ ను, విషతుల్యమైన కార్బన్ మోనాక్సైడ్ ను పూర్తిగా బయటకు పంపేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగి, గుండెపోటు ప్రమాదం తగ్గడం మొదలవుతుంది.

48 గంటల్లో
ఈ సమయానికి దెబ్బతిన్న నరాల చివరలు కోలుకుంటాయి. దీనివల్ల మీ రుచి, వాసన చూసే సామర్థ్యం అమాంతం పెరుగుతుంది. మీరు తినే ఆహారం మరింత రుచిగా అనిపిస్తుంది, ప్రకృతిలోని సువాసనలను మీరు స్పష్టంగా ఆస్వాదించగలుగుతారు.
కొత్త మార్పుకు చిన్నపాటి అడ్డంకి
పొగాకు మానేసిన తొలి రోజుల్లో శరీరం నికోటిన్ కోసం తపించడం వల్ల కొంతమందిలో కోపం, చిరాకు, ఆందోళన కలుగుతాయి. మనసు చంచలంగా మారుతుంది. కానీ వెనక్కి తగ్గకండి. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. కొద్ది రోజుల్లోనే మీ శరీరం ఈ కొత్త ఆరోగ్యకరమైన సమతుల్యతకు అలవాటు పడుతుంది.
రెండు నెలల తర్వాత వచ్చే మార్పులు
పొగాకు రహిత జీవితంలో సుమారు రెండు నెలలు గడిచేసరికి ప్రయోజనాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఊపిరితిత్తుల పనితీరు అద్భుతంగా మెరుగుపడుతుంది. గతంలో మెట్లు ఎక్కాలన్నా, కాస్త వేగంగా నడవాలన్నా ఆయాసపడిన మీరు.. ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా, ఎలాంటి అలసట లేకుండా ఆ పనులను చేయగలుగుతారు. శ్వాస తీసుకోవడం ఎంతో తేలికవుతుంది. రోజువారీ పనులలో మరింత ఉత్సాహంగా, రెట్టింపు శక్తితో ఉన్నట్లు మీకే అర్థమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications