For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Raksha Bandhan 2021: రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటాము?

రక్షాబంధన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము?

|

రక్షాబంధన్ అనేది హిందూ మత పండుగలలో అత్యంత ప్రాచుర్యం పొందినది. ఈ వేడుకను ఒక సోదరుడు మరియు సోదరి మధ్య బంధం కొరకు జరుపుకుంటారు. ఇది భారతదేశం యొక్క పురాతన పండగలలో ఒకటిగా ఉంది. అందువలన ఇది పురాణాలు మరియు లెజెండ్స్ తో సంబంధం కలిగి ఉంది.

ఇది రక్త సంబందంతో నిమిత్తం లేకుండా మొత్తం సోదరులు మరియు సోదరీమణులు చేసుకొనే చాలా ప్రత్యేకమైన ఉత్సవం. శ్రావణమాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను రాఖీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. సాంప్రదాయకంగా,సోదరీమణులు సోదరుని యొక్క మణికట్టు మీద ఒక థ్రెడ్ (రాఖీ) కడితే చెడు నుండి రక్షణ కలుగుతుందని నమ్మకం. దానికి బదులుగా,సోదరులు వారి సోదరీమణుల జీవిత కాలంలో అన్ని రకాల చెడుల నుండి రక్షణ కల్పిస్తానని మరియు జాగ్రత్తగా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తారు.

అందువలన,రక్షాబంధన్ సోదరులు మరియు సోదరీమణులు మధ్య బందానికి గుర్తుగా ఉంటుంది. రక్షాబంధన్ అంటే అర్ధం రెండు వైపులా నుండి రక్షణను సూచిస్తుంది. ఇది కూడా సామాజిక బందానికి గుర్తు. ఇది సోదరులు మరియు సోదరీమణుల పండుగగా ప్రాచుర్యం పొందినప్పటికీ,రాఖీని కుమారుడు, తన భర్త,తల్లి భార్య మొదలైన వారి రక్షణక గుర్తుగా అనుసంధానం చేయబడుతుంది. భారతదేశ చరిత్రలో మహిళలు బంధంనకు గుర్తుగా గొప్ప పురుషుల మణికట్టు మీద రాఖీ కట్టటం వలన అనేక ఉపద్రవాలను అడ్డుకున్నట్లు ఉదాహరణలు ఉన్నాయి.

కాబట్టి, మీరు ప్రారంభం నుండి రక్షాబంధన్ ను ఎందుకు,ఎలా ఎక్కువ ఉత్సాహంతో జరుపుకుంటారో తెలుసుకోండి. దానిని తెలుసుకోవాలనుకుంటే దీనిని చదవండి.

రాఖీ యొక్క లెజెండ్స్ మరియు పురాణాలు

రాఖీ యొక్క లెజెండ్స్ మరియు పురాణాలు

రక్షాబంధన్ పండుగ చుట్టూ చాలా మంది పురాణాలు మరియు లెజెండ్స్ ఉన్నారు. వాటిలో ఒకటి ఏమిటంటే అమరావతి (ఇంద్రుడు యొక్క నివాసం) మీద ఒక భూతం దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుడు భార్య శచీదేవి సహాయం కొరకు లార్డ్ విష్ణువు వద్దకు వెళ్ళెను. ఇంద్రుడిని కాపాడటానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ ఒక పవిత్రమైన కాటన్ థ్రెడ్ కట్టమని శచీదేవికి ఇచ్చెను. అప్పుడు శచీదేవి ఇంద్రుడు యొక్క మణికట్టు మీద థ్రెడ్ కట్టెను. చివరికి విష్ణువు దయ్యంను ఓడించేను. ఆ విధంగా రాఖీ లేదా రక్షణ థ్రెడ్ ఉనికిలోకి వచ్చింది.

రాఖీ యొక్క లెజెండ్స్ మరియు పురాణాలు

రాఖీ యొక్క లెజెండ్స్ మరియు పురాణాలు

అనేక ఇతర పురాణాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుని చేతికి రాఖీ కట్టింది. అలాగే పార్వతి దేవి విష్ణువు యొక్క మణికట్టు మీద రాఖీ కట్టి మరియు ఆమె సోదరునిగా అతనిని అంగీకరించేనని వేదాలలో పేర్కొన్నారు. దానికి బదులుగా విష్ణువు ప్రమాదంలో ఉన్నప్పుడు పార్వతి దేవిని రక్షించేను.

చారిత్రాత్మకంగా రాఖీ యొక్క ప్రస్తావన

చారిత్రాత్మకంగా రాఖీ యొక్క ప్రస్తావన

ఒక కధ ప్రకారం,గ్రేట్ అలెగ్జాండర్ భారతదేశం మీద దాడి చేసినప్పుడు రాజు పోరస్ అతన్ని నిలిపివేశారు. యుద్ధం జరిగింది. ఆ సమయంలో,అలెగ్జాండర్ భార్య రొక్షన,యుద్ధంలో ఆమె భర్తను చంపవద్దని అభ్యర్థిస్తూ ఒక లేఖతో పాటు ఒక పవిత్ర థ్రెడ్(రాఖీ) ను పంపెను. అందువలన,యుద్ధం సమయంలో,పోరస్ అతడి మణికట్టు పై ముడిపడిన రాఖీని గుర్తుపెట్టుకొని అలెగ్జాండర్ ను విడిచిపెట్టెను.

చారిత్రాత్మకంగా రాఖీ యొక్క ప్రస్తావన

చారిత్రాత్మకంగా రాఖీ యొక్క ప్రస్తావన

మరొక సందర్భంలో,ఒక వితంతువు అయిన చిత్తూరు రాణి కర్ణవతి చక్రవర్తి హుమాయున్ కి ఒక రాఖీ పంపారు. బహదూర్ షా సుల్తాన్ దాడి నుండి తన రాజ్యాన్ని రక్షిస్తారని ఆశిస్తూ,రాణి కర్ణవతి సహాయం కోరుతూ చక్రవర్తి హుమాయున్ కు ఒక లేఖ తో పాటు రాఖీని పంపారు. హుమాయున్ ఆదేశాలతో సహాయం కోసం తన దళాలను పంపెను. కానీ దురదృష్టవశాత్తు దళాలు ఆలస్యంగా వచ్చాయి. విధవా రాణి అయిన కర్ణవతి ఆమె పరువును కాపాడుకోవటానికి ఇతర మహిళలతో పాటు జౌహర్ కి పాల్పడ్డారు. తరువాత హుమాయున్ బహదూర్ షా ను ఓడించి రాణి కర్నపతి కుమారుడు విక్రమ్జిత్ కి రాజ్యంను పునరుద్దించెను.

 భారతదేశంలో రక్షాబంధన్

భారతదేశంలో రక్షాబంధన్

రాఖీ పూర్ణిమ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక రాఖి బంధన్ ఒక సంప్రదాయంగా ఉన్నది. భారతదేశం యొక్క వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలను అనుసరిస్తారు. ఉత్తర భారతదేశంలో రాఖీ పూర్ణిమ రోజు గోధుమ మరియు బార్లీ వంటి పంటలను నాటుతారు. కజరి పూర్ణిమ అని పిలుస్తారు. అలాగే భగవతి దేవిని పూజిస్తారు. పశ్చిమ భారతదేశంలో దీనిని నారియల్ పూర్ణిమ అని అంటారు. ఆ సమయంలో సముద్ర దేవుడు వరుణుడికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. దక్షిణాదిన దీనిని శ్రావణ పూర్ణిమ అని అంటారు. అంతేకాక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

 రక్షాబంధన్ ప్రాముఖ్యత

రక్షాబంధన్ ప్రాముఖ్యత

రక్షాబంధన్ పండుగ సోదరులు మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది. దూరంగా ఉన్న మొత్తం కుటుంబ సభ్యులందరినీ ఒక్కచోట చేర్చటానికి కూడా సహాయపడుతుంది. ఈ పండుగలో ఒక ఆధ్యాత్మిక పాయింట్ ఉంది. స్వచ్చమైన ఆలోచనలతో ఒక మంచి జీవితాన్ని గడపటానికి ఆ రోజున పవిత్ర ప్రతిజ్ఞ చేయటానికి సహాయపడుతుంది. కుడి చేతికి వేసే రాఖీ అని పిలిచే ఒక యజ్ఞోపవీతం. ఇది మేము ప్రపంచంలో దుర్గుణాలు నుండి మరియు భౌతికవాదం మాపై పడకుండా ఆధ్యాత్మికంగా మమ్మల్ని రక్షించడానికి ఒక రిమైండర్ గా ఉంటుంది. రాఖీ అనే యజ్ఞోపవీతం సోదరి అభిమానంతో ఒక సోదరుని యొక్క మణికట్టు మీద కడుతుంది. ఆమె ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తుంది. ఆమె సోదరుని ఆధ్యాత్మిక దృష్టి ద్వారా మార్గనిర్దేశాన్ని చేస్తుంది.

English summary

Why Is Rakshabandhan Celebrated?

Rakshabandhan is the one of the most popular Hindu festival. It is the celebration of the bond between a brother and a sister. It is one of the ancient festivals of India and therefore has a whole lot of myths and legends associated with it.
Desktop Bottom Promotion