Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మీ ఇంట్లో టీనేజ్ పిల్లలున్నారా..? ఐతే వారి గదులు ఎలా ఉన్నాయి?
మనిషి జీవితంలో అత్యంత ఆనందకరమైన దశ బాల్యం! అది గ్రహించేసరిేక... బాల్యం అంతమరుు కౌమారంలోకి ప్రవేశిస్తాం... కౌమారంలో చేసిన అల్లరి, చిలిపి పనలు జీవితాంతం గుర్తుంటారుు. ఇటు పనితనం పోక అటు పెద్దరికం రాక గందరగోళ స్థితిలో ఉంటారు టీనేజర్స్. ఈ దశలో శారీరకంగా వచ్చే మార్పులే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. వైద్యులు, ఈ దశలోని పిల్లలు ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు కోసం తహతహలాడుతుంటారు. తమకంటూ ప్రైవసీ ఉండాలని కోరుకుంటారు.
మానసికంగా తల్లిదండ్రులకు దూరంగా స్నేహితులకు దద్గర చేస్తుందీ దన అని విశ్లేషిస్తారు మానసిక శాస్తవ్రేత్తలు. ఇంకాస్త సరళమైన భాషలో చెప్పాలంటే టెన్త్, ఇంటర్ చదివే పిల్లలని టీనేజ్‌లోకి అడుగుపెట్టినట్లు భావించవచ్చు. ఇంట్లో సరైన వాతావరణం లేకపోతే చదువుకోవడం ఇబ్బందికరంగా మారి చదువుపై ఏకాగ్రత కుదరక పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోలేక పోవచ్చు. ఈ స్థారుులో పిల్లలు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. దాంతో చిన్న విషయాలకు చిరాకు పడటం. పెద్దలపై అలగడం, తమ కంటే చిన్నవాళ్ళతో గొడవ పడటం సామాన్యంగా గమనిస్తూ ఉంటాం.

మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పలువురు తల్లిదండ్రులు పిల్లలకై ప్రత్యేకమైన గదిని కేటాయిస్తున్నారు. ఇలా ప్రత్యేకమైన గదిని కేటాయిం చడం వాళ్ళకు ఉత్సాహాన్నిస్తుంది. స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరించే దిశగా పిల్లలు గదుల్ని ఏర్పాటు చేస్తే వాళ్ళల్లో చురుకుదనం పెరుగుతుంది. ఆ గదికి లేత గదిలో రంగుకు తగ్గ కర్టెన్లు ఉంటే మరింత ఆకర్షణీ యంగా ఉంటుంది. టీనేజ్ పిల్లలు నిత్యం వాడే ప్రతి వస్తువుకు వాళ్ళకు కేటాయించిన గదిలో సరైన స్థానంలో అమర్చాలి.
టీనేజ్‌లోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందువల్ల వీలైనంతవరకు వారికి ఒక ప్రత్యేక గదిని కేటాయించితే మంచిది. తమ గది అనే ఆలోచన కలగగానే వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందువల్ల వారి అభిరుచులను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా గది ఏ రంగులో ఉంటే ఇష్టమో ఆ విధంగా ఉండేలా చూసుకోవాలి.
రంగులను క్రియేటివ్‌గా వేస్తే బావుంటుంది. బాక్‌గ్రౌండ్ అంతా ఒకే కలర్‌లో ఉండనవసరం లేదు. గ్రే, గ్రీన్, బ్లూ కలర్స్‌లో బాగా లైట్‌గా ఉండే షేడ్‌ని ఎంచుకుంటే బావుంటుంది. ఆ రంగులవల్ల గోడలు ప్లెజంట్‌గా అనిపిస్తాయి. టీనేజర్ బాగా ఆడుతూ పాడుతూ కులాసాగా ఉండే వ్యక్తి అయితే, సన్నీ ఎల్లో, గ్రాస్ గ్రీన్ రంగులు బావుంటాయి. అవి వారి మనస్తత్వానికి అనువుగా ఉండటం వల్ల వారు హ్యాపీగా ఉండగలుగుతారు. అంతేకాకుండా జీవితాన్ని కొత్తకోణంలోకి మలుపు తిప్పుకోగ లుగుతారు.
టీనేజర్స్ గదిలో ఉండే మంచం కొద్దిగా పెద్దదిగా ఉండాలి. అలాగే ఆ గదిలో వార్డ్‌రోబ్స్ ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఒక వార్డ్‌రోబ్‌కి అద్దం బిగించితే మంచిది. తెలుపు, మెరైన్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, గ్రే రంగులైతే ఫర్నిచర్‌కి కూడా సూట్ అవుతాయి. షెల్వ్స్‌కి ఉండే స్టాండ్‌లు లేతరంగులలో, మంచి ఆకృతిలో ఉంటే, పుస్తకాలు ఉంచడానికి అనువుగా ఉంటాయి. అలాగే చదువుకి సంబంధించినవాటిని ఉంచుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. కంప్యూటర్ తప్పనిసరి కనుక, అనువుగా ఉండేలా అమర్చుకోవాలి.
మూయడానికి అనువుగా ఉంటే డ్రా ఉన్న టేబుల్స్, కొన్ని ఓపెన్‌గా ఉన్న టేబుల్స్ ఉంటే బొమ్మలను షోగా అమర్చుకోగలుగుతారు. ఒకవేళ టీనేజర్లు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నవారైతే వాటికి సంబంధించిన వస్తువులను అమర్చుకోగలుగుతారు. ఉదాహరణకి బెడ్‌కి వెనకాల ఉండే గోడకు వాల్ పేపర్‌ని బాస్కెట్‌బాల్ లేదా ఫుట్‌బాల్ థీమ్‌తో ఉన్నది అమర్చుకుంటే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications