Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
క్రిస్టమస్ అలంకరణలు తేలికగా ఇంట్లోనే!

1. క్రిస్టమస్ కు అలంకరణగా సాంప్రదాయబద్ధంగాను, ప్రాధమికంగాను చేసే అలంకరణలు ఎంతో అందంగా వుంటాయి. ఒక రంగుల పేపర్ ను పొడవాటి ముక్కలుగా కత్తిరించండి. ఆముక్కలకు ఒకవైపు జిగురు అంటించి ఒక సర్కిల్ గా చేయండి. ఈ రౌండు సర్కిళ్ళను ఒకదానితో ఒకటి ఇంటర్ లాక్ చేసివాటిని సీలింగ్ లేదా క్రిస్టమస్ ట్రీనుండి వేలాడదీస్తే మంచి వెలుగులతో మెరుస్తూ అలంకరణగా వుంటాయి.
2. క్రిస్టమస్ అలంకరణలో భాగంగా లాంతర్లు, నక్షత్రాలు వంటివి కూడా తయారు చేస్తారు. వీటిని కూడా రంగు కాగితాలతో లాంతర్లు, నక్షత్రాల ఆకారంలో కత్తిరించి ఒక కార్డ్ బోర్డ్ కు అంటించి వేలాడదీస్తే ఎంతో బాగుంటుంది.
3. విల్లు బాణాలు క్రిస్టమస్ డెకరేషన్ లో భాగంగా పిల్లలను ఎంతో ఆకర్షిస్తాయి. రకరకాల విల్లు బాణాలు కార్డ్ బోర్డులు, రంగుకాగితాలతో తయారు చేసి ఇంటిలోని అలంకరణలలో భాగంగా పెడితే అందంగా వుంటాయి.
4. సాధారణంగా వలయాకారంలో వున్న పుష్పాల, ఆకులతో దండలు తయారు చేస్తారు. వీటిని కూడా చిన్నపాటి బద్దలను గుండ్రంగా వంచి వాటికి పూలు, ఆకులు కట్టి తయారు చేయండి.
5. మంచుముక్కల అలంకరణ క్రిస్టమస్ పండుగలో అందరూ కోరేది. క్రిస్టమస్ ట్రీ కొమ్మలనిండా తెల్లని కాటన్ తో మంచు పడిన భావన కలిగించి ఆనందించండి.



Click it and Unblock the Notifications
